డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్థంక్ యు, థాంక్ యు’’ అంది చాలా కృతజ్ఞతాపూర్వకంగా.
‘‘మా అమ్మ చాలా వర్రీ అయిపోతుంది. కారు ఆగిపోగానే చెప్పాను. అప్పుడే చాలా భయపడిపోయింది. అప్పటినుంచి నన్ను ఎలా కాంటాక్ట్ చెయ్యాలా అన్న టెన్షన్‌లో ఉన్నారు’’ అంది.
కిటికీ దగ్గరనుంచుని, రెక్కలు రెక్కలుగా ముద్దలుగా రాలిపడుతున్న మంచు నేలమీద పేరుకుపోతోంది. అరచేతులు ఒకటితో ఒకటి రుద్దుకుంటూ చూస్తోంది తేజస్విని. ఆమె వెనకగా నేనూ నుంచున్నాను. చూస్తూండగానే కార్లు ఆ పార్కింగ్ లాట్‌లో ఆగడం మొదలుపెట్టాయి.
ఒకరొకరుగా లాబీలోకి వచ్చేస్తున్నారు.
‘‘పదండి కూచుందాం. లేకపోతే అందుకు కూడా చోటు దొరకదు..’’ అంటూ కుర్చీ వైపుకు నడిచాను. ఆ అమ్మాయి కూడా గబుక్కున వచ్చి కూచుంది.
చూస్తుండగానే లాబీ నిండిపోయింది. పక్కనే ఉన్న డైనింగ్ హాల్ కూడా నిండిపోయింది. ఇంక పార్కింగ్ లాట్లో చోటు కనిపించకపోవడంతో ముందుకు వెడుతున్నారు ప్రయాణికులు.
‘‘మంచి పని చేశాం. ఆగడం, మీరు తొందర పెట్టకపోతే నేను ఇంకా ముందుకు వెళ్ళేవాడినే’’ అన్నాను మెచ్చుకోలుగా.
ఆ అమ్మాయి నవ్వి ఊరుకుంది. టివిలో వాతావరణపు విషయాలు చెప్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ షెల్టర్స్ ఓపెన్ చేశారో అనౌన్స్ చేస్తున్నారు. దగ్గరలో ఉన్న చర్చెస్, స్కూల్స్ అన్ని బిల్డింగ్స్ ప్రయాణికుల సౌకర్యం కోసం తెరచి ఉంచారు. ప్రయాణికులు ఎలా వెళ్ళాలో సూచనలు ఇస్తున్నారు.
ఆ అనౌన్స్‌మెంట్స్ చూస్తూ నేనూ, ఆ అమ్మాయి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళం చూచుకున్నాం.
పాపం ఆ హోటల్ అతను వేడి టీ చేయించి చిన్న చిన్న కప్పుల్లో అందరికీ తెచ్చి ఇచ్చాడు. ఆ క్షణంలో అందరికీ ఆ టీ ఎలా ఉందంటే- అంతకంటే మరేమీ వద్దనిపించేలా ఉంది.
ఇంతలోనే ఒక బాగా వయస్సుమీద పడిన ఇద్దరు లోపలకు వచ్చారు. ఆ పెద్దావిడ కారు దిగుతూనే జారి స్నోలో పడిపోయింది. దాంతో ఆవిడ కోట్, తల మొత్తం స్నోతో నిండిపోయింది. ఒక ఎస్కిమోలా కనిపిస్తోంది. ఆ పెద్దాయన జాగ్రత్తగా ఆవిడని లోపలికి తీసుకువస్తున్నాడు. లోపల అడుగుపెట్టిన వాళ్ళిద్దరినీ చూడగానే చటుక్కున లేచి నేను కూర్చున్న కుర్చీలో ఆవిడను కూర్చోమన్నాను. నా వెనకే తేజ లేచి ముసలాయన్ని కూర్చోమంది. ఇంతలో హోటల్ అతను రెండు బ్లాంకెట్స్ తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అతని భార్య రెండు గ్లాసుల టీ తెచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చింది.
రూంలో అందరూ వేడి వేడి టీ తాగుతూ వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. మెల్లిగా నేలమీద కూర్చోడానికి సిద్ధపడుతున్నారు. వెనకనుంచి భయ్యా, అన్నమాట మెల్లగా వినిపించింది. అటూ ఇటూ చూశాను. హోటల్ అతను కళ్ళతో తనతో రమ్మన్నట్లు సౌంజ్ఞ చేశాడు.
మారు మాట్లాడకుండా తేజస్వినిని కూడా నాతో రమ్మనమని అతన్ని అనుసరించాను.
లోపలికి తలుపు తోసుకుని మా ఇద్దరినీ తీసుకువెళ్ళాడు. అది చిన్న అపార్ట్‌మెంట్. మోటల్ లాబీకి కలిపే ఉంది. మోటల్‌ని మేనేజ్ చేసేవాళ్ళు ఉండేందుకు ఏర్పరిచిన చిన్న నివాసం.
