పశ్చిమగోదావరి

విద్యారంగంతో మరువలేని అనుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 15 : విద్యారంగంతో అనుబంధం జీవితంలో మరువలేనని ఉపాధ్యాయుడిగా నిరంతరం విద్యాశాఖతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ అతిధిగృహంలో శనివారం జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ కార్యాలయాల ఉద్యోగులు, అధికారులు మంత్రి జవహర్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ తమ కుటుంబం ఉపాధ్యాయులతో నిండి ఉన్నదని తాను టీచర్‌గా ఉన్న రోజుల్లో డి ఇవో కార్యాలయానికి వచ్చి పనులు చేయించుకున్న సంఘటనలు మరువలేనని చెప్పారు. పేదరికంలోజన్మించినా తమ కుటుంబం తనను కష్టపడి చదివించిందని అందువల్లే ఉపాధ్యాయ వృత్తిలో రాణించానని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తించి తనను కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా 2014లో నిలబెట్టగా ప్రజలు సాదరంగా ఆదరించి గౌరవించి ఘన విజయం చేకూర్చారని ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గత మూడేళ్ల నుండి కష్టపడి పనిచేస్తున్నానని ప్రజల కష్టాలలో పాలుపంచుకుని వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు నడుస్తున్న తరుణంలో చంద్రబాబు తనను పిలిచి మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా కీలకమైన ఎక్సైజ్ శాఖను అప్పగించారని ఈ విషయంలో కూడా అందరి సహకారంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతానే తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురానని చెప్పారు. మద్యానికి బానిసైన ప్రతీ మనిషీ దశల వారీగా మద్యాన్ని విడనాడాలని పల్లెల్లో ప్రజల్లో మద్యం జోలికి వెళ్లకుండా తగు చైతన్యం తీసుకువస్తామని మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఆదాయవనరుగా పరిగణించబోమని చెప్పారు. రాష్ట్రంలో మద్యం వల్ల 13763 కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ పన్నుల రూపంలో పోగా కేవలం 4500 కోట్ల రూపాయలు మాత్రమే మద్యం ఆదాయం వస్తోందని ఇది పెద్ద ఆదాయవనరుకాదని చెప్పారు. రాష్ట్రంలో కల్తీ కల్లు నిరోధానికి పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నామని ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్‌కు డ్రగ్స్ అక్రమ రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ప్యాకేజీతోనే అధిక నిధులు
ఎంపి మాగంటి బాబు
ఏలూరు, ఏప్రిల్ 15 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ వలనే అధిక నిధులొస్తాయని, దానివల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందంజ వేస్తుందని, ఏదికావాలన్నా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుండి మంజూరు చేయిస్తానని ఎంపి మాగంటి బాబు స్పష్టం చేశారు. ఎంపి క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధితాధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాగంటి మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపరిచిన ప్రతీ అంశాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువస్తామని, ప్రత్యేక హోదా కేవలం పేరుకు మాత్రమేనని, ప్రత్యేక ప్యాకేజీ వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించగలదని చెప్పారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా 42 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుండి వివిధ పధకాల రూపంలో రానున్నాయని ఇంకా కేంద్రం నుండి ఏ మేరకు నిధులు కావాలో ఎంపిలంతా కలిసి రాష్ట్రానికి నిధులు సమకూరుస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరుగుతోందని ఇప్పటి వరకూ 40 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు ఖర్చు కాగలదని అంచనా వేసారని వంద శాతం నిధులు కేంద్రం నుండి రాబట్టి 2019 నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామని చెప్పారు. రాష్ట్రంలో మిర్చి పంట బాగా పండిందని అయితే 12 వేల రూపాయలుండే మిర్చి ధర నేడు నాలుగు వేల రూపాయలకు పడిపోయిందని, ఇటువంటి స్థితిలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరతామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్ ఎంతో అవసరమని సహజంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో రైల్వేజోన్ ఉండాలి కానీ కొందరు విశాఖలో కావాలంటున్నారని త్వరలోనే రైల్వేజోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసునున్నదని చెప్పారు. కొల్లేరు ప్రాంత సమస్యను కూడా పరిష్కరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతోందని త్వరలోనే కొల్లేరువాసులకు మేలు చేకూరేలా విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పానరు. దేశ వ్యాప్తంగా బిజెపి కూడా బాలం పుంచుకుంటుందని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్రమోడీ గట్టి పట్టుదలతో ఉన్నారని 2019 ఎన్నికల్లో తిరిగి అటు కేం6దంలో బిజెపి ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించేలా ఇప్పటి నుండే పటిష్టమైన ప్రణాళిక అమలుచేస్తామని చెప్పారు. గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించి ఆధునీకరిస్తామని చెప్పారు. నిధుల కొరత వలన కొన్ని ఇబ్బందులెదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతున్న చంద్రబాబు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించగలరని ప్రజలు సహకరించి ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి మాటలు నమ్మితే ప్రజలు గంగలో మునిగినట్టేనని కావున ప్రజలు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి మాయమాటల ఉచ్చులో పడవద్దని అభివృద్ధి చేయగల సత్తా ఒక్క చంద్రబాబుకే వుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటిసిలు గంటా సుధీర్‌బాబు, చలపతిరావు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.