నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ సతి పెక్కు కల్ములిడ నేర్పరి, లోకమకల్మషంబుగా
నీ సుత సేయు పావనము, నిర్మిత కార్య ధురీణ దక్షుడై
నీ సుతుడిచ్చు వాయువులు, నిన్ను భజించిన కల్గకుండునే
దాసుల కోప్సితార్థములు దాశరథీ కరుణాపయోనిధీ

భావము:ఓ దశరథరామా! నీ భార్య అయిన లక్ష్మీదేవి సమస్త వస్తు సంపదలిచ్చుటలో నిపుణురాలు. నీ కూతురైన గంగ మూడు లోకాల్లోనూ ప్రవహించి లోకాలలోని దోషాలను నిర్మూలించి పవిత్రములుగా చేస్తుంది. నీ కుమారుడైన బ్రహ్మ సృష్టి కార్యములను నిర్వహించే సమర్థుడై ఆయువులను ప్రసాదిస్తాడు. ఇట్టి పుత్రీ పుత్ర కళత్రాదులు గల నిన్ను భరించే నీ భక్తులకు కోరికల ప్రయోజనాలు నెరవేరకుండునా? నెరవేరునని భావము.
దాశరథీ శతకములోని పద్యము