నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదయుగళంబు భూగగన భాగములన్ వెసనూని విక్రయా
స్పదుడగు నబ్బలీంద్రునొక పాదమునందల క్రింద నొత్తియే
లొదవ జగత్త్రయంబు బురుహూతున కియ్య వటుండవైన చి
త్సదమల మూర్తి నీవె కదా, దాశరథీ, కరుణాపయోనిధీ

భావము:ఓ దశరథరామా! ఒక పాదము భూమిమీదను, మరొక పాదము ఆకాశములోను పెట్టి రెండు పాదాలచే లోకాలను ఆక్రమించి మహాపరాక్రమశాలియైన బలిచక్రవర్తి తలమీద ఒక పాదాన్ని మోపి పాతాళానికి అణగద్రొక్కి మేలు కలిగించే విధంగా మూడు లోకాలను ఇద్రునకు ఇచ్చుటకు, వటువుగా మారిన సచ్చిదానందమూర్తివి నీవె కాని మరెవ్వరూ కాదు.
దాశరథీ శతకములోని పద్యము