ఆటాపోటీ

విస్తరించిన సూపర్ స్టార్ సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లోనేకాదు.. క్రీడల్లోనూ సూపర్ స్టార్ సంస్కృతి విస్తరిస్తున్నదనడానికి మన దేశమే ఉదాహరణ. ఇక్కడ క్రికెట్ ఒక మతం. అభిమానులకు క్రికెటర్లే దేవతలు. ఆ వెర్రి అభిమానమే క్రికెట్‌లో సూపర్ స్టార్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నది. సచిన్ తెండూల్కర్ వంటి ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలా? వద్దా? అనేది సెలక్షన్ కమిటీ నిర్ణయంపైకాదు.. వారి ఇష్టాయిష్టాల ప్రకారమే ఉండేది. ఇప్పటికీ అదే తీరు కొనసాగుతున్నది. ఆడినా, ఆడకపోయినా ధోనీ లాంటి క్రికెటర్లను జాతీయ జట్టులో కొనసాగించాల్సిందే. తమకు ఇష్టం ఉంటే ప్రాక్టీస్‌కు హాజరవుతారు. లేకపోతే లేదు. ఇష్టం ఉంటేనే సిరీస్‌లకు సిద్ధమవుతారు. లేదంటే విశ్రాంతి తీసుకుంటారు. ప్రాక్టీస్‌కు రావాల్సిందేనని, జాతీయ జట్టు తరఫున ఆడాల్సిందేనని శాసించే శక్తి కోచ్‌సహా ఎవరికీ లేదు. ఈ సూపర్ స్టార్ సంస్కృతి ఉంది కాబట్టే టెస్టు క్రికెట్ నుంచి వైదొలగినప్పటికీ ధోనీకి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్టు దక్కింది. గవాస్కర్‌కు చెందిన పిఎంజి కంపెనీ శిఖర్ ధావన్, రిషబ్ పంత్, సర్ఫ్‌రాజ్ ఖాన్ వంటి క్రికెటర్లను ప్రమోట్ చేస్తున్నది. అతను బిసిసిఐ అధికార కామెంటేటర్. పరస్పర ప్రయోజనాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.