ఆటాపోటీ

కనిపించని క్రమశిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రమశిక్షణా రాహిత్యానికి పాకిస్తాన్ మారుపేరు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారుల ఆదేశాలనే వారు ఖాతరు చేయరు. ఇక కోచ్‌కి ఆ జట్టులో ఉన్న విలువ ఎలాంటిదో ఊహించడం కష్టం కాదు. 2007 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన ఒక గ్రూప్ మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలైంది. అదే రోజు అప్పటి కోచ్ బాబ్ ఊమర్ తన హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అంతకు ముందు షోయబ్ అక్తర్ తదితర క్రికెటర్లు అతనితో ఘర్షణ పడ్డాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేగాక, ఊమర్‌పై అక్తర్ చేయి చేసుకున్నాడని కూడా అంటారు. ఇందులో నిజం ఎంతో తెలియదుగానీ, ఊమర్ మృతి పాక్ ఆటగాళ్ల వ్యవహార శైలిపై పలు అనుమానాలకు కారణమైంది. అంతకు ముందు కూడా కోచ్‌లను పాక్ క్రికెటర్లు పట్టించుకునే వారుకారని, ఇష్టా రాజ్యంగా వ్యవహరించేవారని ఆరోపణలు ఉన్నాయి. ఊమర్ మృతిని వారి అరాచకత్వానికి నిదర్శనంగా పేర్కొనేవారు లేకపోలేదు. ఆతర్వాత కూడా పాక్ కోచ్‌ల పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదన్నది వాస్తవం. ప్రాక్టీస్ సెషన్స్‌కు డుమ్మా కొట్టకూడదని, అనుమతి లేకుండా షికార్లకు వెళ్లకూడదని, లేట్‌నైట్ పార్టీలకు అసలే హాజరు కాకూడదని ఆటగాళ్లకు అతను పదేపదే సూచిస్తున్నా ఫలితం ఉండడం లేదని పిసిబి వర్గాలు అంటున్నాయి. భారత్‌తో మ్యాచ్‌కి ముందు ఆర్థర్ ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని వ్యూహాలను సిద్ధం చేసుకున్నా, పాక్ ఆటగాళ్ల తీరులో ఏమాత్రం మార్పు రాలేదని వారు ఆడిన తీరే స్పష్టం చేస్తున్నది. క్రమశిక్షణా రాహిత్యమే పాక్ క్రికెట్‌ను దెబ్బతీస్తున్నదని ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియందాద్ వంటి పలువురు మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించడం గమనార్హం.