నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. మంచిగ భూరి భూసుర సమాజములెల్లను భక్తితోడఁబూ
జించి, యభీష్టదానములు సేసి, ధనార్థులఁ దన్పి దిక్కులన్
నించె యశంబు బంధులకు నెయ్యురకున్ హృదయప్రియంబుగా
బంచె విభూతి యేర్పడఁ బవిత్రుఁడు ధర్మసుతుండు నెమ్మితోన్
భావం: పుణ్యాత్ముడైన ధర్మరాజు ఎందరెందరో బ్రాహ్మణుల్ని భక్తితో పూజించాడు. కోరిన వాళ్లకు కోరినంత దానాలిచ్చి తృప్తి పరిచాడు. తన కీర్తి అన్ని దిక్కుల వ్యాపింపచేశాడు. తన ఐశ్వర్యం ప్రకాశించేటట్లు ప్రేమతో బంధుమిత్రులకు ఆనందం కలిగించాడు. మయుడు నిర్మించిన ఇచ్చి సభాభవన ప్రవేశం కొరకు అటు విప్రులను, పురప్రముఖులనే కాక బంధుమిత్రులను కూడా ధర్మరాజు పూజించాడు.

మహాభారతం లోని పద్యము