నిజామాబాద్

భూమి పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూలై 20: వర్షాలు సమృద్ధిగా కురిసిన భూమి పచ్చగా కళకళలాడాలంటే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ముందుగా ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, కలెక్టర్ సత్యనారాయణలతో కలిసి పట్టణ సమీపంలోని నర్సన్నపల్లి గోదాం ఆవరణలో హరితహారం మూడవ విడతలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను రక్షించుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులతో అక్కడే ప్రమాణం చేయించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో స్వామిగౌడ్ మాట్లాడుతూ, మొక్కలు నాటడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని, అప్పుడే రాష్ట్రం పచ్చగా ఉంటుందన్నారు. మనుషులు తయారు చేసే రసాయనాల కంటే, ప్రకృతి సిద్ధంగా లభించే ఆక్సిజన్ చెట్ల వల్ల ఉత్పత్తి అవుతుందని అన్నారు. భగవంతుడు సృష్టి అయిన మొక్కలు నాటితే అవి చెట్లుగా ఎదిగి సమృద్ధిగా ఆక్సిజన్‌ను అందించి మనుషుల ఆరోగ్యాలను కాపాడుతాయని అన్నారు. తెలంగాణ అంతా పచ్చదనంతో పులకరించేలా ఈ ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. పుట్టిన బిడ్డలను తల్లి ఎలా పెంచుతుందో అలాగే నాటిన ప్రతి మొక్కను ప్రతి ఒక్కరు సంరక్షించుకునే బాధ్యత చేపట్టాలని అన్నారు. కామారెడ్డిలో జిల్లాలో మూడవ విడత హరితహారంలో భాగంగా 1కోటి.35లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం ఉండగా, నేటి వరకు జిల్లాలో 58శాతం మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. దీనికోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కర్ని ఆయన అభినందించారు. గత రెండేళ్లలో హరితహారంలో భాగంగా నాటిన పూలమొక్కలు పూలతో ఎక్కడికి వెళ్లిన ఈ ఏడాది స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. పండ్ల మొక్కలు ఎదిగి ఆరోగ్యాన్ని రక్షించే పండ్లను ఇస్తాయని అన్నారు. విద్యార్థులు నాటిన ప్రతి మొక్కను బతికించుకుంటే విద్యార్థులకు సైన్స్‌లో 5గ్రేస్ మార్కులు ప్రభుత్వం కలిపేందుకు నిర్ణయం తీసుకుంది, కాబట్టి ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను నాటిని ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. అక్కడి నుండి కామారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహానికి వచ్చిన శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, ఐసిడిఎంఎస్ చైర్మన్ ముజిబొద్దిన్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణలు శాసనమండలి చైర్మన్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు. అనంతరం పలువురు టిఆర్‌ఎస్ నాయకులు శాలువలు కప్పి సన్మానించారు. అక్కడి నుండి ఆయన నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నాటిన మొక్కలు పచ్చదానాన్ని ఇస్తూ ఎంతో అందంగా కన్పిస్తున్న కలెక్టర్ కార్యాలయం ఆవరణను ఆయన పరిశీలించారు. హరితహారంలో భాగంగా చైర్మెన్, ప్రభుత్వ విప్‌లు కలిసి ఆవరణలో మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. అనంతరం హరితహారం కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కలెక్టర్ కార్యాలయంలో ముఖద్వారం వద్ద ఏర్పాటు చేయగా, వీటిని కలెక్టర్ చైర్మన్‌కు చూపించారు. ఈకార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సత్తయ్య, తెలంగాణ బెవరేజ్ చైర్మన్ దేవిదాస్, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మెన్ ముజిబొద్దిన్, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో పాటు టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.