రంగారెడ్డి

చినుకు.. చింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూలై 20: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లోని రోడ్లు పాడయ్యాయి. రోడ్లు వేసే సమయంలో నాణ్యత పాటించకపోవడంతో ఎడతెరపిలేని చిన్నపాటి వర్షాలకే రోడ్లపై కంకరతేలి, గుంతలమయం అవుతున్నాయి. దీంతో భారీగా నీరు నిలిచి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా పాడవుతున్న రోడ్లపై అర్‌అండ్‌బి అధికారులు ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం విచిత్రం. గుంతలమయమైన రోడ్ల కారణంగా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద రోడ్డు పూర్తిగా గుంతలమయం అవడంతో భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. వర్షాలకు రోడ్లు పాడవకుండా, పాడైన రోడ్లతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.