ఆటాపోటీ

అభిమానికి స్కర్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్‌లో సీనియస్ మ్యాచ్‌లే కాదు.. సరదా సన్నివేశాలూ ఉంటాయి. ఈసారి వింబుల్డన్‌లో మహిళల ఇన్నిటేషనల్ డబుల్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చోటుచేసుకుంటున్న సంఘటన అందరికీ నవ్వు తెప్పించింది. మ్యాచ్‌లో ఒక షాట్‌కు సిద్ధమవుతున్న కిమ్ క్లిజ్‌స్టెర్స్ హఠాత్తుగా ఆగి, ఎక్కడినుంచి సర్వ్ చేస్తే పాయింట్ లభిస్తుందో చెప్పాల్సిందిగా ప్రేక్షకులను అడిగింది. ఓ టెన్నిస్ అభిమాని ఉత్సాహంతో ‘బాడీ’ అంటూ పెద్దగా అరిచాడు. క్లిజ్‌స్టెర్స్ అతనిని కోర్టులోకి వచ్చి సర్వ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. అతను ఏమాత్రం తడబడకుండా పరుగు పరుగున వచ్చేశాడు. ఆ వ్యక్తి ఆకుపచ్చ షార్ట్స్ ధరించడాన్ని చూసిన క్లిజ్‌స్టెర్స్ వెంటనే తన లగేజీ బ్యాగ్‌నుంచి ఒక తెల్లస్కర్ట్‌ను తీసి, అతనికి తొడిగింది. ఆ స్కర్ట్ వేసుకొని అతను సర్వ్ చేశాడు. ఈ సన్నివేశాన్ని వీక్షించిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు.