S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/05/2019 - 16:21

జమ్మూకాశ్మీర్: శ్రీనగర్‌లోని బెమినా ఏరియాలో ఊపిరాడక ఐదుగురు చనిపోయారు. వీరంతా కుప్వారా జిల్లా తంగ్‌ధర్ ప్రాంతానికి చెందినవారు. గ్యాస్ లీక్ కావటం వల్ల ఊపిరాడక ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, ఇద్దరు చిన్నారులు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

01/05/2019 - 16:20

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని అర్మౌరాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల బస్సు లోయలో పడటంతో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు, బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. మృతులంతా సంగ్రహ పట్టణంలోని డీఏవీ పబ్లిక్ స్కూలు విద్యార్థులు.

01/05/2019 - 12:36

ముజఫర్ నగర్: పోలీసుల కాల్పుల్లో ఇద్దరు గోహంతకులు మృతిచెందారు. శికర్ఫూర్ గ్రామంలో గో మాంసాన్ని అమ్మి విక్రయిస్తున్నారనే సమాచారం రావటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గో హంతకులు పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు గో హంతకులు మృతిచెందారని, మరో ఇద్దరు పారిపోయారని పోలీసులు వెల్లడించారు.

01/05/2019 - 12:34

ముంబయి: రాజలు కాలంలో భారత్‌ను పాలించినవారిలో మహారాష్ట్రీయులే ఎక్కువని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అన్నారు. ఆయన నాగపూర్‌లో జరిగిన ప్రపంచ మరాఠా సమ్మేళనానికి హాజరైన సందర్భంగా మాట్లాడుతూ 2050నాటికి ఖచ్చితంగా మరాఠావాసులే ప్రధాని పదవిని అధిష్టిస్తారని వ్యాఖ్యానించారు. అలాగే నిరుద్యోగ నిర్మూళనకు రిజర్వేషనే్ల పరిష్కారం కాదని అన్నారు.

01/05/2019 - 12:32

హైదరాబాద్: అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఇస్రో మాజీ ఛైర్మన్, బీజేపీ నాయకులు మాధవన్ మండిపడ్డారు. ప్రభుత్వం తీరు పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలపై కాకుండా వరదలు, తుపానుల కారణంగా నష్టపోయిన కేరళ పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృషిచేయాలని సూచించారు.

01/05/2019 - 12:31

తిరువనంతపురం: అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలకు ప్రవేశం కల్పించటంపై కేరళలో శనివారంనాడు ఆందోళనలు కొనసాగుతున్నాయి. తలస్సెరీ ప్రాంతంలో బీజేపీ ఎంపీ వి. మురళీధర్ నివాసంపై బాంబు దాడులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. శనివారం తెల్లవారు జామున ఆరెస్సెస్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. కోజికోడ్ జిల్లాలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

01/05/2019 - 00:37

శబరిమల, జనవరి 4: సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కేరళకు చెందిన ఇద్దరు మహిళలు బుధవారం అయ్యప్ప గర్భగుడిలో పూజలు చేసిన విషయం మరువకముందే శ్రీలంకకు చెందిన ఒక మహిళ సైతం అయ్యప్పస్వామిని దర్శించుకుంది. లంకకు చెందిన 47 ఏళ్ల వయసు కలిగిన శశికళ తన భర్త శరవరణ్, కుమారుడు దర్శన్‌తో కలసి అయ్యప్ప స్వామిని గురువారం రాత్రి దర్శించుకున్నట్టు తెలుస్తోంది.

01/05/2019 - 00:34

షిల్లాంగ్, జనవరి 4: మేఘాలయ భూగర్భ గనుల్లో చిక్కుకుపోయిన 15 మందిని వెలికితీయడానికి అధికారులు శుక్రవారం నాడు విఫలయత్నం చేశారు. ప్రమాదం జరిగి 23 రోజులు అవుతున్నా సహాయ కార్యక్రమాల్లో ఆశించిన పురోగతి కనిపించలేదు. భూగర్భ గనుల్లో చిక్కుకుపోయిన వారి కోసం అధికారులు హైపవర్ పంపులు సెట్లు రప్పించారు. 13 పంపుసెట్లలో కేవలం మూడింటిని మాత్రం ప్రమాద స్థలిలో వినియోగించగలిగారు. అది కూడా పూర్తిగా కాదు.

01/05/2019 - 00:32

న్యూఢిల్లీ,జనవరి 4: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతులు, విద్యార్థులు, బడుగు, బలహీనవర్గాల అభివృద్ది లక్ష్యంగా పని చేశారని, అందుకే రాష్ట్ర ప్రజలు మరోసారి అధికారం కట్టబెట్టారని టీఆర్‌ఎస్ పక్షం నాయకుడు ఏబీ జితేందర్ రెడ్డి శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో వ్యాఖ్యానించారు.

01/05/2019 - 00:32

అమేథీ, జనవరి 4: అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో కోర్టు ప్రక్రియకు కాంగ్రెస్ ఆటంకాలు సృష్టిస్తోందని, ఈ విషయమై రామభక్తులు కాంగ్రెస్‌ను నిలదీయాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తన న్యాయవాదుల ద్వారా న్యాయ స్థానం విచారణకు అవరోధాలు కల్పిస్తోందన్నారు. రామమందిర నిర్మాణం విషయంలో రాజకీయాలకు పాల్పడరాదన్నారు. ఈ విషయం మత విశ్వాసాలకు సంబంధించినదని చెప్పారు.

Pages