నెల్లూరు

దేశభక్తిని రేకెత్తించే ‘విజయభారతం’ (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలం కిందట ఏదో దినపత్రికలో సంక్షిప్తంగా వెలువడిన ఒక వార్త తాలూకు ముఖ్యమైన వాక్యం రచయితను ప్రేరేపించి ఈ పద్యకావ్యం రచనకు పూనుకొనేటట్టు చేసింది. ఇందులోని ప్రాంతాలు, పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలే అని రచయిత అన్నప్పటికీ అవి మనమెరిగినట్లు మనచుట్టూ పరిభ్రవిస్తున్నట్లు తోస్తాయి.
కావ్య రచయిత రసరాజు గారు. వీరి పూర్తి పేరు రంగినీని సత్యనారాయణరాజు. సినీకవిగా కొద్దిపాటలే రాసినా అవి అన్నీ తెలుగు ప్రజలు గుర్తుంచుకొనేవే అయినా అందులో ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా కోసం కె.జె. ఏసుదాసు, మహదేవన్ స్వరకల్పనలో పాడిన ‘అందమైన వెనె్నలలోన అచ్చతెలుగు పడుచునవే’ అనేగీతం తెలుగు ప్రజల హృదయాలలో వారి స్థానాన్ని సుస్థిరం చేసిందని చెప్పక తప్పదు. పెద్దగా చదువుకోకపోయినా పద్యంపై మమకారంతో ఆయన చేసిన రసపోషణ నవరస భరితం. పాటలు, పద్యాలే కాకుండా నానీలు, కథలు, గజళ్లు నిర్వహించిన శీర్షికలు వారిని లబ్ధప్రతిష్టులను గావించాయి. ‘‘ఏ రచయిత అయినా సరే సమాజాన్ని పట్టించుకుంటూ మనిషిని మేల్కొలిపే దిశగా కలాన్ని నడిపించినప్పుడే ఆ గమనం సార్థకమవుతుంది’’ అంటారు రసరాజు గారు. ఆయన విద్వత్కవి మరియు విద్యుత్కవి అంటారు గరికపాటి వారు. వారు అలా అనడంతో ఔచిత్యం రసరాజు గారు విద్యుత్‌శాఖలో ఉద్యోగించడమే.
‘‘విజయభారతం’’ ఇప్పుడు అవసరమైన కావ్యం. మనమంతా మన పిల్లల్ని డబ్బులు తెచ్చిపెట్టే చదువులు చదివిస్తూ విదేశాల మీద మోజుతో పరాయిదేశాల్లో ఊడిగం చేయిస్తున్నాం. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడినునసరించి ఈ కాలంలో దేశభక్తి, త్యాగానురక్తి బోధించే ఇటువంటి కావ్యాల అవసరం నవభారతానికి ఎంతైనా ఉంది.
దేశసేవకంటే దేవతార్చన లేదు అని కరుణశ్రీ జంద్యాల వారన్నట్లు యువభారతంలో దేశభక్తి బీజాలు నాటగల ఇటువంటి కావ్యాల అవసరం మన దేశానికి మరీ వుంది. అంతేగాక పద్యకావ్యాలు అంతంతమాత్రంగా వస్తున్న లోటును కూడా ఇది భర్తీ చేసిందని చెప్పవచ్చు.
ఈ కావ్యంలో నాయకుడు రణసింగు పంజాబున పుట్టిన ఒక ఆదర్శవంతమైన సైనికుడు. అదే పంజాబు నుండి ఎప్పుడో వలసవచ్చి గోదావరి తీరాన స్థిరపడిన ఒక తెలుగు కుటుంబంలోని అమ్మాయి అమృత్‌కౌర్‌ను అతడు పెళ్లాడటం, తొలిరాత్రి గడవక ముందే దాయాది దేశమైన పాకిస్థాన్‌తో యుద్ధ్ఢంకా మోగడం, అతడు భార్యను విడిచి రణరంగాన దూకడం, అంతలోనే గాయాలపాలవ్వడం, ఆనాటి మన ప్రధాని లాల్‌బహదూర్‌శాస్ర్తీ పరామర్శ అక్కడో అద్భుతమైన మలుపు ఇలా సాగుతుంది కావ్యక్రమం.
పొట్టివాడైనా గట్టివాడని అనిపించుకున్న మన ప్రియతమ ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ గారిని వర్ణిస్తూ సాగిన పద్యాలు వారి మూర్తిని మన కళ్లముందు సాక్షాత్కరింపజేస్తే వారిచ్చిన నినాదం - జై జవాన్ - జైకిసాన్ మన చెవులలో రింగుమని మార్మోగుతుంది. అవన్నీ అందాలకందాలలో తేటతెలుగు గీతుల్లో మనల్ని అలరిస్తాయి.
రణసింగు పోరాట పటిమను వర్ణిస్తూ చెప్పిన పద్యాలను చదువుతుంటే బ్రతికితే భీష్మునిలా బ్రతకాలని - చనిపోతే అభిమన్యునిలా చనిపోవాలని అనిపిస్తుంది. ప్రతి యువకునికి కచ్చితంగా అలా రాయడం రసరాజు గారికే తెలిసిన రసాయన శాస్త్రం.
వీరనాయక అమృతకౌరు అలనాటి భారతంలో పాంచాలి (ద్రౌపది)నే కాదు పలనాటి భారతంలో మాంచాలనూ మనకళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తుంది.
కత్తిమీద సాములాంటి యుద్ధవర్ణనలోను రచయిత ‘అందెవేసిన చేయ’’ అనిపించుకున్నారు. వందకుపైగా పద్యాలలో యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించారు.
ముగింపులో నాయికా నాయకుల్ని కలపడంలో ప్రధాని చొరవ చూపించడం ఒక అపూర్వమైన, ఉదాత్తమైన ఊహ. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘‘రోజా’’ సినిమాలోని కొన్ని దృశ్యాలు గుర్తుకు రాకమానవు. ఇటీవలి కాలంలో కరుణశ్రీ - జాషువాల రచనల తరువాత వచ్చిన అగ్రశ్రేణి ఆధునిక పద్యకావ్యం ‘విజయభారతం’. దీనిని డాక్టర్ గురవారెడ్డి (మేనేజింగ్ పార్టనర్ సన్‌షైన్ హాస్పిటల్స్) వారికి అంకితమొనర్చారు. డాక్టర్ బేతవోలు, డాక్టర్ గరికపాటి, డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గార్లు అందించిన పీఠికలు కావ్యాన్ని అర్హమైన పీఠానె్నక్కించాయి.
‘నూలుపోగు’ అంటూ రచయిత వ్రాసిన మాటలను చదివి తీరవలసిందే ఇది ముమ్మూటికీ వీరభోజ్యమైన రసరాజ్యమే రండి ఏలుకొందాం.

ప్రతులకు
రంగినేని
సూర్యనారాయణమ్మ
ఎల్‌ఐజి 177
హౌసింగ్‌బోర్డుకాలనీ,
తణుకు, ప.గో.జిల్లా.

- అలంకారం విజయకుమార్ చరవాణి : 9603752929