ఆటాపోటీ

పచ్చి నిజాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబద్ధం చెప్పడానికి నైపుణ్యం ఉంటే సరిపోతుందేమోగానీ, నిజం చెప్పాలంటే ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా, ఎలాంటి సమస్యలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పచ్చి నిజాలు చెప్పేవారు క్రీడా రంగంలో దాదాపు కనిపించరు. కానీ, ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ బెర్నార్డ్ టామిక్ నిజాలను నిర్భయంగా మాట్లాడేవారిలో తాను ఉన్నట్టు నిరూపించాడు. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లోనే టామిక్ ఓడిపోయాడు. ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ మ్యాచ్ తనకు చాలా బోర్ కొట్టిందని వ్యాఖ్యానించాడు. ఫలితంగా నిర్వాహకులు అతనికి 15,000 డాలర్ల జరిమానా విధించారు. ఆ సంఘటనతో టామిక్ భయపడతాడని, తన మనసులో ఉన్న అభిప్రాయాలను ఇకముందు ఇంత నిక్కచ్చిగా బయటపెట్టడని అంతా ఊహించారు. కానీ, తాను ఎవరికీ భయపడేది లేదని అతను నిరూపించాడు. తాజా ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. తనకు టెన్నిస్ అంటే ఏ మాత్రం ఇష్టం లేదని, కేవలం డబ్బుకోసమే ఆడుతున్నానని కుండ బద్దలు కొట్టాడు. దాదాపు అన్ని క్రీడల్లోనూ, ప్రొఫెషనల్స్ అంతా కోట్లకు పడగలెత్తాలన్న తాపత్రయంతోనే కెరీర్‌ను కొనసాగిస్తారు. క్రీడలపై ఉన్న ఇష్టంతోనే ఆడుతున్నామని పదే పదే ప్రకటనలు గుప్పించినా, సంపాదనే వారి ప్రధాన లక్ష్యమన్నది అందరికీ తెలిసిన సత్యమే. అయితే, టామిక్‌లా ఎవరూ డబ్బుకోసం ఆడుతున్నామని ప్రకటించరు. మనసులో ఉన్నది జంకూగొంకు లేకుండా నిర్భయంగా చెప్పే అతను తన మ్యాచ్‌లను చూసేందుకు డబ్బులు ఖర్చు చేయవద్దని అభిమానులకు సూచించాడు. ‘టికెట్ కొనుక్కొని మ్యాచ్‌లకు వస్తే, ఒక్కోసారి నిరాశ పడతారు. అందుకే, ఇంట్లోనుంచి కదలకుండా, టీవీల్లో మ్యాచ్‌లు చూడండి’ అని సలహా ఇచ్చాడు. తాను వంద శాతం అత్యుత్తమ సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే కోర్టులోకి దిగుతానని, కానీ, 30 శాతం మాత్రమే ఆడగలుగుతానని చెప్పాడు. ఈ వ్యాత్యాసమే మ్యాచ్ ఫలితాలను నిర్ధారిస్తుందని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఒకప్పుడు 17వ స్థానంలో ఉండి, ప్రస్తుతం 73వ స్థానానికి పడిపోయిన టామిక్ అన్నాడు. అక్కడితో ఆగకుండా, టెన్నిస్ ఆడవద్దని యువతకు పిలుపునిచ్చాడు. ‘టెన్నిస్ ఆడకండి, మీరు ఇష్టపడే పని చేయండి. నేను ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చి ఇరుక్కుపోయాను’ అన్నాడు. తాను గతంలో చేసిన లేదా ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలకు ఏమాత్రం చింతించడం లేదని, తమ మనసులో ఉన్నదే బయటకు చెప్తున్నానని వ్యాఖ్యానించాడు. ఎవరు, ఎన్ని రకాలుగా విమర్శించినా తాను పట్టించుకోనని స్పష్టం చేశాడు. బ్రేవో టామిక్.