రివ్యూ

కోరుకునేంత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** నిన్నుకోరి

తారాగణం: నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి, మురళీశర్మ, తనికెళ్ల భరణి, పృధ్వీ తదితరులు
సినిమాటోగ్రఫి: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి
స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్
నిర్మాత: డివివి దానయ్య
కథ, దర్శకత్వం: శివ నిర్వాణ

ప్రేమ విఫలమైతే తనువు చాలించటం రొటీన్. లవ్ మిస్సైన లైఫ్‌కి ఒక్క చాన్స్ ఇచ్చి చూద్దాం అన్నది మరో కానె్సప్ట్. నిజానికి ఇదీ పాతదే అయినా, కొత్తగా చూపించేందుకు చేసిన ప్రయత్నమే -నిన్నుకోరి. 90వ దశకంలోనే ఈ కంటెంట్‌తో సినిమాలు వచ్చేసినా, చాలా గ్యాప్ తరువాత మళ్లీ తెరపైకి తెచ్చిన కానె్సప్ట్ కనుక -కాస్త కొత్తగానే అనిపించింది. పెళ్లయిపోయిన ఒకప్పటి ప్రియురాలు మళ్లీ లైఫ్‌లోకి రావాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న భగ్న ప్రేమికుడి ఫీలింగ్‌తో రూపొందించిన సినిమా ఇది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, తొలి సినిమాగా ఎమోషనల్ డ్రామాను ఎత్తుకున్న దర్శకుడు శివ నిర్వాణ అందించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్. నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రధారులు. మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ అంటూ వచ్చిన ‘నిన్నుకోరి’లో ఎవరు ఎవరిని ఎలా కోరుకున్నారో చూద్దాం.
వైజాగ్ కుర్రాడు ఉమామహశ్వరరావు (నాని) స్టాటస్టిక్స్ ఎక్స్‌పర్ట్. ఓ ఫంక్షన్‌లో చేసిన అతని డ్యాన్స్ పల్లవి (నివేదా థామస్)ని అవసరార్థం అట్రాక్ట్ చేస్తుంది. డ్యాన్స్ నేర్పించమంటూ ఉమా వెంటపడటంతో -ఇద్దరిమధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఉమకు దగ్గరైన పల్లవి -తన ఇంటిపైనున్న పెంట్‌హౌస్‌కు తీసుకురావడంతో, ప్రేమ పాకానపడుతుంది. కెరీర్‌లో సెటిలవ్వాలనే ప్రయత్నాల్లో ఉమా ఉన్న సమయంలో, పల్లవికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. పల్లవి తండ్రి ఆలోచనలు అర్థం చేసుకున్న ఉమ, లైఫ్‌లో సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకుందామని ఆమెను ఒప్పించి ఢిల్లీ వెళ్లిపోతాడు. తన ప్రేమను తండ్రికి చెప్పలేని స్థితిలో, నాన్న చూసిన సంబంధానికి తలొగ్గుతుంది. అరుణ్ (ఆది పినిశెట్టి)తో పల్లవి పెళ్లైపోతుంది. విషయం తెలుసుకున్న ఉమ, భగ్న ప్రేమికుడిగా మిగిలిపోతాడు. తర్వాత ఏం జరిగింది? వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అన్నది మిగతా కథ.
ప్రేమలో విఫలమైన యువకుడిగా నాని నటన బాగుంది. ప్రియురాలి ప్రేమకోసం తపించే ప్రేమికుడిగా తన మార్క్ చూపించాడు. ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకున్నా, తిరిగి తనకు దక్కకపోతుందా? అనే చిన్న ఆశ, స్వార్థం కలిగిన ప్రేమికుడిగా అలరించాడు. మరోపక్క తన స్టయిల్ కామెడీతో సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అయ్యాడు నాని. కథ తన చుట్టూ తిరగడంతో, పాత్రకు తగిన నటన ప్రదర్శించింది నివేదా. ఒకపక్క భర్త, మరోపక్క ఒకప్పటి ప్రియుడు.. ఇద్దరి ప్రేమతో వేదన అనుభవించే బరువైన పాత్రలో మెప్పించి బెస్ట్ చాయిస్ అనిపించుకుంది. భర్తగా ఆది పినిశెట్టి, కూతురి జీవితం బాగుండాలని తపనపడే తండ్రిగా మురళీశర్మ పాత్రల పరిధిమేరకు చేశారు. పృధ్వీ అక్కడక్కడా నవ్వించాడు.
సాంకేతికంగా కార్తీక్ ఘట్టమనేని ఫొటోగ్రఫీ బాగుంది. ప్రకృతి అందాలు, అమెరికాలోని బ్యూటిఫుల్ లొకేషన్లను అంతే అందంగా తెరకెక్కించాడు. గోపీసుందర్ మ్యూజిక్ ఓకే. పాటల బాణీలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఫీల్ కలిగించాడు. ప్రవీణ్‌పూడి ఎడిటింగ్, కోన వెంకట్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు, డైరెక్టర్ శివ నిర్వాణ స్టోరీ రొటీన్ అనిపించింది.
ప్రారంభ సన్నివేశాలే కథ చెప్పేయడంతో, తరువాత ఏం జరిగింది? అన్న భాగంలో బిగింపు సడలిపోయింది. గుర్తుండిపోయే సన్నివేశం ఒక్కటి కూడా కనిపించదు. దీనికితోడు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాకు కావాల్సినంత నెమ్మదితనం కథలో కనిపించటంతో -నీరసం ఆవహించేసింది. చిత్రీకరణ బాగానే ఉన్నా, కంటిన్యుటీ మూడ్‌ని పాటలు డిస్ట్రర్బ్ చేశాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. రొమాంటిక్, ఎమోషనల్ ట్రాక్‌కే కథ పరిమితం కావడంతో, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ఆడియన్స్‌ని ‘నిన్నుకోరి’ మెప్పించదు. క్లైమాక్స్‌లో హెవీ ఎమోషనల్ సీన్ -మరింత నీరసం తెప్పించింది. కామన్ ఆడియన్స్‌కు కనెక్టవ్వడం కష్టమే.

-త్రివేది