మెయన్ ఫీచర్

చైనాకు సమరపాఠం? టిబెట్ స్వాతంత్య్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టడం చారిత్రక అనివార్యం. ఆ ప్రారంభానికి ఇప్పుడు అంకురార్పణ ఎందుకని జరగరాదు? టిబెట్ రెండు వేల ఏళ్లకు పైగా స్వతంత్ర దేశమని, దాన్ని క్రీస్తుశకం 1959లో చైనాలోని కమ్యూనిస్టు నియంతృత్వ ప్రభుత్వం దురాక్రమించిందని మన ప్రభుత్వం ఇప్పుడైనా ఎందుకు ప్రకటించరాదు? ఎందుకంటే మన ‘డోకలా-డోక్‌లామ్’-పచ్చిక మైదానాన్ని చైనా వారి ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’-పిఎల్‌ఏ-ముష్కరులు గత వారం దురాక్రమించడానికి ఏకైక ప్రాతిపదిక టిబెట్ ఇంకా చైనా దురాక్రమణలో కొనసాగుతుండడం! ‘డోకలా’ మన సిక్కింలోను, భూటాన్‌లోను విస్తరించి ఉంది! దీనికి ఉత్తరంగా టిబెట్ ఉంది. అందువల్ల ఈ ప్రాంతం రెండు వేల ఐదు వందల ఏళ్లుగా భారత-టిబెట్ సరిహద్దు మాత్రమే! స్వతంత్ర టిబెట్‌కు ఉత్తరంగా ఈశాన్యంగా నెలకొని ఉండిన ‘డోకలా’తో చైనాకు ఎలాంటి భౌగోళిక సామీప్యం-కాంటిగ్విటీ-కాని, సంబంధం కాని 1959 వరకు లేదు! 1959లో చైనా టిబెట్‌ను దుర్మార్గంగా ‘కబ్జా’ చేసిన తరువాత మాత్రమే, మన ఉత్తర సరిహద్దున చైనా సరిహద్దు ‘కదలి’ రాగలిగింది. ఎందుకంటే, ఈ దురాక్రమణ తరువాత ‘్భరత-టిబెట్’ సరిహద్దు ‘్భరత-చైనా’ సరిహద్దుగా మారిపోయింది. ఈ చారిత్రక భౌగోళిక దురన్యాయం దశాబ్దులుగా చైనా వారి ప్రచ్ఛన్న బీభత్స దళాలు ఇప్పుడు ‘డోకలా’లోకి చొరబడడానికి ‘బాట’ వేసింది. సహస్రాబ్దులుగా మన భూభాగాలు మన దేశం నుంచి విడిపోయాయి, శతాబ్దులుగా చైనా ఇతర దేశాలకు చెందిన భూభాగాలను దురాక్రమిస్తోంది. ‘డోకలా’లోకి చైనా చొరబడిపోవడానికి ఇదీ నేపథ్యం.. రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితం వరకు టిబెట్ -త్రివిష్టపం- మనదేశంలో భూభాగం! ఆ తరవాత విడివడి స్వతంత్ర దేశమైంది, భూటాన్- నేపాల్- బర్మా దేశాలు కూడ బ్రిటన్ దురాక్రమణకు పూర్వం భారతదేశంలోని భూభాగాలు..! అనాదిగా తనవి కాని మంచూరియా, టిబెట్, సింకియాంగ్‌లను మంగోలియాలోని అనేక ప్రాంతాలను చైనా వివిధ కాలాలలో దురాక్రమించుకుంది. స్వీయ భూభాగాలను కోల్పోవడం మన దేశ చరిత్ర, ఇతరుల భూమిని ‘కబ్జా’ చేయడం చైనా చరిత్ర.. ఇదీ స్పష్టమైన తేడా! టిబెట్‌ను ఆక్రమించిన చైనా ఆ తరువాత మన లడక్‌లోకి చొరబడింది, ఇప్పుడు మన సిక్కింలోకి, భూటాన్‌లోకి చొరబడింది. ‘చైనా చాచిన చేతికి టిబెట్ అరచేయి, లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్‌ప్రదేశ్‌లు ఐదు వేళ్లు..’ అని చైనా మాజీ కమ్యూనిస్టు నియంత మావో ఝేఢుంగ్ అభివర్ణించేవాడట! ఇదీ చైనా దురాక్రమణ స్వభావం!
