డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలో భావోద్వేగాలు ఉన్నాయని చెప్తుంది. కన్నీళ్ళలో అంత విలువ ఉంది. అవి కార్చడం ఎప్పుడూ వృధా కాదు. కాని నీకు కన్నీళ్ళు తెప్పించే కారణానికి కూడా కొంత అర్హత ఉండాలి.
చివరకు చాలా మెల్లగా, నా చెవుల్లో చెప్పినంత మెల్లగా అన్నాడు.
‘‘మనం అతని జీవితంలో ఎప్పుడూ చోటుచేసుకోలేదు’’.
నాకు అర్థమయింది వాడి బాధ. రఘు గురించి ప్రచురించిన వ్యాసాల్లో అన్నీ ఉన్నాయి. అతని చిన్నతనం, చదువు, చదువుకున్న కాలేజీ, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అచీవ్ చేసిన అవార్డ్స్, అకంప్లిష్‌మెంట్స్, స్నేహితులు, పరిచయస్తులు, సహచరులు, ప్రభావాలు అన్నీ- మేమిద్దరం తప్ప. అది చాలా బాధించింది వౌళిని.
వెంటనే వాడి భుజాలు పట్టుకుని దూరంగా జరిపాను. నా వంక చూడకుండా కళ్ళు వాల్చుకున్నాడు. పెదిమలు అదురుతున్నాయి.
‘‘నా వంక చూడు’’ అన్నాను లాలనగా. తడి తడిగా ఉన్న కళ్ళు పైకెత్తాడు.
‘‘మనదీ అనుకున్నది మనకు కాకుండాపోతే బాధ కలిగిస్తుంది. మనదే కానప్పుడు, మనకు అందలేదన్న బాధ ఎందుకు వస్తుంది?’’ అన్నాను.
అర్థం అయిందో లేదో నాకు తెలియదు. కానీ నా వంక చూచాడు అర్థం చేసుకుంటున్నట్లుగా.
తెల్లవారి లేస్తే- ఎంతోమంది గొప్ప వ్యక్తుల గురించి ఎన్నో వింటాం. చదువుతాం. కానీ, వారందరూ మనవారు కాదుగా! కానీ, మనకు గర్వకారకులు. ఎందుకంటే మన జాతికి చెందినవారు కాబట్టి. మానవులుగా ఇంత ప్రగతి సాధించారు కాబట్టి.
ఇదీ అంతే! ఆ వ్యాసంలో ఉన్న వ్యక్తి నీకు సంబంధించినవారూ అని నీకు ఒకరు చెప్పబట్టి తెలిసింది. అంతేగా! లేకపోతే తెలిసేది కాదు. అలా ఏ మాత్రం తెలియని వ్యక్తిని గురించి బాధపడకు. నీ కన్నీళ్ళు వేస్ట్ చేసుకోకు. అవి చాలా ప్రెషియస్. నాట్ ఎవ్రీవన్ డిజర్వ్స్ అన్నాను.
నిర్ఘాంతపోయి నా మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఇందాకటిలా పెదిమలు వణకడం లేదు. కళ్ళు తడి అవడంలేదు. అవి నన్ను పరికించడంలో మునిగిపోయాయి.
‘‘మరి నీకు బాధ అనిపించడంలేదా?’’ అన్నాడు.
వాడికి అబద్దం చెప్పడం ఇష్టంలేదు. అందుకే అన్నాను- ‘‘బాధగా ఉంది. అది నువ్వు అనుకుంటున్న బాధ కాదు. అది నీకు ఇప్పుడు అర్థం కాదు’’ అన్నాను. ఏం చెప్పను వాడికి నా బాధ.
రఘు ఈ స్థితికి చేరుకోడాన్ని చూచి నాకంటే ఎక్కువ సంతోషించేవారు ఉండరనా! కాని, అతని అభ్యున్నతి చూడాలనుకున్నది ఇలా పరాయిదానిలా కాదు. అతని పక్కన నుంచుని అతని భాగస్వామిగా. ఈ విజయంలో, అతని సంతోషంలో పూర్తిగా భాగం పంచుకుని.
కాని, ఇలా ఏదో న్యూస్‌పేపర్లో పడిన పరాయివారి వార్తలా కాదు.
ఇది వౌళికి ఎలా అర్థం అవుతుంది? ఒకరోజు సర్వస్వం అనుకున్నది మరోరోజు నీకు ఏమీ కాదన్న నగ్నసత్యాన్ని దిగమింగడం అంటే ఏమిటో- నేను చెప్పలేను. అందుకే అంతకుమించి ఏమీ చెప్పలేదు.
వౌళి మాట్లాడలేదు. మళ్లీ మెడ వంపులలో మొహం పెట్టుకున్నాడు. అది ఇందాకటి అంతగా అశాంతిగా లేదు. వాడి వెన్ను రాస్తూ ఆగిపోయాను.
