నిజామాబాద్

విద్యార్థుల ఆందోళనకు జెసి స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూలై 23: జిల్లా కేంద్రంలోని కళాశాల విద్యార్థినుల వసతి గృహం బాలికల సమస్యలపై టిజిపివి శనివారం విద్యార్థులతో కలిసి చేపట్టిన ఆందోళనకు జాయింట్ కలెక్టర్ సత్తయ్య స్పందించారు. ఆందోళన చేపట్టిన టిజివిపి విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్, జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ ఆదివారం జెసిని కలిసి సమస్యను విన్నవించారు. అప్పటికే పత్రికల్లో సమస్యను తెల్సుకున్న జెసి విద్యార్థినుల వసతిగృహంలో నెలకున్న ప్రధానమైన నీటి సమస్యను సత్వరమే పరిష్కరించాల్సిందిగా (జిల్లా గిరిజన సంక్షేమ శాఖ)డిటిడిఓ అధికారి గంగాధర్‌ను జెసి ఆదేశించారు. జెసి ఆదేశాల మేరకు వెంటనే బాలికల వసతిగృహాన్ని టిజివిపి నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా ఆయన విద్యార్థినులతో సమావేశమై హాస్టల్‌లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ప్రధానంగా ఉన్న నీటి సమస్యను తీర్చేందుకు స్థానిక ఆర్డీఓ శ్రీనుతో మాట్లాడి, ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకుని వచ్చి హాస్టల్‌లో ఉన్న పెద్ద ట్యాంకును నింపేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సత్తయ్య హాస్టల్ విద్యార్థినులకు శాశ్వతంగా నీటి సమస్యను తీర్చేందుకు బోర్ వేయిస్తానని హామీ ఇచ్చినట్లు టిజివిపి రాష్ట్ర కార్యదర్శి నవీన్ చెప్పారు. ఇంతే కాకుండా గిరిజన బాలుర వసతి గృహంలో చెడిపోయిన బోర్‌ను వెంటనె మరమ్మతులకు ఆదేశించారని తెలిపారు. అదనపు గదుల నిర్మాణం కోసం, అలాగే 50సీట్లకు అడ్మిషన్లు తీసుకోవాల్సిందిగా డిటిడిఓను జెసి ఆదేశించారని అన్నారు. ఆందోళనకు స్పందించిన కోరిన వెంటనే సమస్యల పరిష్కారం కోసం హామీ ఇస్తూ తాత్కలికంగా నీటి ఎద్దడి నివారణకు సత్వర చర్యలు చేపట్టిన జాయింట్ కలెక్టర్ సత్తయ్యకు, అలాగే డిటిడిఓ గంగాధర్‌లకు టిజివిపి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. డిటిడిఓతో పాటు హాస్టల్‌ను సందర్శించిన వారిలో టిజివిపి నాయకులు ఓంకార్, నాగరాజు, మనోహర్, హాస్టల్ వార్డెన్‌లు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.