చైనా దురాక్రమణ మనదేశానికి వ్యతిరేకంగా ఐదు విధాలుగా కొనసాగుతోంది. భౌతిక దురాక్రమణ, ఆర్థిక దురాక్రమణ, బౌద్ధిక దురాక్రమణ, సాంస్కృతిక దురాక్రమణ, వ్యూహాత్మక దురాక్రమణ.. అతి పెద్ద పైశాచిక వదనంతో అబద్ధాలను చెప్పడం చైనా దురాక్రమణలోని ఇతివృత్తం! ఈ అబద్ధాల ప్రచారంలో భాగంగానే చైనా ప్రభుత్వం ‘డోకలా’ తమ దేశానికి చెందిన పచ్చిక మైదానమని వాదిస్తోంది! టిబెట్ స్వతంత్రంగా ఉండినన్ని సహస్రాబ్దులలో భూటాన్, సిక్కిం, నేపాల్, లడక్, అరుణాచల్‌ప్రదేశ్‌లు ఎక్కడ ఉన్నాయన్నది కూడ చైనాలోని ‘హోణ’ జాతీయులకు తెలియదు! తమ దేశానికి దక్షిణాన ఉన్న స్వతంత్ర టిబెట్‌ను కబళించడానికి దాదాపు పది హేను వందల ఏళ్లపాటు చైనా విఫలయత్నం చేసింది, కానీ టిబెట్ చైనాకు లొంగలేదు, ఓడిపోలేదు, స్వాతంత్య్రాన్ని కోల్పోలేదు. క్రీస్తుశకం 1914లో సిమ్లాలో భారత దేశం తరఫున బ్రిటన్‌కు, స్వతంత్ర టిబెట్‌కూ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మెక్‌మాహన్ రేఖ ఏర్పడింది, భూటాన్‌కు తూర్పుగా ఉన్న ‘్భరత-టిబెట్’ సరిహద్దు రేఖకు ‘మెక్‌మాహన్‌రేఖ’ అని నామకరణం చేసారు! బ్రిటన్ ప్రతినిధి పేరు మెక్‌మాహన్! ఈ ‘మెక్‌మాహన్ రేఖ’కు దక్షిణంగా, నైరుతి దిక్కుగా మన అరుణాచల్‌ప్రదేశ్ విస్తరించి ఉంది, ఉత్తరంగా టిబెట్ ఉంది. అప్పటి వరకు రాజకీయాల కంటే, వాణిజ్యాని కంటే సంస్కృతికి మన దేశంలో ప్రాధాన్యం హెచ్చుగా ఉండేది! అందువల్ల సమాన సంస్కృతికి చెందిన టిబెట్‌కు, మన దేశానికి మధ్య భౌగోళికమైన సరిహద్దును నిర్దిష్టంగా నిర్ధారించుకోవాలన్న ధ్యాస ఉభయ దేశాలకు కలగలేదు. బ్రిటన్ సామ్రాజ్యవాదులు 1903లో టిబెట్‌లోకి చొరబడిన తరువాతనే ఈ ‘్భగోళిక’ ధ్యాస పెరిగింది. ఫలితంగా అరుణాచల్ టిబెట్ కలిసే చోట ‘రేఖ’ ఏర్పడింది. ఈ ‘రేఖ’ను క్రీస్తుశకం 1959 నుంచి చైనా తిరస్కరించడం అరుణాచల్ తమదని చైనా నియంతలు వాదించడానికి ప్రాతిపదిక! కలియుగం ఆరంభం నాటికి అంటే 5118 ఏళ్లనాటికి ‘టిబెట్ అఖండ భారతఖండంలో భాగం...’ అన్నది చారిత్రక వాస్తవం!క్రీస్తునకు పూర్వం 833వ సంవత్సరం నుండి క్రీస్తునకు పూర్వం 327వ సంవత్సరం వరకు మొత్తం భరత ఖండాన్ని ఆంధ్ర శాతవాహనులు పాలించారు! ఈ ఆంధ్ర శాతవాహనుల పాలన ఆరంభం అయ్యేనాటికి తూర్పు బర్మా నుండి పడమర నేటి ఆఫ్ఘనిస్తాన్ వరకు దక్షిణాన శ్రీలంక, మాలా ద్వీపాల నుంచి ఉత్తరాన టిబెట్ వరకు భారతదేశపు ‘సమీకృత రాజ్యాంగ వ్యవస్థ’ నెలకొని ఉండేది. గిరివ్రజం కేంద్ర రాజధానిగా కలియుగం ఆరంభం-క్రీస్తునకు పూర్వం 3102వ సంవత్సరం-నుండి కలియుగం 2775వ సంవత్సరం వరకు కొనసాగిన మగథ సామ్రాజ్యం ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ! ఈ సామ్రాజ్యపు సూత్రప్రాయ అధికారానికి లోబడిన యాబయి ఆరురాజ్యాలు-ప్రాంతాలు-అఖండ భారత భౌగోళిక స్వరూపంలో