నిజామాబాద్

రైతు లేనిదే రాజ్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూన్ 22: రైతు లేనిదే రాజ్యం లేదని, బ్యాంకర్లు రైతులకు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గల జనహిత భవనంలో కలెక్టర్ అధ్యక్షతన కామారెడ్డి జిల్లా వార్షిక రుణప్రణాళిక బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా వార్షిక రుణ ప్రణాళికలను కలెక్టర్ చదివి విన్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు పంటల పండించేందుకు ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారని, రైతు బయట ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకోకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. మనం తినే అన్నం పండిస్తున్న రైతన్నలు ఎప్పుడు సుఖంగా ఉండాలని, దేశానికి వెన్నముక అయిన రైతులకు రుణాలు అందించడంలో జాప్యం కాని నిర్లక్ష్యం కాని చేయవద్దని అన్నారు. రైతు ఆత్మహత్యలు అసలే లేకుండా చూడాలని, ఇందు కోసం రైతులకు పంటలు పండించేందుకు అందే అప్పులు సకాలంలో అందిస్తూ, రైతులకు సహాయంగా ఉండి రైతుకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటలకు ఎరువులు అందించేందుకు ఎకరాకు 4వేల రూపాయల చొప్పున ఖరీఫ్, రబీలో కలిపి 8వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని రైతుల అకౌంట్‌లో వేయనుందని, ఆ డబ్బులు మే 7వ తేదిలోగా వస్తాయని అన్నారు. ఇప్పటికే వ్యవసాయ, రెవెన్యూ అధికారులు రైతులకు సంబందించిన రైతు సమగ్ర సర్వే చేపట్టడం జరిగిందని, ఇందులో 90శాతం సర్వే కాగా, ఇంకా 10శాతం రైతులు తమ పేర్లను నమోదు చేసుకోలేదని అన్నారు. 1బి, పహాని ప్రకారం పంటలు పండించే రైతుకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం 4వేల రూపాయలు అందించేలా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని అన్నారు. పంటలు పండించే, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ ఆర్థిక సహాయం రెండు పంటలకు కలిపి 8వేల అందించేలా బ్యాంకులు కూడా సహకరించాలని అన్నారు. బ్యాంకు మేనేజర్‌లు, సిబ్బంది రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. నిరుపేద రైతులు వారు తీసుకున్న రుణాలు సకాలంలో కట్టడం కూడా జరుగుతోందని అన్నారు. రైతు కంట నీరు పెడితే మనం తినే తిండి దొరకదని గుర్తుంచుకోవాలని, కాబట్టి రైతుకు పూర్తిగా సహకారం అందించి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేలా చూడాలని కోరారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక గురించి కలెక్టర్ వివరిస్తూ, సిండికేట్ బ్యాంకును కామారెడ్డి జిల్లాకు లీడ్‌బ్యాంక్‌గా నిర్ణయించడం జరిగిందన్నారు. 2017-2018కి వార్షిక రుణప్రణాళిక 2,758కోట్లు అవసరం అయితే, ఇందులోంచి 2,678 కోట్లు 97.10 శాతం పూర్తి ప్రణాళికలో సిద్ధంగా ఉందన్నారు. దీంట్లో 32.77 శాతం గత సంవత్సరం కేటాయింపు జరిగిందని, ఇందులో వ్యవసాయ శాఖకు 2,206 కోట్ల మేజర్ షేర్ ఉందన్నారు. ఇది మొత్తం ఋణప్రణాళికలో 79.99 శాతం అవుతోందని, ఇందులోంచి 36.65 గత ఏడాది కేటాయింపు జరిగిందన్నారు. 1672 కోట్లు క్రాప్‌లోన్‌కింద ఇవ్వడం జరిగిందని, ఇందులో ఇప్పటి వరకు వ్యవసాయ దారులకు ఇవాల్సిన షేర్ టర్మ్‌లోన్స్ 534 కోట్లు అన్నారు. గత ఏడాది కంటే ఈసారి నాల్గు శాతం ఎస్టిమేషన్ పెరిగిందన్నారు. వ్యవసాయ సెక్టార్‌లో ఎంఎస్‌ఎమ్‌ఇకి 344 కోట్లు, ఇతర ప్రయార్టీ సెక్టార్‌లకు 128 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి ఎక్కువ శాతం రుణాలు కేటాయించడం జరిగిందని, రైతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2017-2018జిల్లా వార్షిక రుణప్రణాళికతో రైతులకు సంపూర్ణంగా న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. అనంతరము సిండికేట్ బ్యాంకు రూపొందించిన కామారెడ్డి జిల్లా ‘వార్షిక రుణప్రణాళిక’పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంతకు ముందు బ్యాంకు అధికారులు జిల్లా కలెక్టర్‌కు నోట్‌బుక్‌లు అందచేశారు. ఈసమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సత్తయ్య, సిండికేట్ బ్యాంకు లీడ్ చీఫ్ మేనేజర్ కె.శివప్రసాద్, సిండికేట్ బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షేక్ నజీర్ ఆహ్మద్‌తో పాటు జిల్లాలోని బ్యాంకు మేనేజర్‌లు పాల్గొన్నారు.