రంగారెడ్డి

వలస రైతులను వెనక్కి రప్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 16: వలసలు వెళ్లిన తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో తిరిగి సొంత ప్రాంతాలకు రప్పించే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగే అన్న లక్ష్యంతో పని చేస్తుందన్నారు. అల్లాణి దర్శకత్వంలో రైతేరాజు పేరుతో రూపొందిస్తున్న లఘుచిత్రాన్ని ఆయన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సమగ్ర వ్యవసాయ పద్ధతుల పరిశోధనా క్షేత్రం వద్ద మంగళవారం ప్రారంభించారు. సినీనటుడు సుమన్ ప్రధాన పాత్రను పోసిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న పథకాలపై రైతులలో అవగాహన పెంచేందుకు ఈ లఘుచిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. రైతేరాజు అన్నది మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో చూపించేందుకు ముఖ్యమంత్రి కెసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. వీడియో ఆన్‌వీల్స్ పేరుతో ఈ లఘుచిత్రాన్ని గ్రామాల్లో ప్రదర్శిస్తామన్నారు. వర్షపునీటి సంరక్షణ కోసం జలసంరక్షణ ద్వారా బోరుబావుల వద్ద రీఛార్జ్ చేసే కార్యక్రమం చేపడుతామన్నారు.
మంచిగా పనిచేసే విపివోలకు రివార్డులు
వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణ వెల్లడి
వికారాబాద్, మే 16: మంచిగా పనిచేసే గ్రామ పోలీసు అధికారులకు నగదు బహుమతి ఇస్తామని వికారాబాద్ జిల్లా ఎస్పీ టి.అన్నపూర్ణ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మహిత సంస్థ ఆధ్వర్యంలో జువైనల్ జస్టిస్ చట్టంపై సబ్‌డివిజనల్ పోలీసు అధికారులు, గ్రామ పోలీసులకు అవగాహన, ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ పోలీసు అధికారులు వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవాలని సూచించారు. వారానికి రెండుసార్లు గ్రామానికి తప్పకుండా వెళ్ళి అక్కడ జరిగే కార్యక్రమాల వివరాలు సేకరించాలని చెప్పారు.