నిజామాబాద్

గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూన్ 25: జిల్లా కేంద్రంలోని ఇఎస్సార్ గార్డెన్స్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, తుఫాన్ వాహనంలో రవాణా అవుతున్న 26 గంజాయి ప్యాకెట్లు పట్టుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి డిఎస్పీ ప్రమీల చెప్పారు. ఆదివారం కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ, శనివారం మధ్యాహ్నం సమయంలో టౌన్ సిఐ శ్రీ్ధర్‌కుమార్, ఎస్‌ఐ శోభన్‌బాబు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వారికి అందిన సమాచారం మేరకు ఎపి 25.వి.8429 నంబర్‌గల తుఫాన్ వాహనం ఆపి తనిఖీ చేసినట్లు చెప్పారు. ఈ తనిఖీ మూడు బస్తాల్లో 26 ప్యాకెట్ల గంజాయి పోడి ఉందని, మొత్తం 52కేజీల వరకు గంజాయి ఉందని తెలిపారు. ఈ గంజాయిని రవాణా చేస్తున్న మెదక్ జిల్లా పాపన్న పేట్ మండలం యూసుఫ్‌పేట్‌కు చెందిన నింగజోల్ల మోహన్‌రావు, జిల్లాకు చెందిన సంతక్‌రావులు కలిసి ఆంధ్రాప్రాంతంలోని వైజాగ్‌కు చెందిన అప్పలనాయుడు నుండి గంజాయిని కొనుగోలు చేసి, నాసిక్‌లోని రాహుల్, నిలేష్‌లకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. వీరి వద్ద వాహనంలో ఉన్న మూడు బస్తాల్లో ఉన్న 26 గంజాయి ప్యాకెట్లు మూడు సెల్‌ఫోన్‌లు, తుఫాన్ వాహనం స్వాధీనం చేసుకుని సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరిలించినట్లు వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో సిఐ శ్రీ్ధర్‌కుమార్, ఎస్‌ఐ శోభన్‌బాబు, పోలీసులు ఉన్నారు.