భాగం! టిబెట్, భూటాన్, నేపాల్ అలాంటి అఖండ భారత ప్రాంతాలు! ‘గిరివ్రజం’లో ఆంధ్ర శాతవాహనుల సామ్రాజ్య అధికారం మొదలైనప్పుడు ఈ భౌగోళిక స్థితి నెలకొని ఉండేది. క్రీస్తునకు పూర్వం 327లో అంటే కలియుగం 2775వ సంవత్సరంలో ఆంధ్ర శాతవాహనుల సామ్రాజ్య అధికారం పరిసమాప్తం అయ్యేనాటికి త్రివిష్టపం-టిబెట్ మన దేశం నుంచి విడిపోయి ఉంది! భూటాన్, నేపాల్ మాత్రం ఆ తరువాత కూడ ‘అఖండ భారత్’లో కొనసాగాయి! అఖండ భారత్‌ను ఆక్రమించిన బ్రిటన్ పెత్తందార్లు నేపాల్‌ను, భూటాన్‌ను మాత్రం 1947 వరకు ఆక్రమించలేకపోయారు! అలా నేపాల్, భూటాన్‌లు అఖండ భారత్ నుండి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడినాయి! భూటాన్‌కు, టిబెట్‌కు మధ్య సిక్కింకు, టిబెట్‌కు మధ్య బ్రిటన్ మనదేశంపై పెత్తనం చెలాయించిన కాలంలో సరిహద్దుల వివాదం లేదు! కైలాసం, మానస సరోవరాలు ఇప్పుడు టిబెట్‌లో ఉన్నప్పటికీ అవి భారతదేశంలోనివన్న చారిత్రక వాస్తవం మరుగున పడలేదు! ఈ చరిత్ర తెలియని అప్పటి మన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ క్రీస్తుశకం 1955వ దశకంలో చైనా టిబెట్‌ను దురాక్రమించడాన్ని సమర్ధించాడు! 1959 వరకు ఎవరి అనుమతి అవసరం లేకుండానే భారతీయులందరూ బదరీనాధ్‌కు వెళ్లినట్టు, పశుపతినాథ్‌కు వెళ్లినట్టు మానస సరోవరానికి, కైలాస పర్వతానికి వెళ్లివచ్చారు! ‘డోక్‌లా’ పచ్చిక మైదానం ఉందని కూడ చైనీయ సామ్రాజ్యవాదులకు తెలియదు...
ఇప్పుడు ‘డోక్‌లా’ తమదని, అది భూటాన్‌లోను, సిక్కింలోను విస్తరించి లేదని చైనా నియంతలు పేచీ పెట్టడానికి ఇలా ఏకైక కారణం ‘టిబెట్’ను చైనా కాజేయడాన్ని క్రీస్తుశకం 1950వ దశకంలో మన ప్రభుత్వం సమర్ధించడం.. టిబెట్‌ను చైనా కాజేయడాన్ని చిన్నదేశమైన భూటాన్ క్రీస్తుశకం 1910లో నిరసించింది, 1959లో మళ్లీ నిరసించింది! ఈ చిట్టిదేశం నిరసన ధ్వనులను మన ప్రభుత్వం 1950వ దశకంలో ఆలకించి ఉండినట్టయితే ఇప్పుడు ‘డోకలా’లోకి చైనా చొరబడి ఉండేది కాదు! 1910లో భూటాన్ ‘నిరసన’ను బ్రిటన్ దురాక్రమణలో భారతప్రభుత్వం ఆలకించింది! 1910లో చైనా టిబెట్‌పై దాడి చేసింది. అప్పటి దలైలామా ‘్భరత ప్రభుత్వాన్ని’ సహాయం అర్ధించాడు. 1914లో కుదిరిన ‘సిమ్లా ఒప్పందం’ దీని ఫలితం! టిబెట్‌పై దాడి చేసిన చైనా తమ దేశంలోకి కూడ చొరబడిపోతుందని 1910లో భూటాన్ భయపడింది! అందువల్ల బ్రిటన్ దురాక్రమణలోని భారతప్రభుత్వంతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి భూటాన్ ‘్భరత రక్షణ లోని స్వతంత్రదేశం’- 1910 నాటి ఒప్పందాన్ని స్వతంత్ర భారతదేశం, భూటాన్ 1949లో మళ్లీ ధ్రువీకరించాయి! అందువల్ల భూటాన్ సరిహద్దులను రక్షించవలసిన బాధ్యత మన ప్రభుత్వానిది. డోకలాలో మన సైనికులు ఈ బాధ్యతను నిర్వహిస్తున్నారు. చైనా దళాల చొరబాటును నిరోధిస్తున్నారు...
