నెల్లూరు

విత్తనం (మినీ కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగానాధపల్లెలో రఘుపతి అనే అతడు అడవిలో

కట్టెలు కొట్టి సంతలో అమ్మి జీవించేవాడు. అతని

భార్య రాజమ్మ, ఇద్దరు చిన్నపిల్లలు రఘుపతి

సంపాదనతో కాలం గడుపుతూ వస్తున్నారు.

రఘుపతికి కట్టెలు కొట్టి అమ్మి సంపాదించడం

తప్ప వేరే పని చేతకాదు.
ఒకరోజు ఎప్పటిలాగే అడవికి వెళ్లి లోతైన

వాగుపక్కన చెట్లను కొడుతుండగా మంచి

ఎండాకాలం కావడంచేత అలసిపోయిన రఘుపతి

చేతిలోని గొడ్డలి చేజారి వాగులో పడింది.

రఘుపతికి ఏమి చేయ్యాలో దిగులు, బాధతో

అక్కడే కూలబడిపోయాడు. ఇంతలో వాగులో

నుండి గంగమ్మ తల్లి ప్రత్యక్షమైంది. రఘుపతి

ఒక్క వుదుటున లేచి నమస్కరించి ‘అమ్మ... తల్లి

నా గొడ్డలి నాకు తెచ్చి ఇయ్యవమ్మ... లేకుంటే

నేను నా భార్య, బిడ్డలు బతకడం కష్టం..

కరుణించు.. తల్లీ’ అని దీనంగా వేడుకొన్నాడు.
అందుకు గంగమ్మ తల్లి ‘నీ బాధ అర్థమైంది నీవు

దిగులు పడకు...నీవు ఇంతకాలం చెట్లు కొట్టి

జీవించావు. చెట్లు కొట్టడం వల్ల ప్రకృతి

సమతౌల్యాన్ని కోల్పోతోంది. నీ ఒక్కడివే కాదు

చాలామంది చెట్లు కొట్టడం, అడవులు

ఆక్రమించడం వలన ప్రకృతి వికృతిగా మారి

వర్షాలు లేక నీళ్లు కరువై పశుపక్ష్యాదులు,

మనుషులు అల్లాడే రోజులు వస్తున్నాయి. కనుక

నీవు గూడ చెట్లు కొట్టడం మానుకో.. నీకు

మంచిగా శ్రమ లేకుండా జీవించే మార్గం

చూపిస్తా’ అని అభయహస్తం చాపి

ఆశీర్వదించగానే రఘుపతి ముందు మూటలు

ప్రత్యక్షం అయ్యాయి.
‘ఈ మూటల్లో ఏముంది... నేను ఎలా బతకాలో

చెప్పు తల్లీ’ అని అడిగాడు రఘుపతి
‘ఈ మూటల్లో విత్తనాలు వున్నాయి. వీటిని

తీసుకెళ్లి నీ పెరటిలో నాటు అవి నీకు

కూరగాయలు, పండ్లు ఇస్తాయి. వాటిని సంతలో

అమ్మి ధనం సంపాదించుకొని నీ కుటుంబాన్ని

పోషించుకో... మొక్కలు పెంచడం వలన నీకు,

ప్రకృతికి లాభం చేకూరుతుంది.’ అని చెప్పి

మాయమైపోయింది.
రఘుపతి గంగమ్మ తల్లి మాటలు విని మూటలు

తీసుకొని ఇంటికి వెళ్లి భార్య రాజమ్మతో

జరిగిందంతా చెప్పగా రాజమ్మ ‘ఆ గంగమ్మ తల్లి

మనల్ని కరుణించింది. మనకిక ఎలాంటి

భయంలేదు.’ అని చెప్పింది. రఘుపతి,

రాజమ్మలు పెరట్లో విత్తనాలు నాటి రకరకాల

కూరగాయలు, పండ్లు, పూలు పండించి సంతలో

అమ్మి హాయిగా జీవిస్తూ అందరికి మొక్కలు

పెంచమని చెప్తూ...పిల్లల్ని బాగా చదివించ

సాగారు. వారి పిల్లలు కూడా బడిలో మొక్కలు

నాటి వాటివల్ల ఉపయోగం తోటి పిల్లలకి చెప్పి

వాళ్ల ఇంట్లో కూడా మొక్కలు నాటేటట్లు చేశారు.

‘ప్రకృతిని కాపాడండి’ అని బడిపిల్లలు వీధివీధికి

తిరిగి ప్రచారం చేశారు.

- కంచనపల్లి ద్వారకనాథ్, తిరుపతి చరవాణి : 9985295605