S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/09/2018 - 12:58

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం నుంచి ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, హోరు గాలికి వైఎస్సార్‌సీపీ ఎంపీల దీక్షా శిబిరం కూలిపోయింది. దీక్ష స్థలం దగ్గర టెంట్లు కూలిపోయాయి. దీంతో ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది.

04/09/2018 - 04:23

న్యూఢిల్లీ: ప్రజలు ప్రధానంగా మూడు సూత్రాలపై ఆధారపడి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 3ఆర్‌లుగా పిలిచే అవి వరుసగా ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’. వీటిని పాటిస్తే వ్యర్థాలను మరింత స మర్థవంతంగా నిర్వహించడమే కాదు, సుస్థిరాభివృద్ధి సా ధించవచ్చునన్నారు. ఇండోర్‌లో మంగళవారం నుంచి ని ర్వహించనున్న ‘ఎనిమిదో ప్రాంతీయ 3ఆర్ ఫోరమ్’ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానిపై వ్యాఖ్యలు చే శారు.

04/09/2018 - 03:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: చాలామంది ఐపీఎస్ అధికారులకు 2016లో తమ ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. వీరిలో డీజీపీలు, ఐజీపీలు కూడా ఉన్నారు. ఫలితంగా వీరికి ప్రమోషన్ల నిరాకరణ, విజిలెన్స్ క్లియరెన్స్‌ను రద్దు చేయడం జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 1968 అఖిలభారత సర్వీసు (ప్రవర్తన) నిబంధనల ప్రకారం, ఆఖిల భారత పోలీ సు సర్వీసుకు చెందిన అధికార్లు ప్రతి ఏటా జనవరి 31లోగా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలి.

04/09/2018 - 03:33

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటైన ‘్భటీ బచావో.. భేటీ పడావో’
ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం గుర్గావ్‌లో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న యువతులు

04/09/2018 - 03:27

కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ అల్వా భర్త శనివారం బెంగళూరులో కన్నుమూశారు. ఆదివారం అల్వాను పరామర్శిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పక్కనే కర్నాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ మున్సిపల్ కార్మికులతో ముచ్చటిస్తున్న దృశ్యం.

04/09/2018 - 03:22

బెంగళూరు, ఏప్రిల్ 8: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైనదంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. కేవలం ఇటువంటి పన్ను విధా నం సూడాన్, పాకిస్తాన్‌లలో మాత్రమే అ మలవుతోందన్నారు. దీన్ని తన సహజధోరణిలో ‘గబ్బర్‌సింగ్ పన్ను’ అంటూ పే ర్కొన్న రాహుల్, 2019లో తాము అధికారంలోకి వస్తే, దీన్ని మరింత సరళతరం చే సి, ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో రూ పొందిస్తామన్నారు.

04/09/2018 - 03:22

లక్నో, ఏప్రిల్ 8: భాజపా ఎమ్మెల్యే తనపై అత్యాచా రం చేసాడంటూ ఒక మహిళ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం ముందు ఆదివారం ఆత్మహత్యాయ త్నం చేయడంతో పార్టీ చిక్కుల్లో పడింది. పోలీసుల కథ నం ప్రకారం.. ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలోని ఉన్నావో జిల్లాకు చెందిన బాధితురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నిస్తుండగా పో లీసులు అడ్డుకున్నారు.

04/09/2018 - 03:21

లక్నో, ఏప్రిల్ 8: ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అసమ్మతి సెగలు చుట్టుముడుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ మిత్ర ధర్మాన్ని పాటించడం లేదని, తమ పార్టీని, నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని తాజాగా బీజేపీ కూటమిలోని ఎస్‌బీఎస్‌పీ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

04/09/2018 - 03:20

భోపాల్, ఏప్రిల్ 8: మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలో 6.7 లక్షల ఓటర్లను అనర్హులుగా తేల్చారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 7 వరకు నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలో చనిపోయిన లేదా రెండుసార్లు రిజిస్టర్ అయిన లేదా వేరే చిరునామాకు మారిపోయిన ఓటర్ల జాబితా 6.7 లక్షలు ఉన్నట్లు ఎన్నికల ప్రధానాధికారి శాలినా సింగ్ తెలిపారు.

04/09/2018 - 02:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా వద్దు, ప్యాకేజీ కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేకహోదా కావాలంటూ కేంద్రంపై ఉద్యమం చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు.

Pages