రంగారెడ్డి

వాతావరణ మార్పులతో పంటలపై పెను ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూన్ 24: వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగడం వల్ల వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న వంటి పంటలపై ప్రభావం అధికంగా ఉండనుందని మహారాష్ట్ర వసంతరావు నాయక్ మరఠ్వాడ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వాతావరణ మార్పులు, కార్బన్ స్థిరీకరణ అన్న అంశంపై పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో సాలీనా వర్షపాతం శాతం తగ్గిపోయినా, వర్షపాతం పడే రోజులు తగ్గడమే కాకుండా వర్షపాత నమోదులో హెచ్చుతగ్గులు ఉంటాయని అన్నారు. దీనివల్ల వరదలు, కరవు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడనున్నాయన్నారు. భూమి కోతకు గురికావడం వల్ల సారవంతమైన మట్టి కొట్టుకుపోయి.. కార్భనం శాతం తగ్గే ప్రమాదం ఉందన్నారు. నీటి వనరుల సంరక్షణ, వాటర్‌షెడ్ వంటి కార్యక్రమాలతో కార్బన స్థిరీకరణ పెంచవచ్చని అన్నారు. భూమి పొరలలో సేంద్రియకార్బనం పెంచడంపై దృష్టి నిలపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రభుత్వపరమైన విధాన నిర్ణయాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యా స్థాయిలోనే వాతావరణ మార్పులపై విద్యార్థులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం బి.వెంకటేశ్వర్లును సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామమూర్తి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఎ. పద్మారావు, డాక్టర్ రామమూర్తి కూతురు డాక్టర్ ఆదిలక్ష్మి, పరిశోధనా సంచాలకులు డాక్టర్ డి.రాజిరెడ్డితో పాటు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, పలువురు శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు.