రంగారెడ్డి

వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దారూర్: అన్ని రంగాల్లో వెనుకబడిన వికారాబాద్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు పిలుపునిచ్చారు. గురువారం ధారూర్ మండలంలో పర్యటించిన ఆయన హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో ఈప్రాంతం నుండి ఒక్కరైనా లేరని, ప్రభుత్వం కల్పిస్తున్న విద్యావకాశాలను సద్వినియోగం చేసుకుని ఈప్రాంతం నుండి ఐఎఎస్, ఐపిఎస్‌లుగా ఎంపిక కావాలని ఆకాంక్షించారు.నాగారం సబ్‌స్టేషన్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో విద్యుత్ ఎస్‌ఇ జానకిరాం, డిఇ దుర్గారావు పాల్గొనగా ధారూర్ పర్యటనలో గోధుమగూడ సర్పంచ్ స్వరూప, జైదుపల్లి సర్పంచ్ సంతోష, తరిగొపుల సర్పంచ్ రవికుమార్, మైలారం సర్పంచ్ శంకర్, నాగారం సర్పంచ్ ప్రమీల, ధారూర్, వికారాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్‌లు రాజునాయక్, ఎస్.రాంచంద్రారెడ్డి, పిఎసిఎస్ వైస్‌చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, వికారాబాద్ జడ్పిటిసి ముత్తార్‌షరీఫ్, ధారూర్ మార్కెట్ కమిటి వైస్‌చైర్మన్ సంతోష్, పంచాయతిరాజ్ డిఇఇ రాజ్‌మోహన్, వికారాబాద్, ధారూర్ తహశీల్దార్లు చినప్పలనాయుడు, గాయత్రి, ధారూర్ ఎంపిడివో మున్నయ్య, పంచాయతిరాజ్ ఎఇ లక్ష్మయ్య పాల్గొన్నారు.

ఆటో ఢీకొని చేతులు కోల్పోయిన విద్యార్థి
శంకర్‌పల్లి : చదువుకుంటూ ఆడుకునే విద్యార్థి రెండు చేతులు రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన హృదయ విదారక సంఘటన గురువారం ఉదయం మండల కేంద్రమైన శంకర్‌పల్లిలో చేవేళ్ళ రోడ్డుపై జరిగింది. ఎస్‌ఐ క్రాంతికుమార్ వివరాలు మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన గజేందర్‌రెడ్డి, రమ దంపతులు 10 సంవత్సరాల క్రితం బతుకుదెరువుకు శంకర్‌పల్లికి వచ్చి స్థానిక హనుమాన్‌నగర్ కాలనీలో నివాసముంటున్నారన్నారు. వీరు క్యాటరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీరి 12 సంవత్సరాల కుమారుడు ప్రతాప్‌రెడ్డి స్థానిక శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చతువుకుంటున్నాడు.. గురువారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంటి నుండి స్కేల్ కొనడానికి జనరల్ స్టోర్‌కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా టాటా ఏస్ ఆటో నెంబర్ ఏపీ 23 వై 8969 వేగంగా వచ్చి ప్రతాప్‌రెడ్డిని ఢీ కొట్టిందని చెప్పారు. ఆటో చక్రాలు రెండు చేతుల మీదుగా వెళ్ళడంతో చేతులు నుజ్జు నుజ్జు అయ్యాయ. ఆటో డ్రైవర్ ఆటోను సంఘటనా స్థలంలోనే వదిలి పారిపోయాడు. 108లో ప్రతాప్‌రెడ్డిని నగరంలోని గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.