నిజామాబాద్

కులవృత్తులకు పూర్వవైభవం తెస్తున్న తెరాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్ రూరల్, జూన్ 25: సమైక్య రాష్ట్రంలో నిరాధారణకు గురైన కులవృత్తుల వారిని ఆర్థిక చేయూతను అందించి, వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృషి చేస్తున్నారని రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. ఆదివారం మోపాల్ మండల కేంద్రంలో గొల్ల, కుర్మ, యాదవులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అందులో భాగంగానే కులవృత్తుల వారికి ఆర్థిక చేయూతను అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఇప్పటికే గంగపుత్రులకు చేపల పెంపకం, గొల్ల, కుర్మ, యాదవ కుటుంబాలకు గొర్రెల పెంపకం యూనిట్లను అందజేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న గొర్రెల యూనిట్లను సద్వినియోగం చేసుకుంటూ గొల్ల, కుర్మ, యాదవులు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 500 కోట్ల వ్యయంతో గొల్ల, కుర్మ, యాదవులకు ఈ గొర్రెల యూనిట్లను అందిస్తున్నామని, ఇది వచ్చే మూడేళ్లలో 25వేల కోట్ల సందప కానుందని బాజిరెడ్డి తెలిపారు. ఒకవేళా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న గొర్రెలను విక్రయించుకునే వారిపై చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గొర్రెలు అనారోగ్యానికి గురైతే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే పశువైద్యశాఖ వైద్యులే ఇంటికి వైద్యం అందించి వెళ్తారని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా వితంతులు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు ఆసర, జీవన భృతికి కింద పెన్షన్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. పేద ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి ప్రథకాన్ని ప్రవేశపెట్టి, ఒక్కో ఆడబిడ్డ వివాహానికి 51వేల రూపాయలు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ పథకాన్ని బిసిలకు సైతం వర్తింపజేసి, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ యువతుల వివాహాలకు 75,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సామ ముత్యం, ఎంపిటిసి దండు నర్సయ్య, సర్పంచ్ గణపతి, తహశీల్దార్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపిడిఓ సంజీవ్‌కుమార్, గ్రామ కార్యదర్శి గంగధర్‌తో పాటు టిఆర్‌ఎస్ నాయకులు, గొల్ల, కుర్మ, యాదవ కులస్థులు పాల్గొన్నారు.