ఆటాపోటీ

పాక్ క్రికెట్‌కు చావుదెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐసిసి చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 4న పాకిస్తాన్‌తో భారత్ గ్రూప్ మ్యాచ్‌లు ఆడాల్సి రావడంతో, ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించే ప్రయత్నాలను పాకిస్తాన్ మానుకునే వరకూ క్రికెట్ సిరీస్‌ల ప్రసక్తే లేదని ఇటీవల కేంద్రం తేల్చిచెప్పింది. బంగ్లాదేశ్ వంటి టెస్టు హోదా ఉన్న దేశమేకాదు.. పొరుగును ఉన్న అఫ్గానిస్తాన్ సైతం పాక్‌లో సిరీస్‌లు ఆడేది లేదని ప్రకటించడం పిసిబి కష్టాలను రెట్టింపు చేసింది. అన్ని రకాలుగా చావుదెబ్బతిన్న పాక్ క్రికెట్ కోలుకోవడానికి ఎన్ని దశాబ్దాలైనా పట్టవచ్చు. పరిస్థితులు ఎటు నుంచి ఎటు మారినా, పాక్‌తో భారత్ సిరీస్‌లు మాత్రం ఇప్పట్లో జరగవన్నది వాస్తవం.

పాకిస్తాన్ క్రికెట్ కోలుకునే అవకాశమే లేని విధంగా చావుదెబ్బతిన్నది. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఆ దేశంలో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు ఏ జట్టూ ముందుకు రావడం లేదు. దీనితో గత్యంతరం లేని తటస్థ వేదికలపై హోం సిరీస్‌లు ఆడాల్సిన దుస్థితి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి భారీ నష్టాలను మిగులుస్తున్నది. ఇక భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవడంతో, పరిస్థితి మరింత దిగజారింది. బంగ్లాదేశ్ సైతం పాకిస్తాన్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లకు ససేమిరా అనడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. తాజాగా అఫ్గానిస్తాన్ కూడా పాక్‌లో మ్యాచ్‌లను నిరాకరిస్తున్న దేశాల జాబితాలో చేరింది. కాబూల్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో 90 మంది మృతి చెందిన సంఘటనను అఫ్గానిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నదని మండిపడింది. పాక్‌తో అన్ని రకాల ద్వైపాక్షిక క్రికెట్ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. పాక్‌తో క్రికెట్ సంబంధాల ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసిన 24 గంటలు కూడా తిరగక ముందే అఫ్గానిస్తాన్ కూడా దాదాపు అలాంటి నిర్ణయానికే రావడం పిసిబిని సమస్యల సుడిగుండంలోకి నెట్టింది. ఈ సంక్లిష్టమైన స్థితి నుంచి బయటపడడం సాధ్యం కాదేమోనన్న భయం పిసిబిని వెంటాడుతున్నది.
భారత్‌తోనే కీలకం!
మిగతా జట్ల విషయం ఎలావున్నా, భారత్‌తో సిరీస్‌లే పాకిస్తాన్‌కు కీలకం. అందుకే, ఎన్నోసార్లు బిసిసిఐని బతిమాలింది. కొన్నిసార్లు భయపెట్టింది. చట్టపరమైన చర్యలకు ప్రయత్నించింది. చివరికి నష్టపరిహారం కోరుతూ నోటీసు కూడా పంపింది. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా పిసిబి ఆశలు నెరవేరేటట్టు కనిపించడం లేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భవిష్యత్ ప్రణాళికను అనుసరించి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ద్వైపాక్షిక క్రికెట్‌కు ససేమిరా అంటున్నదంటూ వాపోతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం పిసిబిని దిక్కుతోచని స్థితిలో నిలబెట్టింది. నిబంధనలను అనుసరించి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాల్సి ఉన్నప్పటికీ, భారత్ అందుకు నిరాకరిస్తున్నదని పిసిబి వాదన. అయితే, ఆటగాళ్ల భద్రత ముందు ఒప్పందాలు, అవగాహానలు పనికిరావన్నది భారత్ అభిప్రాయం. క్రికెటర్ల భద్రత పట్ల అనుమానం ఉన్నదని ప్రకటించిన తర్వాత, ఫలానా దేశానికి వెళ్లాలనిగానీ, ఫలానా జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలనిగానీ ఆదేశించే అధికారి ఐసిసికి కూడా లేదన్న విషయాన్ని బిసిసిఐ పదేపదే గుర్తుచేస్తున్నది. ఇందులో నిజం ఉందికాబట్టే, ఈ సమస్యను క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు దృష్టికి తీసుకెళ్లి, భారత్ నుంచి భారీ వందల కోట్ల రూపాయల పరిహారాన్ని రాబట్టాలని పిసిబి ఆశిస్తున్నది. గతంలో పిసిబితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత జట్టు పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడాలి. అందులో అనుమానం లేదు. రొటేషన్ విధానాన్ని అనుసరించి పాక్‌లోనే టీమిండియా మ్యాచ్‌లు ఆడాల్సి ఉందనేది కూడా వాస్తవమే. అయితే, అక్కడ భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని 2009 మార్చి 3న శ్రీలంక ఆటగాళ్లపై జరిగిన దాడి స్పష్టం చేసింది. దీనితో గత్యంతరం లేని పాక్ తన హోం సిరీస్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని వేదికగా చేసుకొని ఆడుతున్నది. మిగతా జట్లన్నీ పాక్‌తో అక్కడే సిరీస్‌లు ఆడుతున్నాయి. పరస్పర అంగీకార ఒప్పందం (ఎంఒయు) ప్రకారం భారత్ కూడా యుఎఇకే వెళ్లాలి. కానీ, అసలు పాక్‌తో సిరీస్‌లే వద్దని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, న్యూట్రల్ సెంటర్లలోనూ మ్యాచ్‌లు ఆడాలని ఆటగాళ్లను కోరే అవకాశం బిసిసిఐకి లేకుండా పోయింది. భారత్‌కు వచ్చి సిరీస్ ఆడితే భద్రతను కల్పించడంతోపాటు, భారీగా సొమ్మును ముట్టచెప్తామని పిసిబికి ప్రతిపాదించింది. కోరింత మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ పిసిబికి ఎర వేసింది. అది కూడా కేంద్ర నిర్ణయంతో నీరుగారిపోయింది. