S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/06/2018 - 00:25

రాష్టప్రతి భవన్ ప్రాంగణంలోని మొగల్ గార్డెన్స్ అందాలను ఆస్వాదిస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు.
వీక్షకులను త్వరలోనే ఈ గార్డెన్స్‌లోకి అనుమతించనున్నారు.

02/06/2018 - 01:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత సైన్యం శక్తి సామర్థ్యాలు, శౌర్యంపై ప్రజలకు ఎనలేని విశ్వాసం, నమ్మకం ఉందని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆదివారం నాడు జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ దళాల కాల్పుల్లో నలుగురు సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ‘ఇలాంటి ఘటనలు మన సైనికుల మనోధైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవు’ అని సోమవారం రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.

02/06/2018 - 00:20

వనపర్తి, ఫిబ్రవరి 5: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సుస్మితాదేవ్ అన్నారు. సోమవారం వనపర్తి పద్మావతీ శ్రీనివాస కల్యాణ మంటపంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా గర్జనలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

02/06/2018 - 00:18

మిస్ వరల్డ్-2017 మానుషి చిల్లార్ సోమవారం ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లారు.
చిల్లార్‌కు శాలువా కప్పి సత్కరిస్తున్న వెంకయ్య సతీమణి.

02/06/2018 - 00:15

నల్లగొండ, ఫిబ్రవరి 5: ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న జమిలి ఎన్నికల ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమని, ఈ ప్రతిపాదనను అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయనిసీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు.

02/06/2018 - 00:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని ప్లకార్డుతో కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో వౌనంగా నిరసన తెలిపారు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అండర్-19 క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుచుకున్న సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. తరువాత వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించిన అనంతరం జీరో అవర్‌ను ప్రారంభించారు.

02/06/2018 - 00:10

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ లోక్‌సభ సభ్యుడు హుకుంసింగ్ (79) ఆకస్మిక మరణానికి సంతాప సూచకంగా లోక్‌సభ సోమవారం ఎలాంటి కార్యక్రమం నిర్వహించకుండానే మంగళవారానికి వాయిదాపడింది.

02/06/2018 - 00:09

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: రాష్ట్ర విభజన చట్టంలో తనకు సంబంధించిన హామీలన్నింటిని పూర్తి చేయిస్తానని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలుగుదేశం పార్టీ నాయకులకు హామీ ఇచ్చారు. అయితే శాసన సభ సీట్లు పెంచే అంశంపై ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మిగతా శాఖలకు సంబంధించిన హామీల గురించి తానేమీ చేయలేనని రాజ్‌నాథ్ వారికి స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది.

02/05/2018 - 04:28

ఎగ్జిట్ గేట్ వద్ద కర్నాటక సర్కార్ ఇది పది శాతం కమిషన్ల ప్రభుత్వం
రాష్ట్రంలో బీజేపీకి పగ్గాలు తథ్యం బెంగళూరు ర్యాలీలో ప్రధాని మోదీ

02/05/2018 - 04:22

అగర్తలా, ఫిబ్రవరి 4: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని, వామపక్ష లానకు స్వస్తిపలికి అక్కడ కమలం వికసించటం తథ్యమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. అవినీతిమయమైన వామపక్ష ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, ఈ నెల 18న జరిగే ఎన్నికల్లో తమ పార్టీకే పట్టం కడతారన్న నమ్మకం తనుకుందని ఆదివారం ఇక్కడ జరిగిన రోడ్ షోలో రాజ్‌నాథ్ అన్నారు.

Pages