‘‘సోఫా వంక చూపించి, మీరిక్కడ కూర్చోండి’’ అన్నాడు. కూర్చుంటూ చుట్టూ చూశాను. అది చిన్న సిట్టింగ్ రూం. మా అందరికీ టీ ఇస్తున్న ఆమె అతని భార్యలా ఉంది. వాళ్ళిద్దరే మేనేజ్ చేస్తున్నట్లుంది.
రూం మాత్రం హాయిగా వెచ్చగా ఉంది. చూడబోతే అక్కడ ఆగే ప్రయాణీకులకు పొద్దునే్న బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. అందుకే కొంచెం పాలు, టీ, కాఫీ, బ్రెడ్ అన్నీ స్టోర్ చేసి ఉన్నాయి.
తేజ వేసుకున్న కోటు విప్పి, మెడ దాకా కప్పుకుని కుర్చీలో కాళ్ళు ముడుచుకు కూచుంది. చూస్తుండగానే మెడ పక్కకు వాల్చి నిద్రలోకి జారిపోయింది. అలసినట్లున్న మొహం నుదుటిమీద అతుక్కుపోయి ఉంది జుట్టు. ఆమె వంక చూచి చేతి గడియారం వంక చూచాను. అర్థరాత్రి దాటింది. నేను కూడా కుర్చీలో వాలబోయాను. బయట సందడి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.
తెల్లవారేటప్పటికి స్నో పడటం ఆగిపోయింది. రోడ్లు క్లీన్ చేయడం మెల్లిగా మొదలుపెట్టారు.
ఆ హోటల్ అతను, వాళ్ళ దగ్గర సరుకు ఉన్నంతవరకూ అందరకూ బ్రేక్‌ఫాస్ట్ అందజేశాడు. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు థాంక్‌ఫుల్‌గానే ఉన్నారు.
నేను, తేజ బయలుదేరడానికి సిద్ధపడ్డాం. నేను హోటల్ మేనేజర్ జయంత్ దగ్గరకు వెళ్లి రూం రెంట్ ఇవ్వబోయాను.
‘‘వద్దు భయ్యా! నీకు రూం ఇవ్వలేదు’’ అన్నాడు.
‘‘నిజమే రూం ఇవ్వలేదు కానీ, షెల్టర్ ఇచ్చారు. దానికి విలువ కట్టడం నాకు తెలియదు. అందుకే రూం రెంట్ ఇవ్వబోయాను’’ అన్నాను.. అతను ఒప్పుకోలేదు.
‘‘కనీసం బ్రేక్‌ఫాస్ట్‌కి అయినా తీసుకో’’ అని కొంత కాష్ అతని చేతిలో పెట్టేశాను. అతను గుజరాత్ నుంచి వచ్చాడట. అతనికి దూరపు బంధువులు స్పాన్సర్ చేసి తీసుకువచ్చారుట. తీసుకువచ్చిన వాళ్ళ హోటల్ ఇది. కొంతకాలానికి ఇతను కూడా స్వంతంగా ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నాడు. ఇది గుజరాతిలలో సర్వ సామాన్యం. దూరపు బంధువులంటూ బంధుత్వాలు ఉన్నా లేకపోయినా ఎంతోమందిని అమెరికా తీసుకువచ్చారు. వాళ్ళతో జీవనోపాధి కలిగేవరకూ భరిస్తారు. వచ్చినవాళ్ళు ఒకసారి స్థిరపడగానే వాళ్ళ క్రింద అయిన ఖర్చులన్నీ వెనక్కి తీసుకుంటారు. ఈ విధంగా ఎంతమందికి ఈ దేశంలో ఉపాధి చిక్కిందో ఎంతమంది హోటల్స్ నడుపుతున్నారో, కొన్ని ప్రదేశాలలో చిన్న సైజు హోటల్స్ అన్నీ మనవాళ్ళవే!’’
అంటూ వౌళి కారు ఆ హోటల్ ముందుకు తీసుకువెళ్ళాడు. దిగి ఇద్దరం లోపలకు వెళ్ళం. లోపల జయంత్ లెక్కలు చూసుకుంటున్నాడు. అతను ఆ హోటల్ తనే కొనేసుకున్నాడుట ఈమధ్య.
‘‘మా అమ్మ’’ అని నన్ను పరిచయం చేయగానే చటుక్కున వంగి దండం పెట్టాడు.
ఎంత దూరాలు వెళ్లినా, ఎన్ని ఏళ్ళు గడిచినా కొన్ని సాంప్రదాయాలను మాత్రం గుజరాతీవాళ్ళు మరువరు అనిపించింది.
వాళ్ళ సంభాషణ వింటూంటే వౌళి, జయంత్ ఆ రాత్రి తరువాత తరచుగా కలుస్తూనే ఉన్నట్లు ఉన్నారు. ‘‘పెళ్లికోసం వచ్చారా’’’
అంటూ అతని భార్య
టీ తీసుకువచ్చింది.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి