నిజామాబాద్

విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, జూలై 21: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. బంద్‌లో భాగంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఒకరోజు ముందుగానే ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు సమాచారం ఇవ్వడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించారు. శుక్రవారం ఉదయం ర్యాలీగా బయలుదేరిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అక్కడక్కడా తెరిచి ఉంచిన పాఠశాలలను మూసి వేయించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎఐఎఫ్‌డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా, కేజీ టూ పీజీ హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేస్తామన్న విద్యాశాఖ మంత్రి హామీ నీటి మూటగానే మిగిలిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో కనీస వౌళిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థి సంఘాలు ఎన్ని ఆందోళనలు చేపట్టినా, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ప్రభుత్వ విద్య కుంటుపడుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ బంద్‌లో పిడిఎస్‌యు నాయకులు సరిత, అనే్వష్, పెద్దసూరి, రమేష్, సిద్ధలక్ష్మి, నిఖిల్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

చెట్లతో ముడిపడిన మనిషి మనుగడ
లింగంపేట్, జూలై 21: మనిషిమనుగడ చెట్లతో ముడిపడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పర్మళ్ల గ్రామంలో హరితహారం మూడవ విడతలో భాగంగా మంత్రి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణతో కలిసి మొక్కలను నాటి నీరు పోయడమే కాకుండా ట్రీగార్డ్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, మనిషి పుట్టిన నుండి చనిపోయే వరకు వృక్ష సంపదపై ఆదారపడి ఉంటారని అన్నారు. గతంలో అడవులు, వృక్షాలు సమృద్దిగా ఉండి కాలానుగుణంగా వర్షాలు కురిసేవని, తెలిసి తెలియక మనం చెట్లను నరికి అనావృష్టి పరిస్థితులు తెచ్చుకుంటున్నామని అన్నారు. భూగర్భజలాలు తగ్గి రైతులకు అప్పులు పెరిగిపోతున్నాయన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అందరం కలిసి భారీగా మొక్కలను నాటి రాష్ట్రాన్ని పచ్చదనంగా మార్చాలని అన్నారు. హరితాహారంపై 1500నుండి రూపాయల 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. నర్సరీలకు నాటే గుంత తవ్వడానికి మొక్క చుట్టు సంరక్షణగా ఉంటే కంప నాటడం, నీళ్లు పోసేందుకు నెలకు చొప్పున ప్రభుత్వం నిధును ఖర్చు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇవ్వడం ప్రారంభించిందన్నారు. సమృద్ధిగా భూగర్భజలాలు ఉంటేనే కరెంట్ ఉపయోగించుకోవడం జరుగుతోందన్నారు. అడవులు విస్తరించిన ప్రాంతాల్లో వర్షాలు కుసి పంటలు బాగా పండుతున్నాయని, కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి అడవుల సంరక్షణకు నడుం బిగించాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఏనుగురవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే అడవులు ఉండాలని, పచ్చదనం ఉంటేనే అందరం మనిషి మనుగడ బాగుంటుందని అన్నారు. పర్యావరణానికి తూట్లుపడకుండా ఉండాలంటే విరివిగా మొక్కలు నాటి అడవులు విస్తరంగా పెరిగేలా చూడాలని అన్నారు. అడవుల్లో పండ్ల మొక్కలు నాటితే కోతులు, ఇతర జంతువులకు ఆహారం లభించి అవి గ్రామాలు పట్టణాలపై పడకుండా ఉంటాయని అన్నారు. అటవిశాఖ అధికారులు సైతం అడవుల్లో విస్తరంగా పండ్ల మొక్కలు నాటాలని అన్నారు. అనంతరము మంత్రి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో ప్రమాణం చేయించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సంపత్‌కుమార్‌గౌడ్, డిఎస్పీ నర్సింహా, ఎల్లారెడ్డి ఎఎంసి చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, ఎంపిపి అసియామోహిద్, జడ్పీటిసి శ్రీలత, తెరాస మండల అధ్యక్షుడు వంజరి ఎల్లమయ్య ఉన్నారు.

