ఆటాపోటీ

‘మారథాన్’ ఫిడిప్పిడెస్ (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మారథాన్ పరుగుకు గ్రీకు వీరుడు ఫెడిప్పిడెస్‌కు అవినాభావ సంబంధం ఉంది. క్రీస్తుపూర్వం 490 సంవత్సరంలో గ్రీస్‌పై పర్షియా దండయాత్ర చేసింది. దానిని ‘మారథాన్ యుద్ధం’గా పేర్కొంటారు. ఆ పోరాటంలో గ్రీస్ విజయం సాధించింది. ఈ సమాచారాన్ని అందించేందుకు గ్రీకు సైనికుడు ఫెడిప్పిడెస్ మారథాన్ యుద్ధ మైదానం నుంచి ఏథెన్స్ వరకు 26.219 మైళ్లు (42.195 కిలో మీటర్లు) పరిగెత్తాడు. గెలిచామని ఆనందంగా చెప్తూనే అలసటతో కుప్పకూలి అక్కడే మృతి చెందాడు. అతని జ్ఞాపకటంగా 1896 తొలి ఒలింపిక్స్‌లో మారథాన్ రేస్‌ను చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒలింపిక్స్‌లోనేగాక, వివిధ దేశాల్లోనూ మారథాన్ రన్ జరుగుతునే ఉంది.
భారత్‌ది 91వ స్థానం
* ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పతకాల పట్టికలో భారత్ 91వ స్థానంలో ఉంది. అమెరికా సమోవా, బోస్నియా అండ్ హెడ్జగోవినా, కేమాన్ ఐలాండ్స్, డొమినికా, హైతీ, ఇరాన్, సౌదీ అరేబియా, జింబాబ్వే దేశాలు కూడా భారత్‌తో సమంగా ఒకే ఒక పతకాన్ని సంపాదించాయ. 2003లో పారిస్‌లో ప్రపంచ అథ్లెటిక్స్ జరిగినప్పుడు మహిళల లాంగ్ జంప్‌లో అంజూ బి. జార్జి కాంస్య పతకాన్ని సాధించింది. అంతకు ముందుగానీ, ఆ తర్వాతగానీ ఎవరూ ఈ వరల్డ్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాన్ని అందించలేదు. అంజూ జార్జి జాబితాలో ఈసారైనా ఎవరైనా చేరుతారో లేక ఎప్పటి మాదిరిగానే చేతులెత్తేస్తారో చూడాలి.
నడకలో మేటి
* సామాన్యులు ఎవరైనా కొద్ది దూరం నడిస్తేనే కాళ్ల నొప్పులతో అల్లాడిపోతారు. కానీ స్పెయన్‌కు చెందిన జీసస్ ఏంజెల్ గార్సియాది అలుపెరుగని నడక. పురుషుల 50 కిలోమీటర్ల నడకలో గార్సియా ఇంత వరకూ 12సార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడ్డాడు. ఈ మెగా టోర్నీలో ఎక్కువసార్లు పాల్గొన్న ఘనత అతనిదే. పోర్చుగల్ అథ్లెట్ సుసాన్ ఫీటర్ తన కెరీర్‌లో 11 పర్యాయాలు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొంది. మహిళల 10 మీటర్ల నడకలో ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకున్న ఆమె రెండున్నర దశాబ్దాలకుపైగా కెరీర్‌ను కొనసాగించడం విశేషం. జర్మనీకి చెందిన డిస్కస్ త్రోయర్ ఫ్రాంక్ డిశ్చ్, విర్గిలిజస్ అలెన్కా (లిథుయేనియా) చెరి పది పర్యాయాలు పోటీపడ్డారు.

- సత్య