S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/07/2017 - 02:10

చిత్రం..తమిళనాడు గవర్నర్‌గా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన భన్వారీలాల్ పురోహిత్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి పళనిస్వామి

10/07/2017 - 02:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి బాణసంచా అమ్మకాలపై ఆంక్షలను కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్ వాదనలు విన్న సుప్రీం కోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఢిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్(ఎన్‌సిఆర్) ప్రాంతంలో బాణసంచా అమ్మకాలపై గత ఏడాది సుప్రీం కోర్టు నిషేధం విధించింది. 2016 నవంబర్ 11న ఎన్‌సిఆర్‌లో బాణసంచా అమ్మకాలపై బెంచ్ నిషేధం విధించింది.

10/07/2017 - 02:07

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన రెండు డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే కళ్లు బైర్లుకమ్ముతున్నాయి. అక్రమ, నల్ల ధనం సమాచారం చూసి అధికార వర్గాలు అవాక్కవుతున్నాయి. పెద్దనోట్ల రద్దయ్యే వరకూ ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు నడవని ఖాతాల్లో ఆ తరువాత పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహించినట్లు ప్రభుత్వం గుర్తించింది.

10/07/2017 - 02:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలో మరణశిక్షల అమలుకు సంబంధించిన కీలక అంశంపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. ముఖ్యంగా ‘తుది శ్వాస విడిచే వరకూ నేరస్తుణ్ని ఉరికంబానికి వేలాడదీయడం’ అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం జవాబు ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది. ఈ న్యాయపరమైన నిబంధనను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రానికి ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

10/07/2017 - 02:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ‘పొరుగు దేశాల నుంచి భౌగోళిక, రాజకీయ ఇబ్బందులున్నా.. సరిహద్దుల్లో శత్రుమూకల అతిక్రమణలు పెచ్చుమీరుతున్నా.. వీటన్నింటినీ అధిగమించి ప్రపంచ రాజకీయ పటంపై భారత్ కీలక పాత్ర పోషిస్తోంది’ అని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే అన్నారు. పాకిస్తాన్, చైనాల పేర్లు ప్రస్తావించకుండా, ‘ఇలాంటి తరుణంలో ఏవైపునుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు.

10/07/2017 - 02:05

రొహ్‌తక్, అక్టోబర్ 6: ఇద్దరు సాధ్వీలపై రేప్ కేసులో జైలు ఊచలు లెక్కపెడుతున్న డేరాబాబా గుర్మీత్‌సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీసు ఇంటరాగేషన్‌లో నోరువిప్పడం లేదు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెబుతోందని ఓ సీనియర్ పోలీసు అధికారి శుక్రవారం వెల్లడించారు. అల్లర్ల వెనక ఆమె పాత్రపై విచారణ జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

10/07/2017 - 02:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: రోహింగ్యాల సంక్షోభం ప్రస్తుతం మానవతాపరమైన అంశంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ప్రాంతీయ అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని బంగ్లాదేశ్ శుక్రవారం పేర్కొంది. భారత్ కూడా ఇదే అభిప్రాయంతో ఉందని తెలిపింది.

10/07/2017 - 02:03

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు మార్కులు కలిపే విధానాన్ని ఆపొద్దని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. శుక్రవారం ఈ మేరకు సిబిఎస్‌ఇ, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మోడరేషన్ విధానంపై ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పాత పద్ధతినే కొనసాగించాలని స్పష్టం చేసింది.

10/07/2017 - 02:03

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: రైల్వేల్లో తక్కువ ఖర్చుతో పటిష్ట భద్రత కల్పించే సరికొత్త ఆవిష్కరణలపై శాస్తవ్రేత్తలు దృష్టిపెట్టాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. రైల్వే, మెట్రో ప్రాజెక్టుల్లో చోటుచేసుకుంటున్న సాంకేతిక ప్రగతిపై శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన అంతార్జాతీయ సదస్సులో పీయూష్ మాట్లాడారు.

10/07/2017 - 01:54

చిత్రం..ముంబయ తీరం సమీపంలోని బషర్ దీవిలోని
ఓ చమురు డిపోలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించడంతో చెలరేగిన మంటలు

Pages