S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/05/2018 - 13:53

తిరువనంతపురం: మలయాళం స్టార్ నటుడు అజిత్(56) గురువారం ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూడు దశాబ్దాల పాటు 500 లకు పైగా సినిమాల్లో నటించారు. మలయాళంలో పూర్తిగా, కొన్ని తమిళ్, హిందీ సినిమాల్లో కూడా అజిత్ నటించారు. మలయాళంలో విలన్ రోల్ అంటూ డైరెక్టర్స్‌కు ముందుగా గుర్తొచ్చేది అజితే. అజిత్ అంత్యక్రియలు కొల్లాంలో జరగనున్నాయి.

04/05/2018 - 13:41

న్యూఢిల్లీ: విపక్షాలు పార్లమెంటు ప్రాంగణంలో గురువారం ఉదయం మానవహారం చేపట్టాయి. రాజ్యసభ ఛైర్మన్‌ కార్యాలయం నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు చేపట్టిన మానవహారంలో కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా తెలుగుదేశం, సమాజ్‌ వాదీ పార్టీ, బీఎస్పీ, తృణమూల్‌, ఎన్సీపీ, వామపక్షాలు, డీఎంకే తదితర విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.

04/05/2018 - 13:01

చెన్నై: కావేరీ మేనేజిమెంట్ బోర్డు ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా డీఎంకే ఇచ్చిన పిలుపుతో తమిళనాడు వ్యాప్తంగా గురువారంనాడు బంద్ జరుగుతోంది. బంద్ సందర్భంగా బస్సు సర్వీసులకు అంతరాయం కలిగింది. సరిహద్దులోని కర్ణాటక నుంచి బస్సు సర్వీసులను అడ్డుకున్నారు. పలు రైళ్ల రాకపోకలకూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసేశారు.

04/05/2018 - 15:17

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో గురువారం అదే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం సభ మొదలవగానే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగడంతో అరనిమిషంలోపే సభ వాయిదా పడింది. అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి కావేరు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

04/05/2018 - 15:06

జోథ్‌పూర్‌: కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌‌ను జోథ్‌పూర్‌ కోర్టు దోషిగా తేల్చింది. మిగతా ఐదుగురు నటులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈరోజు తీర్పు సందర్భంగా సల్మాన్‌ఖాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, టబూ, సొనాలిబింద్రే, నీలం తదితరులు జోథ్‌పూర్ కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బింద్రే, టబు సహా ఐదుగురు నిర్దోషులని, వారు వేటాడలేదని పేర్కొన్నారు.

04/05/2018 - 04:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రైవేటు సంస్థ షిరిడి ఇండస్ట్రీస్‌లో జరిగిన అక్రమాలు, అవకతవకలతో అతడికి సంబంధం ఉందని ఆరోపించిన కాంగ్రెస్ ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరింది.

04/05/2018 - 03:32

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: టీఆర్‌ఎస్ తరపున ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన బడుగుల లింగయ్య, జోగినపల్లి సంతోష్, బండా ప్రకాశ్ ముదిరాజ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన 12 మంది సభ్యుల చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఈ ముగ్గురు సభ్యులు చైర్మన్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య వారికి శుభాకాంక్షలు తెలిపారు.

04/05/2018 - 03:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఆధార్ పథకాన్ని నిపుణుల బృందం ఆమోదించిందని, ఇది విధానపరమైన నిర్ణయమైనందున న్యాయ సమీక్ష పరిధిలోకి ఈ అంశం రాదని సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం తెలిపింది. ఆధార్ పథకం చెల్లుబాటుపై వివిధ వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారధ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఈ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.

04/05/2018 - 04:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: విపక్ష సభ్యుల ఆందోళనలతో వరసగా బుధవారం కూడా రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. ఏకంగా 11సార్లు సభ వాయదా పడింది. బుధవారం రాజ్యసభ ప్రారంభమైన అనంతరం ఇటీవల వివిధ రాష్ట్రాల నుంచి సభకు ఎన్నికైన కొత్త సభ్యుల చేత చైర్మన్ వెంకయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.

04/05/2018 - 02:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసమే ఢిల్లీకి వచ్చి తనపై కేసులు లేకుండా లాబీయింగ్ చేసుకుంటున్నాడని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆరోపించారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఆ పార్టీ ఎంపీలు మేకపాటి రాజామోహన్‌రెడ్డి, వరప్రసాద్, మిధున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డి తదితరులు విలేఖరులతో మాట్లాడారు.

Pages