S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/04/2018 - 01:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన సభ్యులు 41 మంది మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నర్సింహరావు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నుంచి ఎన్నికై నేడు ప్రమాణస్వీకారం చేశారు.

04/04/2018 - 01:33

శివమొగ్గ (కర్నాటక), ఏప్రిల్ 3: ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శల దాడి చేశారు. వ్యంగ్యం, ఆగ్రహం, చురకలతో ఆయన విమర్శలు కొనసాగాయి. షెడ్యూల్డు కులా లు, తెగలపై పెరుగుతున్న దాడులపైన, ఎస్‌సీఎస్‌టీ అట్రాసిటీయాక్ట్ నిర్వీర్యంపైన ప్రధా ని మోదీ ఒక్కమాట కూడా మాట్లాడలేదెందుకుని రాహుల్ ప్రశ్నించారు.

04/04/2018 - 01:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: భారత్ బంద్ సందర్భంగా చెలరేగిన హింస వెనుక రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాలున్నాయంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పదునైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆయన అస్త్రాలు సంధించారు. ప్రజాదరణ లేని, ప్రజల తిరస్కరణకు గురైన రాజకీయ పార్టీలే ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయని అమిత్‌షా విమర్శించారు.

04/04/2018 - 01:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రాజకీయ లబ్ధికోసమే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలకు తెర తీసారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం పార్లమెంట్‌లో ఎంపీ రామ్మోహన్ నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ కేవలం లోక్‌సభ ఎంపీల చేత మాత్రమే రాజీనామాలు చేస్తామంటున్నారని, రాజ్యసభ ఎంపీల చేత ఎందుకు రాజీనామాలు చేయించడం లేదని ప్రశ్నించారు.

04/04/2018 - 01:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంపై తెలుగుదేశం, వైకాపా, కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం తదితర పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో పదవ రోజు కూడా చర్చకు రాలేదు. మంగళవారం కూడా అన్నా డీఎంకే సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు.

04/04/2018 - 04:15

న్యూఢిల్లీ: పదవ తరగతి గణితశాస్త్ర పేపరుకు తిరిగి పరీక్ష నిర్వహించడంలేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం ప్రకటించింది. పాఠశాల విద్యావిధానంలో సీబీఎస్‌ఈ తరగతుల్లో 10వ తరగతి కేవలం ‘ఆంతరంగిక సెగ్మెంట్’ మాత్రమే అయినందువల్ల పరీక్షను తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.

04/04/2018 - 04:14

న్యూఢిల్లీ: ఏపీకి కేంద్రం అందించిన సాయం, విభజన హామీల అమలుపై ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకూ పోరాడుతానని, లక్ష్య సాధనకు భాజపాయేతర పార్టీల సాయం కూడగడతానని అన్నారు.

04/04/2018 - 04:11

న్యూఢిల్లీ: బూటకపు వార్తలు రాసిన, ప్రసారం చేసిన పాత్రికేయుల అక్రిడిటేషన్లను దశలవారీగా రద్దు చేస్తూ సరికొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవలసి వచ్చింది.

04/04/2018 - 04:12

న్యూఢిల్లీ తెదేపా ప్రభుత్వ హయాంలో పది అంశాల్లో సీబీఐ దర్యాప్తునకు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేశ్ సిద్ధమా? అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.

04/04/2018 - 01:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పార్లమెంట్ హాలు వేదికగా ప్రధాని మోదీపై యుద్ధం ప్రకటించారు. మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో దాదాపు రెండున్నర గంటలపాటు బైఠాయించి విభజిత ఏపీకి ప్రధాని మోదీ చేస్తున్న అన్యాయాన్ని విపక్ష నేతలకు సోదాహరణంగా వివరించారు. రాష్ట్ర ప్రజల హక్కుల సాధనకు సహకరించాలని అన్ని పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు.

Pages