ఆటాపోటీ

తొలి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య మొట్టమొదటి వనే్డ ఇంటర్నేషనల్ 1978 అక్టోబర్ 1న జరిగింది. అది 40 ఓవర్ల పోరు కావడం గమనార్హం. పాక్‌లోని క్వెటా ఆతిథ్యమిచ్చిన ఆ మ్యాచ్‌లో భారత్ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. మొహీందర్ అమర్‌నాథ్ ఆల్‌రౌండ్ ప్రతిభ టీమిండియాకు విజయాన్ని సాధించిపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 40 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. అమర్‌నాథ్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పాకిస్తాన్‌ను భారత్ 8 వికెట్లకు 166 పరుగులకు నియంత్రించింది. అమర్‌నాథ్ రెండు వికెట్లు సాధించి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్ నుంచే భారత్, పాక్ వనే్డ వైరం మొదలైంది.