Others

సాహసమే సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయము, నమ్మకం కోల్పోవడం, చేయవలసిన విధులు సరిగ్గా నిర్వర్తించకపోవడం, అసహనము, ఋణబాధలు, ఉద్రేకం కలగడం మొదలైనవి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూ వుంటాయి. అటువంటి సమయంలో ఏవిధమైన ఆలోచనలతో చేయాలి, ఏవిధంగా ముందుకు వెళ్లాలి, ఏవిధమైన దేవతను ఆరాధించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ వాహనాన్ని అధిరోహించాలి అనే ఆలోచన చేయాలి. వాహనమంటే ఉపాసన దేవతను మన దగ్గరకు తీసుకువచ్చే మంత్రము. పైన చెప్పిన లక్షణాలన్నీ తమో గుణానికి చెందినవి. తమో గుణముతో వుండేవారికి సంపదలు, మంచి బుద్ధిని ఇచ్చే దేవత లక్ష్మి. లక్ష్మిఅంటే ధనం మాత్రమే అని అనుకుంటాము. లక్ష్మి అంటే ధైర్యము మరియు పట్టుదల. ఈ రెంటినుంచి వచ్చేదే ఆనందం. దాని పేరే ‘్ధనము’
ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆచారానికి, ఉపచారానికి విశేషమైన స్థానం ఉంది. ఉపచారములో వాహన సేవ కూడా ఒక్కటి. ప్రతి దేవతా శక్తికి ఒక వాహనం ఉంటుంది. దేవతలను మన దగ్గరకు తీసుకువచ్చేది వాహనము. వాహనముగా మారిన బీజాక్షరాల శబ్దమే మంత్రము. మనలో చాలామందికి గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనం అని తెలియదు. ప్రచారంలో, ప్రవచనంలో ఉండే కధల ద్వారా దేవతలు ఉపయోగించే వాహనాల గురించి తెలసుకుంటాము. గుడ్లగూబను వాహనంగా చేసుకోవడానికి గల కారణాలు గమనిస్తే తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఇబ్బందులు ఈ పక్షి ఒకే రకంగా చూస్తూ ముందుకు వెడుతుంది. ఒక నిశిత దృష్టితో గమనిస్తే వాహనాలు నిర్దిష్ట దేవత ఎన్నుకోవడానికి గల కారణం మనకు తెలుస్తుంది. దైర్య సాహసాలని ప్రదర్శించడమే ఈ పక్షిని వాహనంగా చేసుకోవడానికి గల కారణం. ధైర్యము, సాహసము ఏ సమయంలో మనకు అవసరం? జవాబు అంధకారం అలుముకున్నప్పుడు.
అటువంటి అంధకారంలో ధైర్యంగా విజయం సాధించే ఏకైక పక్షి గుడ్లగూబ. అందుకే ఆ పక్షి లక్ష్మీదేవియొక్క వాహనంగా మారింది. ధైర్యం ఏ సమయంలో ఉండాలి. సాహసము ఏవిధంగా ఉండాలి. ధైర్యము తన కుటుంబానికి తగిన ఆహారం దొరక్కపోయినా చెదరని విశ్వాసంతో వుండడం ధైర్యము. సాహసము అంటే తన చిన్న పక్షిపిల్లల గూడు మీదకు వెడుతున్న ఒక తోడేలును ఎదిరించి విజయం సాధించడం. ఈ రెండు ఒకదాని తరువాత ఒకటి జరిగితే వచ్చేది లక్ష్మి. అదే ఆనందం. ఆహారము సంపాదించే సమయంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో గుడ్లగూబ ప్రయాణం చేస్తుంది. ఆ పక్షిని వాహనంగా చేసుకున్న లక్ష్మి అమ్మవారు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దైర్య సాహసాలని ప్రదర్శిస్తే తప్పక ఇష్టపడుతుంది.
ప్రతిరోజు ప్రదోష సమయంలో నిద్రలేచి రోజును ప్రారంభించే ఈ పక్షి ద్వారా లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తుంది. ఈ పక్షికి ఉదయం సరిగ్గా కనపడదు. అందుకే రాత్రి సమయంలోముఖ్యంగా అమావాస్య రోజు లక్ష్మీదేవికి అనుగ్రహం కోసం మనం విశేష పూజలు చేస్తుంటాము. మరొక గొప్ప గుణము గుడ్లగూబలో మనం గమనించేది చిన్న శబ్దము ఎక్కడ ఉన్నా గమనించే శక్తి. రాత్రి అంతటా కుటుంబానికి ఆహారం కోసం వెతకడం.
అదేవిధంగా విద్యార్థులు తమ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఈపక్షిని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగము వైపుగా వచ్చే చిన్న చిన్న అవకాశాలను కూడా జాగ్రత్తగా గమినించి జీవితంలో విజయం సాధించాలి. మన నెలసరి జీతాలు ఎంత మెల్లగా వస్తాయో అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క రాక కూడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అతివేగముగా ధనము ఎవరికీ లభించదు. లక్ష్మీకటాక్షం కావలనుకునేవారు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. లక్ష్మీదేవి యొక్క రాక కూడా చాలా ప్రశాంతంగా మెల్లగా జరుగుతుంది. అతి వేగంతో ఆవిడ దర్శనం వుండదు.
ఈ పక్షి వేట సమయంలో తన శరీరానికి 12 రెట్ల వేగముతో ఎలా అయితే ప్రయాణం చేసి ఆహారం సంపాదిస్తుందో అదేమార్గంలో ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే వారి వారి శక్తులకు పదింతల కష్టపడాలి. అప్పుడే పరిపూర్ణమైన లక్ష్మీకటాక్షం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సంపద మరియు గుడ్లగూబ లేని ఖండము లేదు. ప్రపంచము అంతటా గుడ్ల గూబ జాతి ఉంది. అడవుల్లో వుండే ఈ పక్షులకు ఉపాసన ద్వారా మన పరిశుభ్రమైన మన ఇంటికి ఆహ్వానించాలి. మనము చదివే మంత్రము, చూసే దృష్టి ఒక్కటి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది.

- మహేశ్ విశ్వనాథ