‘‘ఏదో ఒక రోజు అతన్ని కలుస్తాను. అన్నీ అడిగేస్తాను’’ అన్నాడు.
‘‘తప్పకుండా చేద్దువుగాని. నీకా అవకాశం రాకుండా పోదు. కాని, ఇప్పుడు నీ మనసు బాధపెట్టుకోకు’’ అన్నాను.
వాడికి- ఆ సమయంలో క్షమలు, క్షమార్పణలు, పశ్చాత్తాపాల గురించి ఉపన్యాసం ఇవ్వదల్చుకోలేదు. వాడి మనసులో కోపం ఉంది. దాన్ని అలా వదిలేయడమే మంచిది. శృతిమించకుండా ఉండాలి అంతే!
ఒక్కొక్కసారి దేన్నైనా అదుపు చెయ్యాలనుకున్నా, నిరోధించాలనుకున్నా ప్రెషర్.. ఎక్కువై భళ్ళున బద్దలవుతుంది.
అందుకనే తగు మాత్రం కోపం పోషించుకుంటూ ఉంటే అదో మార్గదర్శకం అవుతుంది.
వౌళికి కోపంగా ఉంది. అందులో తప్పేం లేదు. అది తప్పన్నట్లు నీతులు చెప్పబోతే అది విషమిస్తుంది. వయసుతో విచక్షణ వస్తుంది. అదే నే కోరుకునేది.
ఆ తరువాత కొద్ది రోజులు చాలా ముభావంగానే తిరిగాడు. వాడికి ఏదో చెప్పాలని ఎవరూ ప్రయత్నించవద్దని చెప్పాను నేను. ఎందుకనో ఇంట్లో వారెవ్వరూ అభ్యంతర పెట్టలేదు. వాళ్ళకీ, వాడి కోపంలో నిజాయితీ కనిపించిందేమో!
ఇంతలో, మద్రాసులో క్రికెట్ మ్యాచ్ మొదలయింది. అన్నయ్య ఎంత ఖరీదు అని ఆలోచించకుండా వాడిని తీసుకుని మద్రాసు వెళ్ళాడు.
మాన్ ఆఫ్ ది ఇయర్ డా.రఘురాంగారి మాగజైన్, నా జ్ఞాపక శిథిలాలలో మరొకటిగా ఉండిపోయింది. వౌళి మళ్లీ దాని గురించి ఎప్పుడూ అడగలేదు. నేను మాట్లాడలేదు.
***
స్నానం పూర్తిచేసుకుని బయటకు వచ్చేటప్పటికి వౌళి ఇంకా అక్కడే కూచుని ఉన్నాడు.
నా కళ్ళకు ఎందుకో చాలా రోజుల ముందు ఒక టీనేజ్ కుర్రాడిలా కనిపించాడు. వాడికి 13, 14 ఏళ్ళ వయసులో మా వదిన ఎప్పుడూ వాడి క్రాఫ్‌ని సరిచేస్తూ ఉండేది. వాడికి తగని కోపం వచ్చేస్తూ ఉండేది. ‘అత్తా’ అంటూ చెయ్యి బలంగా పట్టుకుంటూ ఉండేవాడు. అప్పుడు వాడి మొహం ఇలాగే ఎర్రగా అయిపోయేది.
ఒక్కసారి వౌళి దగ్గరకు వెళ్ళాను. వాడి గడ్డం పట్టుకుని చిన్న పిల్లాడిలా ఊగించి నుదుట మీద ముద్దుపెట్టుకున్నాను. ‘‘వాట్ ఈజ్ మై నాట్ గుడ్ లుకింగ్ సన్ థింకింగ్’’ అన్నాను నవ్వుతూ.
వాడు కూడా నా వంక చూచాడు నవ్వుతూ. వాతావరణం కొంచెం ప్రశాంతమయింది. వాడు పుట్టినప్పుడు మా వదిన, వాడు అందవికారంగా పుట్టాడని అందని, మా అన్నయ్య చంద్రుడని పేరు పెట్టాడని- కథలు కథలు చెప్తూ ఉండేదాన్ని. అది వాడికి చాలా ఇష్టం. అందుకనే వాడి చిన్నతనం గుర్తుచెయ్యగానే వాడి మనసు ప్రపుల్లమయింది.
‘‘నీ నిర్ణయం కూడా ఇదే కదా!’’ అడిగాడు మూర్తిగారికి ఇచ్చిన సమాధానం గురించి. అవునని తల ఊగించాను. ‘‘కాని వౌళి, ఈ విషయంలో నా నిర్ణయం కాదు ముఖ్యం, నీది. ఇది నీ జీవితంలో ముఖ్యమైన రోజు.
-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి