S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/06/2019 - 02:17

కన్నూర్ (కేరళ), జనవరి 5: శబరిమల ఆలయంలో 50 ఏళ్లలోపు మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకునే అవకాశాన్ని వామపక్ష ప్రభుత్వం కల్పించినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది. బీజేపీ ఎంపీ పూర్వీకుల ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులతో దాడి చేయడం, ఆరెస్సెస్ కార్యాలయానికి నిప్పంటించడం ఘటనలతో కేరళ దద్దరిల్లింది.

01/06/2019 - 02:14

లక్నో, జనవరి 5: లోక్‌సభ ఎన్నికల్లో కలిసిపోటీ చేయాలని సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీ సూత్రప్రాయంగా ఓ అంగీకారానికి వచ్చాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. అయితే పొత్తుకు సంబంధించి అధికారి ప్రకటన త్వరలోనే ఉంటుందని ఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి శనివారం ఇక్కడ తెలిపారు.

01/06/2019 - 02:12

చెన్నై, జనవరి 5: భారతీయ సంస్కృతి, కళలను విస్తృతం చేయడంలో జాతీయ భాష హిందీ ఎంతో ఉపకరిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. విదేశాలు, సోషల్ మీడియోలో కూడా హిందీ భాష కీలకంగా మారిందని అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ 82వ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సంస్థ హిందీతోపాటు దక్షిణాది భాషలకు కూడా ఎంతో ప్రాచుర్యం కల్పిస్తోందని కొనియాడారు.

01/06/2019 - 02:09

బెంగళూరు, జనవరి 5: చందనసీమ (కన్నడ సినీ రంగం)పై ఆదాయం పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో, రాజకీయం చేయరాదని, రాజకీయ కోణంలో చూడరాదని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చెప్పారు. ఆదాయం పన్ను శాఖ అధికారులు తమ విధులను తాము నిర్వహిస్తున్నారన్నారు. వారికి వచ్చే సమాచారం బట్టి ఐటీ శాఖ దాడులను నిర్వహిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ దాడులు జరుగుతున్నాయన్నారు.

01/06/2019 - 02:06

గువహటి, జనవరి 5: అసోంలో పౌరసత్వ బిల్లు వివాదం చిచ్చురేపింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. పౌరసత్వ బిల్లు-2016 సవరణకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన మర్నాడే రాష్ట్రం అట్టుడికింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మనలు దహనం చేసి నిరసన తెలిపారు.

01/06/2019 - 01:35

డాల్టోన్‌గంజ్ (జార్ఖండ్), జనవరి 5: రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవబట్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. రైతులను ఓటు బ్యాంకుగా పరిగణించడం సరైన చర్య కాదన్నారు. రైతులను బీజేపీ అన్నదాతగా చూస్తుందన్నారు.

01/06/2019 - 01:24

న్యూఢిల్లీ, జనవరి 5: పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సహస్రనామార్చన, కళ్యాణోత్సవం దేశ రాజధాని గోల్ మార్కెట్‌లోని శ్రీ బాలాజీ మందిర్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవస్థానం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

01/05/2019 - 16:24

ముంబయి: బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పరారైన నేరస్థుడిగా కోర్టు పేర్కొంది. కోర్టు ఇలా పేర్కొన్న మొట్టమొదటి నేరస్థుడు మాల్యానే.

01/05/2019 - 16:23

పాలము: రైతులు సామర్ధ్యాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఆయన ఝర్ఖండ్ రాష్ట్రంలో డ్యాం, ఆరు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి గృహ అవాస్ యోజన పథకం కింది ఐదుగురు లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వలే రైతురుణ మాఫీ పేరుతో రాజకీయం లేదని అన్నారు.

01/05/2019 - 16:22

లక్నో: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి చంద్రకళ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇసుక తవ్వకాలలో అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై కేసులు నమోదు చేశారు. ఇసుక, మైనింగ్ మాఫియా కుమ్మక్కై ఈ కేసులు వేశారని అధికారులు ఆరోపిస్తున్నారు.

Pages