డోకలా ఫ్రాంతంలోకి చైనా చొరబడడం తాత్కాలిక సమస్య, టిబెట్ స్వాతంత్య్రం వౌలిక సమస్య. మన దేశపు దీర్ఘకాల భద్రతకు, నేపాల్ భూటాన్‌ల స్వాతంత్య్ర పరిరక్షణకు శాశ్వత పరిష్కారం టిబెట్‌ను మళ్లీ స్వతంత్ర దేశంగా నిలబెట్టడం! ఇందుకు ప్రాథమిక చర్యగా మన ప్రభుత్వం టిబెట్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించడం. మన ప్రభుత్వం పూనుకున్నట్టయితే తూర్పు ఆసియా దేశాలు, జపాన్, దక్షిణ కొరియా వంటి ఈశాన్య ఆసియా దేశాలు ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు ‘్ధర్మశాల’లోని ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి ‘పరిగణన’ను ప్రసాదించగలవు!
చైనా భౌతిక దురాక్రమణను వాణిజ్యంతో అనుసంధానం చేయలేకపోవడం మన అంతర్గత వైఫల్యం! ‘డోకలా’ మైదానంలోకి చైనా దళాలు చొరబడిన సమయంలోనే మరికొన్ని చైనీయ వాణిజ్య సంస్థలు మన దేశంలో కొత్త పెట్టుబడులను పెట్టినట్టు ప్రచారమైంది! ఈ వాణిజ్య దురాక్రమణలో భాగంగానే అక్కరలేని నాసిరకం వస్తువులు కుప్పలు తెప్పలుగా మన దేశంలోకి వచ్చి పడుతున్నాయి. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆరంభించిన ‘పథభగ్న’-పాత్‌బ్రేకింగ్-విధానం ఈ చైనా వాణిజ్య దురాక్రమణకు కొత్త బాటను వేసింది! చైనా మన పులులను భోంచేసింది, ఎఱ్ఱ చందనాన్ని చైనా ముఠాలు తమదేశానికి తరలించుకొనిపోతున్నాయి. చైనా వస్తువులను బహిష్కరించాలన్న స్వదేశీయ ఉద్యమవాణి ఇప్పటికీ ‘చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు’గా వినపబడడం లేదు. చైనా ప్రభుత్వం వారి అబద్ధాల వాణి మాత్రం కొన్ని ప్రచార మాధ్యమాలలో మారుమోగుతోంది. ఇది ‘బౌద్ధిక’ రంగంలో చైనీయుల చొరబాటునకు చిహ్నం. చైనా మనకు శత్రుదేశమన్న ధ్యాస మరిచి ‘చైనీస్ ఫుడ్’-చైనాతిండి-ను ప్రచారం చేస్తున్నవారు, భోం చేస్తున్నవారు భావదాస్యగ్రస్తులు. ఇది చైనా వారి సాంస్కృతిక దురాక్రమణ! వివిధ అంతర్జాతీయ వేదికలపై తెరవెనుక, తెర ముందు చైనా చేస్తున్న భారత వ్యతిరేక ప్రచారం వ్యూహాత్మక దురాక్రమణ.. ఆసియా అభివృద్ధి బ్యాంకు అరుణాచల్‌కు మంజూరు చేసిన ఋణాలను చైనా రద్దు చేయించింది, మాల్‌దీవులలో తిష్టవేసింది, అణు సరఫరాల కూటమిలో మన ప్రవేశాన్ని నిరోధించింది! మనం ‘షాంఘయి’ సంతకు వెళ్లి రావడం మానుకోలేమా?

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352