పశ్చిమగోదావరి

పోలీసులపై దాడి ఘటనలో 30మందిపై కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, జూలై 20: తుందుర్రు గ్రామంలో పోలీసులపై కారం, కిరోసిన్‌తో దాడికి పాల్పడిన 30 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు. గురువారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న ఆక్వా పార్కుకు సంబంధించి యంత్రాలను తీసుకొచ్చే క్రమంలో పరిశ్రమ యాజమాన్యం పోలీసుల సహాయం కోరిందన్నారు. దీనిలో భాగంగా విధుల్లో ఉన్న పోలీసులపై ఆక్వాపార్కు వ్యతిరేక ఉద్యమకారులు కారం, కిరోసిన్‌తో దాడి చేయడం సరికాదన్నారు. ఉద్యమకారుల దాడిలో పోలీసులతో పాటు మహిళా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. గాయపడ్డ పోలీసులు నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. పోలీసులపై దాడికి పాల్పడిన ముచ్చర్ల త్రిమూర్తులు, పొగాకు పూర్ణ, డి కళ్యాణి, సముద్రాల సత్యవేణి, మామిడిశెట్టి రామాంజనేయులుతోపాటు 30 మందిపై ఐదు సెక్షన్లతో కేసులు నమోదు చేశామన్నారు. ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన తెలపవచ్చని, అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. అలాగే పోలీసులపై భౌతిక దాడులకు పాల్పడేవారు ఎంతటివారైనా చర్యలు తప్పవని ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను రవిప్రకాష్ పరామర్శించారు.