S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/25/2018 - 03:32

విశాఖపట్నం, నవంబర్ 24: ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ 125 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు దాటి అద్భుత ఫలితాలను సాధిస్తోందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్‌సింగ్ అన్నారు. 125ఏళ్ళ వాల్తేరు డివిజన్ వేడుకలు సందర్భంగా విశాఖ ఏయూ కాన్వొకేషన్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఉత్సవాన్ని ఆయన ప్రారంభించారు.

11/25/2018 - 02:49

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ప్రజలు మార్పును కోరుతున్నారా ? బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రంలో 2003 నుంచి బీజేపీ అప్రతిహతంగా ప్రతి ఎన్నికలో విజయం సాధించింది. ఈ సారి ఎన్నికల్లో ఓటర్లు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారా అనే విషయాన్ని విశే్లషిస్తే విశే్లషకులు చెప్పలేమంటున్నారు. కాని ప్రజలు మార్పును కోరుతున్నారు. ఈ మార్పు బీజేపీని ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేంత శక్తివంతంగా ఉందా ?

11/25/2018 - 02:46

బెంగళూరు, నవంబర్ 24: ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ (66) శనివారం ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. స్వల్పంగా గుండెపోటు రావడం వల్ల ఆయన తుదిశ్వాసను విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన భార్య, ప్రముఖ నటి సుమలత. ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 200కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు.

11/25/2018 - 02:20

న్యూఢిల్లీ, నవంబర్ 24: ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో మారిషస్ కంపెనీకి ఎఫ్‌ఐపీబీని అనుమతిని చట్టవిరుద్ధంగా మంజూరు చేసినట్లు సీబీఐ చేసిన అభియోగాలను కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఖండించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, పస లేదన్నారు. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందనగా కోర్టులో ఆయన తన వాదనలను శనివారం దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తుకు మాజీ మంత్రి చిదంబరం సహకరించడం లేదని సీబీఐ పేర్కొంది.

11/25/2018 - 02:16

జైపూర్, నవంబర్ 24: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ జరుగుతోంది. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో 33 చోట్ల ప్రత్యక్ష పోటీ నెలకొంది. అంటే 2013 ఎన్నికల్లో తలబడిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులే ఇప్పుడూ పోటీ పడడం గమనార్హం. 43 నియోజకవర్గాల్లో ఈసారి అభ్యర్థులను మార్చారు. 124 స్థానాల్లో రెండు పార్టీలూ కొత్త అభ్యర్థులను రంగంలోకి దించాయి.

11/25/2018 - 02:12

న్యూఢిల్లీ, నవంబర్ 24: గంగానది బక్కచిక్కి శల్యమవుతోంది. నీటి ప్రవాహం తగ్గుతోంది. నదీలో నీటి ప్రవాహాన్ని మంచినీటి, సాగునీటి అవసరాల నిమిత్తం మళ్లిస్తున్నారు. గంగానదిపై దాదాపు 900 డ్యాంలు నిర్మించారని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. గంగానదిలో నీటి ప్రవాహం పెంచేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలి.

11/25/2018 - 02:10

న్యూఢిల్లీ, నవంబర్ 24: ఆలిండియా రేడియో కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 50వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. అక్టోబర్ 2014లో నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ పేరుతో సాంఘిక, జాతీయ, అంతర్జాతీయ విషయాలు, విశేషాలతోపాటు బాలికా విద్య, పరీక్షల్లో ఒత్తిడిని ఎదుర్కోవడం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలపై సూచనలు, సలహాలు, ఉదాహరణలతో వివరిస్తున్న విషయం తెలిసిందే.

11/25/2018 - 02:04

అయోధ్య, నవంబర్ 24: అయోధ్య మళ్లీ వేడెక్కుతోంది. రామాలయాన్ని నిర్ణీత కాల వ్యవధిలో నిర్మించాలన్న లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ ఆదివారం నిర్వహించనున్న ధర్మసభ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ సభకు వేల సంఖ్యలో కార్యకర్తలు ఇప్పటికే తరలిరావడంతో నగరమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

11/25/2018 - 01:57

కోట, నవంబర్ 24: మా ఆయనే గెలుస్తారంటూ మానే్వంద్రసింగ్ భార్య చిత్రాసింగ్ ధీమాగా చెబుతున్నారు. చిత్రాసింగ్ ఎవరంటే బీజేపీ దివంగత నేత జస్వంత్‌సింగ్ సింగ్ కోడలు. జస్వంత్ కుమారుడు మానే్వంద్ర సింగ్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై పోటీ చేస్తున్నారు. జాల్‌రాపటాన్ నియోజకవర్గం నుంచి రాజేతో మానే్వంద్ర తలపడుతున్నారు. 2013 ఎన్నికల్లో బార్మేర్ జిల్లా షియో నుంచి బీజేపీ టిక్కెట్‌పై గెలిచారు.

11/25/2018 - 02:09

సాగర్/దామహ్, నవంబర్ 24: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ప్రధాని నరేంద్రమోదీ ఘోరంగా విఫలమయ్యారని, ప్రజల ఆశలను, ఆకాంక్షలను వమ్ము చేశారని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్‌లో రూ.15 లక్షల సొమ్మును జమ చేస్తామన్న హామీని మోదీ గాలికి వదిలేశారన్నారు.

Pages