ఆటాపోటీ

క్రీడలకు మణిహారం అథ్లెటిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని క్రీడలున్నా, ఎన్ని ఈవెంట్స్ జరుగుతున్నా, అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ మీట్ ఉందంటే అభిమానులకు పండగే. నిజమైన క్రీడాకారుడికి అవసరమైన శారీరక, మానసిక దృఢత్వాన్ని కేవలం అథ్లెట్లలోనే చూస్తాం. ప్రపంచ వ్యాప్తంగా కాంటినెంటల్ పోటీలకు కూడా విశేషమైన ఆదరణ ఉన్నదంటే, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌ను ఎంతగా కోరుకుంటారో.. ఏ స్థాయలో ఆదరిస్తారో ఊహించుకోవచ్చు. ఆటలు మొదలైందే అథ్లెటిక్స్‌తో... నడక నేర్చిన నాటినుంచి పరుగు తీయడానికి ప్రయత్నించని వారు ఉండరు. ఆ రకంగా చూస్తే, భూమిపై పుట్టినవారంతా అథ్లెట్లే. ఫుట్‌బాల్ లేదా వాలీబాల్.. క్రికెట్ లేదా సాఫ్ట్‌బాల్.. హాకీ లేదా గోల్ఫ్.. టెన్నిస్ లేదా బాడ్మింటన్.. ఆట ఏదైనా, ఆటగాళ్లంతా ఫిట్నెస్‌కోసం తప్పనిసరిగా అథ్లెటిక్స్‌ను సాధన చేయాలి. అథ్లెట్లకు ఆ అవసరం లేదు. వారు తమ తమ క్రీడాంశాలనే ఫిట్నెస్ ట్రైనింగ్‌గానూ ఎంపిక చేసుకుంటారు.
చారిత్రక నేపథ్యం
అథ్లెటిక్స్‌కు చారిత్రక నేపథ్యం ఉంది. గ్రీకు, మొసపటోమియా, సింధులోయ వంటి అతి ప్రాచీన నాగరికతల్లో అథ్లెటిక్స్‌కు సంబంధించిన సమాచారం, బొమ్మలు, ఇతర ఆధారాలు ఉన్నాయ. ఒక రకంగా చెప్పాలంటే, మనిషి జీవితంలో అథ్లెటిక్స్ ఒక భాగమైంది. మొదట్లో విధివిధానాలంటూ ఏవీ లేకుండానే వివిధ రకాలైన అథ్లెటిక్స్ పోటీలు జరిగాయ. ఆ తర్వాతి కాలంలో క్రమంగా నియమ నిబంధనలు వచ్చి చేరాయ. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ అథ్లెటిక్స్ పోటీలు జరగడం ఆనవాయతీగా మారింది. అయతే, అథ్లెటిక్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఉండాలన్న ఆలోచన సుమారు శతాబ్దం క్రితం తెరపైకి వచ్చింది. అదే సమయంలో ఒలింపిక్స్‌ను వేదికగా తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌లో ఆయా అథ్లెట్ల అత్యుత్తమ ప్రదర్శనలనే ప్రపంచ రికార్డులుగా గుర్తిస్తామనం 1913లో అంతర్జాతీయ అథ్లెటిక్ సంఘాల సమాఖ్య (ఐఎఎఎఫ్) తీర్మానించింది. కొన్ని దశాబ్దాలపాటు ఇదే విధానం కొనసాగింది. 1960 దశకం వరకూ ఒలింపిక్స్ రికార్డులే అనధికారికంగా ప్రపంచ రికార్డులుగా చెలామణి అయ్యేవి. కానీ, ఇతరత్రా ఈవెంట్స్‌లో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన చాలామంది అథ్లెట్లు ఒలింపిక్స్ కంటే మెరుగైన టైమింగ్ లేదా ఫీట్‌ను నమోదు చేసేవారు. ఈ విధంగా ఒలింపిక్స్ రికార్డులను అధిగమించిన అథ్లెట్ల పేర్లను అధికారికంగా ఎలా గుర్తించాలన్న ప్రశ్న తలెత్తింది. వారి రికార్డులను ఎక్కడ నమోదు చేయాలన్న విషయంపై జోరుగా చర్చ జరిగింది. కాలక్రమంలో అథ్లెటిక్స్‌లో ప్రత్యేకంగా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించాలన్న డిమాండ్ బలపడింది. 1970 దశకం నాటికి ఇది అన్ని దేశాల్లోనూ వ్యాపించింది. దీనితో 1976లో మొట్టమొదటి ప్రపంచ చాంపియన్‌షిప్ పేరుతో పురుషుల 50 కిలోమీటర్ల నడకలో పోటీని నిర్వహించారు. ఆతర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో 1983లో తొలి ప్రపంచ అథ్లెటిక్స్ మీట్ అధికారికంగా జరిగింది. హెల్సిన్కీలో మొదటి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ జరిగాయ. అందులో 154 దేశాల నుంచి 1,300 మంది పోటీపడ్డారు. అది ప్రారంభం మాత్రమే. డిమాండ్ పెరుగుతున్నకొద్దీ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే దేశాల సంఖ్యకూడా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 190కి పైగా దేశాలు ప్రపంచ అథ్లెటిక్స్‌కు హాజరవుతున్నాయి.
