S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/08/2018 - 01:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా భారత్-నేపాల్ ముందడుగు వేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలి మధ్య ఇందుకు సంబంధించి శనివారం విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయి. రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం సహా అనేక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని, ఆ దిశగా మరిన్ని చర్యలు చేపట్టాలని ఇరువురు ప్రధానులు నిర్ణయించారు.

04/08/2018 - 03:59

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని, కేంద్రం దిగివచ్చేవరకూ దీక్షలు కొనసాగిస్తామని ఆ పార్టీ ఎంపీలు స్పష్ట చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాస్‌రెడ్డి చేపట్టిన అమరణ నిరహారదీక్ష శనివారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది.

04/07/2018 - 17:43

న్యూఢిల్లీ: సల్మాన్‌ఖాన్‌కు మెయిల్ మంజూరు అయింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ జోథాపూర్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. 50వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు. సల్మాన్ రెండు రోజులు జైలులో ఉన్నారు. ఇదిలా ఉండగా సల్మాన్‌కు బెయిల్ మంజూరుచేయటాన్ని పెటా ఖండించింది.

04/07/2018 - 17:42

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ భవన్‌లో నిరాహారదీక్ష చేస్తున్న వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన దీక్షా శిబిరం నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకున్నారు. దీంతో వైద్యులు ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రకి తరలించారు. ఆసుపత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తానని ఎంపీ మేకపాటి ప్రకటించారు. మేకపాటిలో బీపి హెచ్చుతగ్గులు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.

04/08/2018 - 01:25

ముంబయి:ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల వ్యవహారానికి సంబంధించి ఆ బ్యాంకు సీఇఓ చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు ఇమ్మిగ్రేషన్ అధికారులు షాకిచ్చారు. ఈ కేసులో సీబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. ఆయనతో పాటు వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ దూత్‌పై కూడా విదేశీ ప్రయాణానికి సంబంధించిన విషయంలో ఆంక్షలు విధించారు.

04/07/2018 - 13:18

గుంటూరు:ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గుంటూరు టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. 12మంది కార్యకర్తలు గుండుకొట్టించుకుని తమ నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతబట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగు విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి తదితరులు పాల్గొన్నారు.

04/07/2018 - 13:13

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైకాపా ఎంపీలు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. శనివారంనాడు దీక్ష చేస్తున్న ఎంపీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

04/07/2018 - 12:31

పనాజీ: గోవాలో హై అలర్ట్ ప్రకటించారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అలర్ట్‌గా ఉండాలని, గోవా తీరంలో ఉన్న నౌకలకు, క్యాసినోలు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర పోర్ట్స్‌శాఖ మంత్రి జయేశ్ తెలిపారు.

04/07/2018 - 12:19

న్యూఢిల్లీ: భారత్‌తో స్నేహామే తమకు కీలకమని నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తెలిపారు. భారత్ పర్యటనలో ఉన్న ఆయనకు ఇవాళ ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భనవ్‌లో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అక్కడ ప్రధాని మోదీని కూడా నేపాల్ ప్రధాని కలుసుకున్నారు.పొరుగు దేశమైన భారత్‌తో తాము స్నేహ సంబంధాలను ఆశిస్తున్నామని ఈ సందర్భంగా ప్రధాని ఓలీ తెలిపారు.

04/07/2018 - 04:47

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడంతో పాటు, విభజన హామీలను అమలు చేయాలంటూ టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం కూడా పార్లమెంట్ అవరణలో తమ నిరసన ఉద్యమాన్ని కొనసాగించారు. కేంద్రం బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఏపీకి చెందిన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు అలాగే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్ అవరణలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తమ నిరసనను తెలియజేస్తునే ఉన్నారు.

Pages