నిజాయితీగా ఉన్నప్పుడే గుర్తింపు
కంఠేశ్వర్, జూలై 21: నిజాయితీగా ఉన్నప్పుడే ప్రజలకు గానీ, ఉద్యోగులకు గానీ సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుందని, దాంతో ఆత్మసంతృప్తి పొందవచ్చని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట టిఎన్‌జిఓస్ ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించగా, ఆమె ముఖ్య అతిథిగా హాజరై బోనమెత్తారు. ఈ సందర్భంగా కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ, తాను నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడైనా గుడికి వెళ్తే, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో ముందుండాలని కోరుకునేదానినని అన్నారు. 2015లో కరవు వచ్చిన సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురియాలని భగవంతున్ని కోరుకోవడం జరిగిందని, వరుణుడు కరుణించి గత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురియడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. మనిషి జీవితం కోర్కెలపై ఆధారపడి ఉంటుందని, అందువల్ల తమ నిజ జీవితంలో ఉన్నతమైన పనులు చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి మనిషి ఒక్కో గుడికి వెళ్తే, అమ్మవారు వారు వెళ్లిన ఆలయాన్ని బట్టి దర్శనమిస్తారని, ఆయా రూపాల్లో ఉన్న భగవంతున్ని నమ్మకంతో కొలుస్తుండటాన్ని మనం చూస్తుంటామన్నారు. ఇందుకు కారణం మనిషికి భగవంతుడిపై ఉన్న విశ్వాసమేనని అన్నారు. ప్రపంచంలో ప్రతిరోజు లక్షల మంది చనిపోతూ, జన్మిస్తుంటారని, అలాగే కొంతమంది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే పనులు చేస్తే, మరికొంత మంది సమాజానికి హాని కలిగించే పనులు చేస్తారన్నారు. అయితే సమాజ శ్రేయస్సు కోరి పనులు చేసే వారిని ప్రజల గుండెల్లో చిరకాలం గుర్తుండిపోతారని, సమాజంలో పేరు సంపాధించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. తెలంగాణ రాట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం చేపట్టిన తర్వాత ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడల్లా, వివిధ పనుల నిమిత్తం అధికారుల వద్దకు వచ్చే బాధితుల పట్ల ప్రేమ పూర్వకంగా మెసులుకోవాలని సూచించడం జరిగిందని, సిఎం సూచనలనే తాను నిజామాబాద్ జిల్లాలో పాటిస్తున్నానని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు రాష్టస్థ్రాయిలో మంచి పేరు తీసుకవచ్చేందుకు తనవంతు కృషి చేస్తున్నానని, ఇందుకోసం సహకరిస్తున్న ఉద్యోగులందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం టిఎన్జీఓలో ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్‌లోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా తెలంగాణ సంస్కృతి అయిన బోనాల పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే బిగాల పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ఉద్యోగులు, ప్రజలందరు సమష్టిగా భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. అంతకు ముందు కలెక్టరేట్ ఆవరణ నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న దుర్గామాతగుడి వరకు పోతరాజుల విన్యాసాల మధ్య కలెక్టర్ యోగితారాణా, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాలు ఉద్యోగులతో కలిసి బోనాలు ఎత్తుకుని వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెసి రవీందర్‌రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ సిక్తాపట్నాయక్, టిఎన్‌జిఓస్ జిల్లా అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, ఉద్యోగులు, కార్పొరేటర్లు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
మాక్లూర్, జూలై 21: కుటుంబంలో ఏర్పడిన చిన్నపాటి గొడవలతో మనస్థాపం చెందిన ఓ హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మాక్లూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రామునాయుడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూర్ మండలం మానిక్‌బండార్ గ్రామానికి చెందిన బండారి సత్యనారాయణ(56)అనే వ్యక్తి గాంధారి పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మద్యానికి బానిసైన సత్యనారాయణ నాలుగు మాసాల క్రితం ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడటంతో కాలు విరిగిందన్నారు. అప్పటి నుండి సెలవులో ఉన్న సత్యనారాయణ, మాక్లూర్ మండలం మానిక్‌బండార్‌లోని తన స్వగృహంలో భార్య, పిల్లలతో కలిసి జీవనం వెళ్లదీస్తున్నాడని అన్నారు. సత్యనారాయణకు ఇద్దరు కుమారు, ఒక కుమార్తె ఉండగా, వారి వివాహాలు అయ్యాయని అన్నారు. అయితే గురువారం రాత్రి మృతుడు సత్యనారాయణ, తన భార్య విజయను తీవ్రంగా కొట్టడంతో గాయపడిందని, నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. తాగిన మైకంలో భార్యను చితకబాదిన సత్యనారాయణ, శుక్రవారం మధ్యాహ్న వరకు కూడా భార్య యొక్క యోగక్షేమాల గురించి ఫోన్‌లో తెలుసుకున్నాడని, మనస్థాపం చెంది మధ్యాహ్నం సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం జరిగిందన్నారు. మృతుడు కుమారుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమత్తం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.

ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి
మాక్లూర్, జూలై 21: డొనేషన్ల పేరుతో కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చల విడిగా డబ్బులు గుంజుతూ పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం మండల పిడిఎస్‌యు కమిటీ ఆధ్వర్యంలో మాక్లూర్ జూనియర్ కళాశాలను బంద్ చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా, విద్యారంగ సమస్యలపై దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందించడంతో పాటు విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన కెసిఆర్, ప్రస్తుతం ఆ హామీలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా చిన్నచిన్న కారణాలను చూపుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4637ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసేందుకు నిర్ణయం తీసుకున్న సర్కార్, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోపించాలని ఆయన సూచించారు. అవసరమైతే గ్రామాల్లో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలను మూసి వేయించి, ఆ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సిఎం కెసిఆర్ స్పందించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పిడిఎస్‌యు నాయకులు ఎం.ప్రణయ్, తారాచంద్, సుశీల్, నవీన్, రమేష్, ప్రశాంత్, సుజాత, అనిత, నవీణా, కవితతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

పగడ్బందీగా టెట్ నిర్వహణ
కామారెడ్డి, జూలై 21: ఈనెల 23వ తేదీ ఆదివారం జరగనున్న టీచర్ ఎలిజిబిలిటి టెస్టు(టెట్)ను పగడ్బందిగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ విద్యశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని జనహిత భవనంలో జరిగిన విద్యశాఖ అధికారులతో టెట్ పరీక్షల నిర్వహణకు సంబందించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షల్లో నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఒక రోజు ముందు సందర్శించి పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు గల అవాంతరాలను, ఆలస్యాన్ని నివారించుకునేలా చూసుకోవాలని అన్నారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌లను ఇంటర్‌నెంట్ కేంద్రాల నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని, డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టిక్కెట్‌పై ఫొటో లేకుంటే పాస్‌పోర్టు సైజ్ ఫొటో అతికించి గజిటెట్ సంతకం తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు వచ్చేలా చూడాలని, ఒక్క నిముషం ఆలస్యంగా అయిన ఎవ్వర్ని కూడా పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతి ఇవ్వకూడదన్నారు. పరీక్ష కేంద్రాలకు హాల్ టిక్కెట్, రైటింగ్ ప్యాడ్, పెన్స్, పెన్సిల్స్ వంటి రాత సామాగ్రి తప్ప ఇతర ఏ వస్తువులు తీసుకుని రావడానికి వీలు లేదన్నారు. సెల్‌ఫోన్లు, క్యాలిక్‌లేట్‌ర్స్, ఇతర ఎలక్ట్రానిక్ లాంటి వస్తువులు, బుక్స్, ప్రింటెడ్ మెటేరియల్స్, ఇతర నకల్ పత్రాలు కేంద్రంలోనికి అనుమతించకూడాదని అన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థికి జారీ చేయబడిన ఒఎంఆర్ షీట్‌లో హాల్‌టిక్కెట్‌లో ఏలాంటి పొరపాట్లు ఉన్న సంబంధిత ఆధారలతో ఇన్విజిలేటర్ లేదా చీఫ్ సూపరెంటెండెంట్ దృష్టికి తీసుకుని పోవాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహించి ఉద్యోగులు విధిగా ఐడి కార్డులు ధరించి ఉండాలని, పరీక్ష విధులకు కేటాయించబడిన వారు తప్ప ఇతరులు ఎవ్వరికి పరీక్ష హాల్‌లోకి అనుమతించరాదని అన్నారు. పరీక్ష కేంద్రాలకు చుట్టుపక్కల వంద మీటర్ల వరకు 144సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు ఉదయం 8.30 నిముషాల నుండి సాయంత్రం 5గంటల వరకు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న వారు ఎవ్వరు కూడా సెల్‌ఫోన్‌తో పరీక్ష కేంద్రాలకు రావద్దని, ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించినట్లైతే వారిపై మాల్‌ప్రాక్టిస్ నిరోదక చట్టం 25/1997ప్రకారం చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద అత్యవసరస సమాచారం కోరకు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష విధులకు కేటాయించిన పోలీసు సిబ్బంది ఫోన్ మాత్రం ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇలా ఉపయోగించే కాల్‌లోని ఇన్‌కమింగ్ అవుట్‌గోయింగ్ కాల్స్‌ను రికార్డు చేయడంతో పాటు రిజిస్టర్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శే్వత, జిల్లా విద్యశాఖ అధికారి మదన్‌మోహన్, డిఆర్‌ఓ మణిమాలతో పాటు జిల్లాలోని డివిజన్, మండల స్థాయి విద్యశాఖ అధికారులు హాజరయ్యారు.