S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/28/2018 - 06:16

న్యూఢిల్లీ: రక్షణ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వినూత్న ప్రక్రియలకు శ్రీకారం చుట్టాలని రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పిలుపునిచ్చారు. ఈ విషయమై ఆత్మావలోకనం చేసుకోవాలని ఆమె కోరారు. డీఆర్‌డీవోలో పరిశోధన, అభివృద్ధి విభాగం దేశీయ పరిజ్ఞానంతో వినూత్నమైన ఆవిష్కరణలు చేయాలన్నారు. మిషన్ రక్ష జ్ఞాన్ శక్తి కార్యక్రమంలో డీఆర్‌డీవో కీలకపాత్రవహించాలన్నారు.

11/27/2018 - 23:43

న్యూఢిల్లీ, నవంబర్ 27: విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులను పట్టుకునేందుకు ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు సూచించారు. సీఐటీఐ వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన సీఐటీఐ గ్లోబల్ టెక్స్‌టైల్ కాంక్లేవ్-2018లో వెంకయ్య నాయుడు ప్రసంగించారు.

11/27/2018 - 23:42

న్యూఢిల్లీ, నవంబర్ 27: తమ ప్రభుత్వ వైఫల్యాలు, జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ప్రతి ఒక్కరూ తనకు అన్యాయం చేస్తున్నారన్న భావనను కలిగించే రీతిలో మాట్లాడుతున్న మోదీ ఆ విధంగా తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

11/27/2018 - 23:41

భోపాల్, నవంబర్ 27: మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీకి గత 15 సంవత్సరాలుగా అప్రతిహత గెలుపును ఇస్తూ వచ్చారని, ఈ ఎన్నికల్లో సైతం తమ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయన మంగళవారం పీటీఐతో తన భావాలను పంచుకున్నారు.

11/27/2018 - 23:40

* శరణాలయాల్లో లైంగిక దాడులపై సుప్రీం సీరియస్ * బిహార్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం

11/27/2018 - 23:38

లాహోర్, నవంబర్ 27: కర్తార్‌పూర్ కారిడార్ అనంతమైన ప్రయోజనాలు చేకూరుతాయని పంజాబ్ కేబినెట్ మంత్రి, మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ మంగళవారం నాడిక్కడ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భారత్-పాకిస్థాన్ దేశాల్లో శాంతి నెలకొల్పడమేకాకుండా, విరోధాలు సమసిపోవడానికి అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

11/27/2018 - 16:07

మహబూబ్‌నగర్: పాలమూరు ప్రజలు వలస ఆధిపత్యాన్ని అంగీకరించవద్దని, మనకు ప్రాజెక్టుల వద్దని చెప్పి, తొమ్మిదేళ్లు ఈ నియోజకవర్గాన్ని దత్తతు తీసుకున్న చంద్రబాబు అభ్యర్థే పోటీచేస్తున్నాడని, డిపాజిట్ రాకుండా ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఆయన మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. శ్రీనివాస్ గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

11/27/2018 - 16:09

జైపూర్: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. జైపూర్‌లో ముఖ్యమంత్రి వసుందర రాజె ఈ మేరకు మ్యానిఫెస్టోను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన హామీలు 95శాతం నెరవేర్చగలిగామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో ప్రైవేటు సెక్టార్‌లో ఏటా 50 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో 30వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు ఇస్తామని చెప్పారు.

11/27/2018 - 16:00

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లాలోని రెద్వాని ప్రాంతంలో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు భద్రతాదళాలపై కాల్పులు నిర్వహించారు. అలాగే పుల్వామాలోని ట్రాల్ ప్రాంతంలోనూ ఎన్‌కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం అందటంతో భద్రతాదళాలు సోదాలు జరిపాయి.

11/27/2018 - 12:51

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భద్రతపై మరోసారి కలకలం చెలరేగింది. కేజ్రీవాల్‌ను కలిసేందుకు వచ్చిన ఓ ముస్లిం మతాధికారి వద్ద ఉన్న బుల్లెట్‌ను భద్రతా సిబ్బంది గుర్తించారు. పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.తాను పనిచేసే మసీదులోని విరాళాల డబ్బాలో ఈ బుల్లెట్ దొరికిందని విచారణలో ఇమ్రాన్ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Pages