S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/04/2019 - 02:46

న్యూఢిల్లీ, జనవరి 3: ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలంటూ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిచ్చి సభా కార్యక్రమాలను స్తంభింపజేసిన 14 మంది తెలుగుదేశం సభ్యులను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ రెండు గంటలపాటు సభలోనే బైఠాయించి తమ డిమాండ్ల సాధనకోసం టీడీపీ సభ్యులు ధర్నా కొనసాగించారు.

01/04/2019 - 02:42

న్యూఢిల్లీ, జనవరి 3: గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన తప్పుడు విధానాల మూలంగానే కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగిపోయిందని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై రాజ్యసభలో గురువారం జరిగిన చర్చల్లో పాల్గొన్న అరుణ్ జైట్లీ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు.

01/04/2019 - 02:39

న్యూఢిల్లీ, జనవరి 3: గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

01/04/2019 - 02:39

తిరువనంతపురం, జనవరి 3: సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోకుంటే శబరిమల ‘తంత్రి’ (ప్రధాన పూజారి) పదవి నుంచి తప్పుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. బుధవారంనాడు నిషేధిత వయస్సున్న ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయ సన్నిధికి చేరుకుని స్వామిని దర్శించుకున్న వెంటనే ఆలయాన్ని పూజారులు కొంతసేపు మూసివేసి సంప్రోక్షణ నిర్వహించిన విషయం తెలిసిందే.

01/04/2019 - 02:38

న్యూఢిల్లీ, జనవరి 3: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జాతీయస్థాయి ఉన్నత విద్యాలయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.6143 కోట్లు కేటాయించిందని మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు.

01/04/2019 - 02:36

న్యూఢిల్లీ, జనవరి 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు, విభజన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి గురువారం పార్లమెంట్ ముట్టడి యత్నించింది. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు, వారిపై లాఠీ ఛార్జీ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం వారిని అరెస్టు చేసి పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

01/04/2019 - 02:02

గురుదాస్‌పూర్, జనవరి 3: కేంద్రప్రభుత్వానికి చెందిన పథకాలను పంజాబ్ ప్రభుత్వం నత్తనడకన అమలుచేస్తోందని, ఇకనైనా జడత్వాన్ని వదిలి నిర్ణీతకాలపరిమితిలోపల స్కీంలను, ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు.

01/04/2019 - 02:51

తిరువనంతపురం, జనవరి 3: శబరిమల ఆలయంలో 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న ఇద్దరు మహిళలు దర్శనం చేసుకోవడం వివాదానికి దారితీసింది. ఈ అంశంపై రాష్ట్రప్రభుత్వ వైఖరికి నిరసనగా కేరళలో హిందూసంఘాలు, బీజేపీ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపుహింసాత్మకంగా మారింది. వివిధ నగరాలు, పట్టణాల్లో ఆందోళనాకారులు రోడ్లపైకి వచ్చి టైర్లను తగలబెట్టారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.

01/04/2019 - 00:37

న్యూఢిల్లీ, జనవరి 3: ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలా లేక ఒంటరిగానే పోటీ చేయాలా అనే విషయంపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అధ్యక్షుడు రాహుల్ గాంధీతో రఘువీరారెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఊమెన్ చాందీ గురువారం రాహుల్‌తో భేటీ అయ్యారు.

01/04/2019 - 00:35

లోక్‌సభ ఎన్నికల సంగ్రామ వేళకు సంక్రాంతి శోభ తోడయింది. మోదీ, రాహుల్ బొమ్మలతో పతంగాలు రాజకీయ తళుకులీనుతున్నాయి. ఆకాంక్షల ముడులు వేసుకుని, ఆశల రెక్కలు కట్టుకుని అధికార గగన విహారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. సార్వత్రిక పోరుకు మరో నాలుగు నెలల గడువున్నా... ఈ ఇద్దరు నేతల పేరుతో మహాసంగ్రామం ముందస్తుగానే మొదలైంది. మాటల తూటాలు... ఆరోపణలు, ప్రత్యారోపణలు..

Pages