నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారిజ పత్రమందిడిన వారి విధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దనువంటని కుమ్మరి పుర్వు రీతి సం
సారమునన్ మెలంగుచు విచారగ్రుడవై పరమొందుగాదె స
త్కార మెరింగి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ

భావము:ఓ దశరథరామా! తామరాకునందలి నీటిబొట్టు తామరాకును ఎట్లు అంటుకొనదో, బురదలో ఎపుడును కుమ్మరి పురుగు నివసించినా దాని శరీరమును బురద అంటుకొనక ఎట్లుండునో అట్లే మనుష్యుడు బుద్ధిమంతుడైనవాడు, సంసారిక జీవనములో ప్రవర్తిస్తూ వుండినా భగవత్సంబంధమైన విచారమును పొంది మంచి పనులు తెలిసి చేయడం చేత సంసార బంధములలో చిక్కుపడక మోక్షమును పొందుతాడు కదా.
దాశరథీ శతకములోని పద్యము