రంగారెడ్డి

కారులో ఊపిరి ఆడక.. బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జూన్ 24: కారులో ఊపిరి ఆడక ఓ బాలుడు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... గండిపేట మండలం పీరం చెరువు గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ 9వ వార్డు మెంబర్ అమీన్ కుమారుడు సజ్జాత్‌కు రెండున్నర సంవత్సరాలు. గురువారం సాయంత్రం సజ్జాత్ ఇంట్లోని కారులోకి ఎక్కి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో కారు డోర్స్ లాక్‌లు పడిపోయాయ. ఊపిరి ఆడక సృహ తప్పి పడిపోయాడు. కాగా, సజ్జాత్ కారులోనే ఉండిపోయాడని బంధువులు చూసి వెంటనే సమీపంలో ఉన్న సాధన్ ఆసుపత్రికి తరలించారు. అయితే, సాధన్ ఆసుపత్రి నుంచి నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో శనివారం రాత్రి వరకూ ఎలాంటి సమాచారం లేదని, ఇంకా పోలీస్ కేసు కాలేదని ఎస్‌ఐ. సుధీర్ తెలిపారు.