నిజామాబాద్

గోవుల అక్రమ రవాణాను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, జూన్ 22: నిబంధనలకు విరుద్ధంగా జిల్లా నుండి వేలాది సంఖ్యలో గోవులను, దూడలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారని, గోరక్ష చట్టం ప్రకారం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, సర్వసమాజ్ కమిటీ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని కలెక్టరేట్ ఎదుట సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఎలాంటి అనుమతులు లేకుండానే విచ్చల విడిగా స్లాటర్ హౌస్‌లు వెలుస్తున్నా, సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. గోవధను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకవస్తున్నా, వాటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందంచి గోవుల అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు స్లాటర్ హౌజ్‌లలో మితిమీరిపోతున్న గోవధను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ యోగితారాణాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌తో పాటు సభ్యులు పాల్గొన్నారు.