నెల్లూరు

స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వచ్ఛ్భారత్ హాస్యనాటిక అదిరింది
మోపూరు పెంచలనరసింహం, గాయిత్రి గారు రాసిన స్వచ్ఛ్భారత్ హాస్యనాటిక ఆధ్యంతం నవ్వులు పూయించింది. ఒక శవం కనిపిస్తే దాని చుట్టూ మతవాదులు, కులపిచ్చిగాళ్లు చేరి ఈ శవం మాది అంటూ చేసే విన్యాసాలు బాగున్నాయి. చివరికి ఆ చెత్తయ్య పైకి లేచి నేను మీ చెత్తయ్యను స్వచ్ఛ్భారత్ అంటే ఫొటోలు దిగడం కాదు.. మీ మనసులను కడగడం అంటూ చెప్పడం కొసమెరుపు. నాటికను మొదటి నుంచి చివరి వరకు బాగా నడిపించారు. ఎక్కడా కూడా బోరింగ్ లేకుండా నవ్వుతూ చదివేలా మాకు అందించిన రచయితలు పెంచల నరసింహం, గాయిత్రి గారికి మా హృదయపూర్వక అభినందలు.
- ఏకొల్లు సాయిరాజా, గిద్దలూరు
- యెన్ని రమాదేవి, నెల్లూరు
- కూనం బాలచంద్ర, కాళహస్తి

భూమి నా భావావేశం కవిత బాగుంది
భూమి నా భావావేశం అంటూ నెమిలేటి గారు కవిత అద్భుతంగా వుంది. పుడమి తల్లిని మనం ఎన్నిరకాలుగా నాశనం చేస్తున్నామో వివరిస్తూ కాపాడుకోవల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. అభినందనలు
లతాశ్రీ, గూడూరు
త్యాగరాజు, తిరుచానూరు
మన కర్తవ్యం నచ్చింది
గతవారం మెరుపులో కుర్రా ప్రసాదబాబు గారు అందించిన మన కర్తవ్యం కవిత చాలా బాగుంది. మొదటి నుంచి చివరి వరకు కవితను అద్భుతంగా రాశారు. తెలుగు గొప్పదనాన్ని వివరిస్తూ తెలుగును కాపాడుకోవడం మన మొదటి కర్తవ్యమంటూ వివరించి తెలుగుకు అక్షరాలతో పట్ట్భాషేకం చేశారు. ధన్యవాదములు.
- తిప్పావర్జుల సాయిలత, కావలి
- హేమంత శ్రీనివాసులు, చీరాల