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు కేంద్రం అనుమతించే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఏ పరిస్థితి ఉందో, ఇప్పుడు బిజెపి సర్కారు కొలువు తీరిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ పాక్‌తో క్రికెట్ సంబంధాలను కోరుకోవడం లేదని స్పష్టమవుతున్నది. అత్యధిక శాతం మంది దేశ ప్రజలు కూడా పాక్‌తో క్రీడా సంబంధాలను వ్యతిరేకిస్తున్నారు. ఐపిఎల్ ఫ్రాంచైజీలు కూడా ఆ దేశానికి చెందిన ఆటగాళ్ల పేర్లను పరిశీలించనే లేదు.
అనుకూలించని పరిస్థితులు
భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌కు పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేవన్నది వాస్తవం. ప్రస్తుతం ఐసిసి చైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్ తాను బిసిసిఐ అధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు పాక్‌తో సిరీస్‌పై ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ ఫలితం లేకపోయింది. గత కొనే్నళ్లలో బిసిసిఐలో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసున్నప్పటికీ, పాక్‌తో సిరీస్‌లకు ఆమోద ముద్ర పడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల కమిటీ (సిఒఎ) కూడా ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. చర్చలు జరపడం లేదు. పాక్‌తో సిరీస్‌ల విషయాన్ని, ఒప్పందాన్ని అమలు చేయాలని పిసిబి డిమాండ్ చేయడాన్ని, తాజాగా నోటీసు ఇవ్వడాన్ని సూచన ప్రాయంగా కేంద్రం దృష్టికి సిఒఎ తీసుకెళ్లింది. అందరూ ఊహించినట్టే కేంద్రం స్పందించింది. పాక్‌తో క్రికెట్ ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చిచెప్పింది. మొత్తం మీద ఏ రకంగా చూసినా పాక్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు మెరుగుపడే అవకాశాలే కనిపించడం లేదు. భారత్ నుంచి పారితోషికం పొందడం కూడా అసాధ్యంగా మారడం పిసిబికి కోలుకోలేని దెబ్బగా భావించాలి.
సర్వత్రా వ్యతిరేతే
పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. చివరికి కరడుగట్టిన క్రికెట్ అభిమానులు సైతం పాక్‌తో క్రికెట్ వద్దని స్పష్టం చేస్తున్నారు. క్రికెట్ సిరీస్‌లపై స్పష్టతనివ్వకపోతే, తమ ఆటగాళ్లు భారత్‌తో మ్యాచ్‌లను బహిష్కరిస్తారని పిసిబి హెచ్చరించినప్పటికీ ఎవరూ ద్వైపాక్షిక మ్యాచ్‌ల పట్ల సానుకూలంగా స్పందించలేదు. క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు ఇది అనువైన సమయం కాదని అంతా ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పకడ్బందిగా అమలు చేయడం నుంచి పలు అంశాలపై భారత్, పాక్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరగాలని, ఆతర్వాత క్రీడా సంబంధాలపై నిర్ణయాలు తీసుకోవాలరి అందరి ఏకాభిప్రాయం. ఇందులో రాజకీయాలకుగానీ, అభిమానాలకుగానీ ఆస్కారం లేదు. భారత దేశం మొత్తం ఒకే తాటిపై నిలవడంతో ఏం చేయాలో? ఎవరికి చెప్పాలో అర్థంగాక పిసిబి మల్లగుల్లాలు పడుతున్నది. అయితే, పాక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, భారత్‌లోని ఏ వర్గం నుంచి కూడా మద్దతు దక్కదనేది వాస్తవం.

సమస్య తెరపైకి!
ఐసిసి టోర్నీల్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌లు ఉన్న ప్రతిసారీ ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సిరీస్ సమస్య తెరపైకి వస్తున్నది. 2008 నవంబర్‌లో ముంబయిపై పాక్ నుంచి దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు దాడులు జరిపిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ ప్రభావం క్రీడా రంగంపైన కూడా పడింది. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడడంపై బిసిసిఐ ప్రతిపాదన చేయవచ్చు. కానీ, తుది నిర్ణయం మాత్రం భారత ప్రభుత్వానిదే. కాబట్టి, పాక్‌తో ప్రత్యక్ష సిరీస్‌లు ఇప్పట్లో ఉండవు. ఉగ్రవాద సమస్యకు పూర్తిగా తెరపడితేగానీ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు చిగురించవు. కానీ, పాక్ ఉగ్రవాదానికి దూరంగా ఉండడం అసాధ్యం. ఆ కోణంలో చూస్తే, ఆ దేశంలో భారత్ ద్వైపాక్షిక
సిరీస్‌లు ఆడడం కూడా అసాధ్యమే.

-ఎస్‌ఎంఎస్