S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/13/2016 - 08:56

నాగ్‌పూర్, ఏప్రిల్ 12: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకేసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు మోదీ ప్రభుత్వం వంతపాడుతోందని, విద్యార్థుల్లో అశాంతి తీవ్రంగా పెరగడానికి ఇదే కారణమని వారు నిప్పులు చెరిగారు.

04/13/2016 - 07:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు మంగళవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులు ప్రదానం చేశారు. రాష్టప్రతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో పురస్కారాలు అందజేశారు.

04/13/2016 - 06:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: మిషన్ కాకతీయలాంటి పథకాలకు మహత్మాగాంధీ జాతీయ ఉపాధి కల్పన హామీ పథకం నిధుల వాటాను 60 శాతానికి పెంచాలని కేంద్ర జలవనరుల శాఖ ఉపసంఘం సిఫారసు చేసినట్టు తెలంగాణ నీటిపారుదల మంత్రి, ఉపసంఘం సభ్యుడు హరీశ్‌రావు వెల్లడించారు. పిఎంకెఎస్‌వైలో పది తెలంగాణ నీటి ప్రాజెక్టులు మొదటి ప్రాధాన్యత జాబితాలో, ఒక ప్రాజెక్టు రెండో జాబితాలో చేర్చారన్నారు.

04/13/2016 - 06:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న కరవు పరిస్థితులపై సుప్రీం కోర్టు మంగళవారం మరోసారి కేంద్రాన్ని నిలదీసింది. కరవుపై కేంద్రం స్వయంగా ఎందుకు చర్య తీసుకోవటం లేదని ప్రశ్నించింది. దేశమంతటా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉంటే కేంద్రానికి ఎందుకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

04/13/2016 - 05:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పూర్తిస్థాయి పింఛను పొందడానికి 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో 2006కు ముందు రిటైరయిన పింఛనుదార్ల పింఛను పెరగనుంది. అంతేకాకుండా అప్పటినుంచి ఇప్పటివరకు పెరిగిన పింఛను బకాయిలు కూడా లభించనున్నాయి.

04/12/2016 - 18:04

తిరువనంతపురం: కేరళలోని అన్ని ఆలయాల్లో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకూ బాణసంచా కాల్చరాదని కేరళ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కొల్లం జిల్లాలోని పుట్టింగళ్ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా కాలిపోయి 109 మంది మరణించిన సంఘటనపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయం వద్ద భక్తులను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.

04/12/2016 - 16:50

దిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బిజెపి నేతలు మంగళవారం ఇక్కడ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొదటి రెండు విడతల పోలింగ్‌లో పలు చోట్ల హింసకు తృణమూల్ కాంగ్రెస్ బరితెగించిందని వారు ఆరోపించారు. మిగతా విడతల పోలింగ్‌లోనైనా శాంతిభద్రతలను కాపాడాలని వారు కోరారు.

04/12/2016 - 16:49

దిల్లీ: రైతులు, సామాన్య జనం రుణాలు బకాయిపడితే వారి ఆస్తులను జప్తు చేసే బ్యాంకులు వేలకోట్ల రూపాయల్లో బకాయిపడే వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. రుణఎగవేతదారుల వివరాలు వెల్లడించలేమంటూ ఆర్‌బిఐ నిస్సహాయతను వ్యక్తం చేయడం సరైన విధానం కాదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

04/12/2016 - 16:48

జార్ఖండ్: ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత గొడ్డలితో నరికి చంపిన ఘటనలో దోషికి మరణశిక్షను విధిస్తూ జార్ఖండ్‌లోని గిరిథ్ జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. 2011లో మధురయాదవ్ అనే వ్యక్తి మామిడిపండ్లు ఇస్తానని చెప్పి ఏడేళ్ల బాలికను అడవిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె తలను గొడ్డలితో నరికేశాడు.

04/12/2016 - 16:48

ముంబయి: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు ముంబయిలోని అతిపెద్ద డంపింగ్ యార్డు (డియోనార్)ను సందర్శించి అక్కడి పరిస్థితులపై స్వయంగా ఆరా తీశారు. నిత్యం స్వచ్ఛ్భారత్ అంటూ గొప్పలు చెప్పే ప్రధాని మోదీ ముంబయిలోని చెత్త సమస్య గురించి పట్టించుకోరా? అంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం వల్ల ప్రజలు మరణిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు.

Pages