ఆటాపోటీ

ఇంతకీ పేరేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* స్కాట్‌లాండ్ గోల్ఫర్ రొరీ మెకిల్‌రోయ్ పేరును ఒక్కొక్కరు ఒక్కో రకంగా పలకడంతో గందరగోళ పరిస్థితి నెలకొంటున్నది. ఇటీవల బ్రిటిష్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను సాధించి, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లిన రొరీని చాలా మందికి మాజీ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ కరొలిన్ వొజ్నియాకితో ప్రేమాయణం సాగించి, పెళ్లి తేదీని కూడా ఖరారు చేసుకున్న తర్వాత అలాంటి ఉద్దేశమే లేదంటూ తప్పించుకున్న వైనం గుర్తుకొస్తుంది. షాంఘైలో బిఎండబ్ల్యు మాస్టర్స్ టోర్నీ జరిగినప్పుడు కామెంటేటర్ల నుంచి అభిమానుల వరకూ అంతా అతని పేరును రొరీ మెక్‌రోయ్‌గా ఉచ్ఛరించారు. హాంకాంగ్‌లో యుబిఎస్ ఓపెన్ టోర్నీ జరుగుతున్నప్పుడు అతని పేరు రొరీ మెకొరయ్‌గా మారిపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మీడియా రొరీ మెక్‌లోరీగా మార్చేసింది. ఇన్ని రకాలుగా పిలవడంతో అతని అసలు పేరు ఏమిటన్న ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నది. ఇంతకీ రొరీ మెకిల్‌రోయ్ అన్నది కూడా సరైన ఉచ్ఛారణ అవునా కాదా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న.
రేసుల వీరుడు
* మోటర్ సైకిలా.. కారా అన్న తేడా జాన్ సర్టీస్‌కు లేదు. ఏ విభాగంలోనైనాసరే రేస్ అంటే చాలు నేనున్నానంటూ హాజరవుతాడు. ఎక్కువ కాలం మోటర్ సైకిల్ రేస్‌ల్లో కొనసాగినా, ఫార్ములావన్ రేస్‌ల్లోనూ పోటీపడడం అతని హాబీ. 1964లో ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సాధించిన సర్టీస్ 11సార్లు మోటర్ సైకిల్ రేస్‌లో విజేతగా నిలిచాడు. అటు ఫార్ములా వన్‌లో, ఇటు మోటర్ సైకిల్ రేస్‌లో సమాన ప్రతిభ కనబరచి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఇప్పుడు మోటర్ సైకిల్ ప్రపంచ విజేత వాలెంటినో రోసీ కూడా ఫార్ములా వన్ వైపు దృష్టి పెడుతున్నాడు. ఈ ప్రయత్నంలో అతను ఎంతవరకు సఫలమవుతాడో చూడాలి.
ట్రిక్ షాట్?
* అమెరికా అండర్-19 జట్టు ఆటగాడు జారెడ్ నికొల్‌ను ఇప్పుడు అంతా సూపర్ స్టార్‌గా పిలుస్తున్నారు. ఫిఫా నిర్వహించిన ‘సోనీ షూట్’ పోటీలో అతను చేసిన గోల్‌కు బహుమతి లభించడమే ఇందుకు కారణం. తల్లకిందులుగా పల్టీ కొడుతూ అతను కొట్టిన బంతి మెరుపు వేగంతో గోల్‌పోస్టులోకి దూసుకెళ్లింది. రొనాల్డో వంటి మేటి ఆటగాళ్లను కూడా ఈ షాట్ ఆశ్చర్యానికి గురి చేసింది.
మార్గదర్శకురాలు..
* యుఎఫ్‌సి బాక్సింగ్ స్టార్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత రొన్డా రోసీ జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. చిన్నతనంలోనే ఆమె తండ్రి చనిపోయాడు. ఆ బాధను భరించలేక ఆమె మాదక ద్రవ్యాలకు అలవాటు పడింది. తండ్రి కోరిక ప్రకారం యుఎఫ్‌సి బాక్సర్‌గా ఎదిగేందుకు ఎంతో శ్రమించింది. ముందుగా, డ్రగ్స్ అలవాటు నుంచి విముక్తి పొందింది. అనంతరం నిర్విరామంగా ప్రాక్టీస్ చేసింది. ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ, ఆత్మవిశ్వాసంతో ఒక్కో అడుగు ముందుకేసింది. ఒలింపిక్స్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. యుఎఫ్‌సి బాక్సింగ్‌లో స్టార్ హోదాను సంపాదించింది. తనను విమర్శించిన వారికి తన అసాధారణ కెరీర్‌తో సమాధానం చెప్పింది.

- సత్య