నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెటపెట నుక్కు కంబమున భీకర దంత నఖాంకుర ప్రభా
పటలముగప్ప నుప్పతిలి భండన వీధి నృసింహ భీకర
స్ఫుట పటుశక్తి హేమకశిపున్ విదళించి సురారి పట్టి ను
త్కటకృప జూచి తీవెగదా,, దాశరధీ కరుణా పయోనిధీ

భావము:దశరథరామా, నీవు ఉక్కు స్తంభంలో నరసింహమూర్తివై పెటపెటమనే ధ్వనితో ఉద్భవించి నీపండ్ల యొక్కయు, మొగ్గలవంటి కొనగోళ్ళ యొక్కయు, తెల్లని కాంతి సమూహములు వ్యాపింపగా, భయంకరమైన శక్తిచే హరిణ్యకశిపుని రొమ్మును చీల్చి చంపిన తరువాత, వాని కుమారుడైన ప్రహ్లాదుని కాపాడిన వాడవు నీవే కదా!
దాశరథీ శతకములోని పద్యము