S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/10/2018 - 02:39

ఉన్నావో (యూపీ), ఏప్రిల్ 9: భాజపా ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెన్‌గర్ అత్యాచారం జరిపాడని ఆరోపించిన 18 ఏళ్ల బాధితురాలి తండ్రి సోమవారం పోలీసు కస్టడీలో మృతి చెందడంతో యుపిలోని భాజపా ప్రభుత్వం ఇరుకున పడింది. గత రాత్రి 50 సంవత్సరాల వయసున్న ఆమె తండ్రి జైల్లో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా సోమవారం ఉదయం మరణించాడు.

04/10/2018 - 02:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 : మెజారిటీ హిందువుల ఓట్లను కొల్లగొట్టడానికి, ఇతర పార్టీలను హిందూ వ్యతిరేకులుగా ముద్రవేసే లక్ష్యంతో అయోధ్యలో రామాలయం నిర్మించాలంటూ భాజపా ‘బలహీన ఉద్యమం’ చేపట్టే అవకాశమున్నదని, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ, 1989లో బీజేపీ చేసిన పాలంపూర్ తీర్మానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

04/10/2018 - 04:45

న్యూఢిల్లీ: బీజేపీతో కుమ్మక్కయితే కేంద్రంపై తామెందుకు పోరాటం చేస్తామని, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడతామని వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరహారదీక్ష సోమవారానికి నాలుగో రోజుకు చేరుకుంది.

04/10/2018 - 01:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలుగుదేశం ఎంపీలు మహాత్మాగాంధీ సమాధి వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. సోమవారం ఉదయం టీడీపీ లోక్‌సభ పక్ష నాయకుడు తోట నర్సిహం నివాసంలో ఎంపీలు సమావేశమయ్యారు. తరువాత ప్రత్యేక బస్సులో ఎంపీలందరూ మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్దకు చేరుకుని జాతిపితకు

04/10/2018 - 01:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ప్రధాని నరేంద్రమోదీ విధానాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. ఆయన కులతత్వవాదిగా వ్యవహరిస్తున్నారని, దళితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అనుసరిస్తున్న అణచివేత సిద్ధాంతానికి వ్యతిరేకంగా తమ పార్టీ గట్టి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

04/10/2018 - 01:05

ధర్మశాల, ఏప్రిల్ 9: హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా నర్పూర్ సమీపంలోని ఓ లోయలోకి స్కూలు బస్సు దొర్లిపడిన ప్రమాదంలో 26 స్కూలు పిల్లలు సహా 30 మంది దుర్మరణం చెందారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారిలోఎక్కువ మంది పిల్లలేనని అధికార వర్గాలు తెలిపాయి.

04/09/2018 - 17:22

చత్తీస్‌గఢ్: చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని భీజాపూర్ జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఐఈడీ పేల్చటంతో ఇద్దరు జవాన్లు చనిపోయారు. మరో 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలించారు.

04/09/2018 - 17:13

న్యూఢిల్లీ: దళితులపై దాడులు, భాజాపా ప్రభుత్వ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిరాహారదీక్ష చేపట్టారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో రాహుల్ దీక్షకు దిగారు. దీక్షకు ముందు ఆయన మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. రాహుల్‌తో పాటు మల్లికార్జున్ ఖర్గే, షీలాదీక్షిత్, అశోక్ గెహ్లట్, అజయ్ మాకెన్ దీక్షలో కూర్చున్నారు.

04/09/2018 - 13:50

న్యూఢిల్లీ: ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని సుప్రీంకోర్టు నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ... కేరళలోని దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. తంపనూర్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకున్న వందలాది మంది దళితులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పునరుద్ధరించాలనీ... సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు.

04/09/2018 - 13:07

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. వారికి సంఘీభావం తెలిపిన పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఎంపీలతోపాటు దీక్షలో కూర్చున్నారు. వైఎస్‌ విజయమ్మతోపాటు వైఎస్సార్‌ సీపీ నేతలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు.

Pages