నాలుగు నుంచి రెండేళ్లకు..
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌ను మొదట్లో ఒలింపిక్స్ మాదిరిగానే నాలుగేళ్లకోసారి నిర్వహించాలని ఐఎఎఎఫ్ తొలుత నిర్ణయంచింది. ఆ ప్రకారమే 1983, 1987, 1991లో వరుసగా మొదటి మూడు ప్రపంచ చాంపియన్‌షిప్స్ జరిగాయ. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆదరణను, డిమాండ్‌ను చూసిన తర్వాత ఈ పోటీలకు నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు కుదించారు. దీనితో నాలుగో వరల్డ్ అథ్లెటిక్స్ 1993లో జరిగాయ. అప్పటినుంచి రెండేళ్లకోసారి జరుగుతున్నప్పటికీ, పోటీకి దిగే దేశాలతోపాటు, ఈవెంట్స్ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే వస్తున్నది. 1987లో మహిళల 10,000 మీటర్ల పరుగు, 10 కిలోమీటర్ల నడక పోటీలను చేర్చారు. 1993లో మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఈ జాబితాలో చేరింది. 1995లో మహిళల 5,000 మీటర్ల పరుగును ఒక విభాగంగా చేర్చారు. అదే సమయంలో, అంతకుముందు మహిళలకు ఉన్న 3,000 మీటర్ల పరుగును తొలగించారు. 1999లో మహిళల పోల్ వాల్ట్, హ్యామర్ త్రో పోటీలను కూడా ప్రధాన క్రీడాంశాలతో జత కలిపారు. మహిళల 10 కిలోమీటర్ల నడక స్థానంలోనే 20 కిలోమీటర్ల నడక చేరింది. 2005లో మహిళల 3,000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ను తెరపైకి తెచ్చారు. మొత్తం మీద అత్యంత ఆకర్షణీయంగా పోటీలను నిర్వహిస్తున్నారు. అథ్లెట్లు నెలకొల్పుతున్న అసాధారణ ప్రమాణాలు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా ఈవెంట్‌గా ఆవిష్కరింపచేశాయి. కార్ల్ లూయస్, బెన్ జాన్సన్ వంటి అథ్లెట్లు నెలకొల్పిన రికార్డులు కూడా బద్దలవుతున్నాయంటే, అథ్లెట్లు ఏ స్థాయిలో సిద్ధమవుతున్నారన్నది స్పష్టమవుతుంది. అలాంటి అద్వితీయ టోర్నమెంట్ ఈసారి ఆగస్టు 4 నుంచి 13 వరకు లండన్‌లో జరుగుతుంది. 2019 పోటీలకు దోహా ఎంపికైంది.
రెండూ వేరువేరు!
ట్రాక్ అండ్ ఫీల్డ్ అన్న పదాన్ని నేడు అథ్లెటిక్స్‌కు పర్యాయ పదంగా వాడుతున్నారుగానీ, అవి రెండూ వేరువేరు. ట్రాక్‌పై, ఫీల్డ్‌పై వేరువేరుగా పోటీలు జరిగేవి. పరుగు, నడక వంటి పోటీలను నిర్వహించే సమయంలో, ఒకరికి ఒకరు అడ్డు పడకుండా, ఒకరినొకరు ఉద్దేశపూర్వకంగా నిలువరించకుండా ఉండేందుకు ప్రత్యేకంగా లేన్స్‌ను సిద్ధం చేసేవారు. వాటినే ట్రాక్స్ అని పిలిచేవారు. కాగా, జావెలిన్ త్రో, హ్యామర్ త్రో వంటి పోటీలు పచ్చిక మైదానాల్లో జరిగేవి కాబట్టే వాటిని ఫీల్డ్ ఈవెంట్స్ అన్నారు. కాలక్రమంలో ఫీల్డ్ ఈవెంట్స్‌ను కూడా స్టేడియాల్లో, కృత్రిమ పచ్చికపై నిర్వహించే సంప్రదాయం వచ్చింది. ట్రాక్, ఫీల్డ్ కలిసిపోయాయ. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒకే పదంగా మారింది. అథ్లెటిక్స్‌నే ఇప్పుడు ట్రాక్ అండ్ ఫీల్డ్‌గా అభివర్ణిస్తున్నారు.

- శ్రీహరి