ఆటాపోటీ

ఒక రాజీనామా వంద ప్రశ్నలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల పాలనాధికారుల బృందం (సిఒఎ) నుంచి ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ వైదొలగడం ఎన్నో ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. విశ్రాంత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ అధ్యక్షతన, మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ, ఆర్థిక నిపుణుడు విక్రం లిమాయే కూడా సభ్యులుగా ఉన్న సిఒఎలో గుహకు చోటు దక్కడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. క్రీడల గురించి ఏమీ తెలియని అతనిని సిఒఎ సభ్యుడిగా సుప్రీం ఎందుకు ఎంపిక చేసిందో ఎవరూ ఊహించలేకపోయారు. అతను ఏమీ చేయలేడని, అతను సాధించేదేమీ ఉండదని నిర్ధారణకు వచ్చినవారు కూడా లేకపోలేదు. కానీ, అందరి అంచనాలను, అనుమానాలను తప్పని గుహ నిరూపించాడు. చాలా కొద్ది రోజుల్లోనే బిసిసిఐ తీరుతెన్నులను పసిగట్టాడు. జరుగుతున్న పొరపాట్లను గ్రహించాడు. బోర్డుపై కొంత మంది పెత్తనం ఏ విధంగా కొనసాగుతున్నదో గమనించాడు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, అడ్డదారులను కనుక్కొని మరీ బోర్డు నుంచి కోట్లాది రూపాయలు ఏ విధంగా బొక్కుతున్నారో సాక్ష్యాధారాలతో సహా సేకరించాడు. లోధా కమిటీ చేసిన సూచనలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు బుట్టదాఖలవుతున్నా సిఒఎలోని మిగతా సభ్యులు పట్టించుకోకుండా నిర్లిప్తంగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కమిటీ చీఫ్ వినోద్ రాయ్‌కు సమర్పించిన రాజీనామా లేఖలో అన్ని అంశాలను సవివరంగా ప్రస్తావించాడు. బోర్డులో అవకతవకలను ఎత్తిచూపాడు. అతని లేఖతో వంద ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
పాత అంశాలే కొత్తగా..
గుహ రాజీనామా లేఖతో చాలా వరకూ పాత అంశాలే మళ్లీ జీవం పోసుకున్నాయి. పరస్పర ప్రయోజనాలకు ఆస్కారమిచ్చే పదవులు, హోదాలు లేదా మరే ఇతర సంబంధాలు బిసిసిఐతో ప్రత్యక్ష సంబంధాలున్న వ్యక్తులకు ఉండరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని ఇండియా సిమెంట్స్ ఇండియా కొన్నది. ఆ కంపెనీకి శ్రీనివాసన్ జయమాని. అంటే, అతను బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతూనే, అదే బోర్డు ఆధ్వర్యంలో జరిగే ఐపిఎల్‌లో ఒక ఫ్రాంచైజీ యజమానిగా అవతారం ఎత్తాడు. ఈ విషయానే్న సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో ప్రస్తావించింది. బిసిసిఐ అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేద్దామనుకున్న శ్రీనివాసన్‌కు ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాలని ఆదేశించింది. ఫ్రాంచైజీ యజమానిగా కొనసాగితే బోర్డు అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదని, ఒకవేళ అధ్యక్ష పదవే కాలానుకుంటే, ఫ్రాంచైజీని వదులుకోవాలని స్పష్టం చేసింది. అతను చెన్నై సూపర్ కింగ్స్‌కే మొగ్గు చూపడంతో బోర్డు అధ్యక్షుడిగా పోటీ చేయలేకపోయాడు. బోర్డు నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతిఫలాన్ని పొందే లేదా పొందే అవకాశం ఉన్న రెండు పదవుల్లో ఎవరూ కొనసాగడానికి వీల్లేదని సుప్రీం కోర్టు చేసిన ఆదేశాన్ని కొంత మంది బేఖాతారు చేస్తున్న వైనం గుహ లేఖ ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చింది. సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీ తదితరులు ఒకవైపు బోర్డులో కీలక పదవులను అనుభవిస్తూనే మరోవైపు క్రికెట్‌కు సంబంధించిన వ్యాపారాల్లోనే మునిగి తేలుతున్నారు. గవాస్కర్ బిసిసిఐ కామెంటరీ బృందంలో సభ్యుడు. క్రికెటర్లను ప్రమోట్ చేసే పిఎంజికి అతనే చీఫ్. పలువురు భారత క్రికెటర్లు ఈ కంపెనీకి కస్టమర్లు. అంటే, కామెంటరీ చెప్పే లేదా విశే్లషణ చేసే సమయాల్లో అతను తన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్లను ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా పరస్పర ప్రయోజనాల కిందకే వస్తున్నప్పటికీ, సిఒఎ పట్టించుకోలేదు. సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూనే ఉంది.
పరస్పర ప్రయోజనాలున్న వారి జాబితాలో మాజీ క్రికెటర్ ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ కూడా చేరతాడు. ప్రస్తుతం అతను భారత ‘ఎ’ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో, ఐపిఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు మెంటర్‌గా కూడా సేవలు అందిస్తున్నాడు. అంటే, బిసిసిఐ నుంచి పూర్తికాల కోచ్‌గా జీతం తీసుకుంటునే, అదే బోర్డు ఆధ్వర్యంలో జరిగే ఐపిఎల్‌లో ఒక ఫ్రాంచైజీకి మెంటర్‌గా కొనసాగడాన్ని కూడా పరస్పర ప్రయోజనాల కోణంలోనే చూడాలి. టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ధోనీకి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్టును బిసిసిఐ కట్టబెట్టింది. అతనికి రితీ పేరుతో క్రికెటర్లను ప్రమోట్ చేసే కంపెనీ ఉంది. భారత జాతీయ కోచ్ అనిల్ కుంబ్లే టెన్విక్ స్పోర్ట్స్ కంపెనీకి యజమాని. సహజంగానే అతను ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసి, వారిని తన కంపెనీ క్లయింట్లుగా మార్చుకునే అవకాశం ఉంది.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా తక్కువేం తినలేదు. సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్‌తో కలిసి క్రికెట్ సలహా కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఓ ప్రముఖ చానెల్‌లో అతను ఎక్స్‌పర్ట్ కామెంటేటర్. గంగూలీ పరస్పర ప్రయోజనాలు పొందుతున్నాడని గుహ తన రాజీనామా లేఖలో పరోక్షంగా ప్రస్తావించాడు. జాతీయ జట్టుకు సపోర్టింగ్ స్ట్ఫాగా ఉన్న ఆర్.శ్రీ్ధర్, సంజయ్ బంగార్, భరత్ అరుణ్ మరోవైపు ఐసిసి ఫ్రాంచైజీల్లోనూ కొనసాగుతూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. జాతీయ జట్టులో వీరు ఏదో ఒక రకంగా భాగస్వాములు కాబట్టే వారికి ఫ్రాంచైజీలు పెద్దపీట వేశాయనే వాదనలో నిజం లేకపోలేదు. మొత్తం మీద లోధా కమిటీ చేసిన సూచనలు, ప్రతిపాదనలు ఏవీ సక్రమంగా అమలు కావడం లేదన్నది వాస్తవం. బిసిసిఐ ఎందుకు స్పందించడం లేదన్నది ప్రశ్న.

- ఎస్‌ఎంఎస్